Hanuman Shooting Locations: విజువల్ ట్రీట్ ఇచ్చిన 'హనుమాన్' విగ్రహం నిజంగా ఉందా? మూవీ షూటింగ్ లొకేషన్స్ ఎక్కడంటే..
Hanuman: తక్కువ బడ్జెట్‌లోనే విజువల్ ట్రీట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉందని, విజువల్స్ అయితే నెక్ట్స్ లెవల్ అంటున్నారు.
Hanuman Movie Shooting Locations: ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ ఇండియన్ బాక్సాఫీసు షేక్ చేస్తోంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 115పైగా కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటికే కలెక్షన్లలో అదే జోరు చూపిస్తోంది. ఇక హిందీ బాక్సాఫీసు వద్ద హనుమాన్ ప్రభంజనం సృష్టిస్తోంది. రోజురోజుకు అక్కడ థియేటర్లు పెంచుకుంటూ పోతుంది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం హనుమాన్‌కు అక్కడ మరింత ప్లస్ అయ్యింది. అప్పటి వరకు హనుమాన్ విజయవంతంగా కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.
తక్కువ బడ్జెట్‌లోనే విజువల్ ట్రీట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉందని, విజువల్స్ అయితే నెక్ట్స్ లెవల్ అంటున్నారు. అంతేకాదు ఈ మూవీ లోకేషన్న్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో నార్త్ ఆడియన్స్‌తో పాటు సౌత్ ఆడియన్స్ ఈ లోకేషన్ ఎక్కడా అని ఆరా తీస్తున్నారు. అవి రియలా? లేక గ్రాఫిక్స్‌లో చూపించారా? సందేహిస్తున్నారు.అంతగా ఆకట్టుకుంటున్న హనుమాన్ లోకేషన్స్ ఆంధ్రప్రదేశ్‌లోనివే అని తెలిసి అంతా అవాక్కవుతున్నారు. హనుమాన్ విగ్రహం, విశాలమైన గ్రీనరి స్పాట్స్‌లో ఏపీలోవే అనే విషయం తెలుసా? అయితే పర్యాటక ప్రాంతాలు, షూటింగ్ లోకేషన్స్ స్పాట్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం!
హనుమాన్ సినిమాలో హనుమాన్ విగ్రహం
హనుమాన్‌లోని చర్చనీయాంశాలలో హనుమాన్ విగ్రహం ఒకటి. మూవీలో అందరిని అబ్బురపరిచిన సీన్ హనుమాన్ విగ్రహం. దాని చూట్టు ఉన్న లోకేషన్‌కి ప్రతి ఒక్క ఆడియన్ ఫిదా అవుతున్నారు. ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే, నిజానికి ఈ ఐకానిక్ విగ్రహం నిజం కాదు. వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్ ద్వారా అతిపెద్ద హనుమాన్ విగ్రహానికి జీవం పోశారు. విజువల్ వండర్‌గా ఉన్న హనుమాన్ సీన్ సినిమా మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. నిజానికి ఇది ఆడియన్స్‌కి విజువల్ ట్రీట్ ఇచ్చిందనడం సందేహం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి, పాడేరు లోకేషన్స్
హనుమాన్ షూటింగ్ ఎక్కువ శాతం ఏపీలో మారేడుమిల్లి, పాడేరులో జరిగింది. అక్కడ దాదాపు 130 రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఈ లోకేషన్లనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అత్యద్భుతంగా మలిచారు. యాక్షన్ సన్నివేశాలు మరియు పాటలను సెప్టెంబర్ 2021లో మారేడుమిల్లి, పాడేరులో చిత్రీకరించారు. డిసెంబర్ 2021 నాటికి దాదాపు 60 శాతం షూటింగ్ ఇక్కడ పూర్తయింది. మారేడుమిల్లిలో చూట్టూ సుందరమైన ప్రదేశాలు, దట్టమైన అడవులు ఉన్న సంగతి తెలిసిందే.
ఇక్కడే చాలా వరకు తెలుగు సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి. ‘పుష్ప’ వంటి పాన్ సినిమా షూటింగ్ కూడా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనే జరిగాయి. అందుకే అక్కడ చుట్టు ఉన్న అందమైన ప్రదేశాలను సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా మార్చింది ఏపీ ప్రభుత్వం. అటవీ శాఖ ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా డెవలప్ చేసింది. జలతరంగిణి జలపాతం, అమృతధార జలపాతం, మన్యం వ్యూపాయింట్, సోకులేరు వ్యూపాయింట్, భూపతిపాలెం రిజర్వాయర్, రంప జలపాతాలు ఆకర్షణియమైన టూరిజం ప్రదేశాలు. మారేడుమిల్లి కాఫీ ఉత్పత్తికి కూడా పేరుగాంచింది. పాడేరు గురించి చెప్పాలంటే విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ ప్రాంతం ఉంది.
Also Read: రోజూ రెండు రౌండ్లు మద్యం, స్వీట్స్ తినకపోతే నిద్ర రాదు - నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవేనట