అన్వేషించండి
Advertisement
Mohan Babu: 'ఇక గొడవలొద్దు.. ఆపేయండి..' మోహన్ బాబు వ్యాఖ్యలు..
మంచు విష్ణు విజయం ఒక్కరి విజయం కాదు.. అందరు సభ్యుల విజయం. మా సభ్యుల అందరి విజయంగా అభివర్ణించారు మోహన్ బాబు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు. 'మా' అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రకాష్ రాజ్‌పై వందకి పైగా ఓట్ల ఆధిక్యంతో విష్ణు గెలుపొందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది. దీనిపై స్పందించిన మోహన్ బాబు.. ఇది ఒక్కరి విజయం కాదు.. అందరు సభ్యుల విజయం. మా సభ్యుల అందరి విజయంగా అభివర్ణించారు. ఇక గొడవలు వద్దు.. ఆపేయండని అన్నారు. బాబా ఆశీస్సులు, మా సభ్యుల ఆశీస్సులతో మంచు విష్ణు ముందుకు సాగుతాడని అన్నారు.
''నా బిడ్డ వంద శాతం విజయాన్ని సాధిస్తాడు. చెప్పినవి చెప్పినట్లుగా చేసి తీరుతాడు. గతం గతహ.. జరిగింది మరిచిపోదాం. అందరూ ఒకతల్లి బిడ్డల్లా కలిసి నడుద్దాం. ప్రెసిడెంట్ అనుమతి లేకుండా మా సభ్యులెవరూ మీడియాతో మాట్లడొద్దు.. భవిష్యత్తులో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇలా జరగకూడదని'' ఆకాంక్షించారు.
అందరం కలిసి చర్చించుకుని ఏకగ్రీవంగా మా అధ్యక్షుడిని ఎన్నికుందామని చెప్పారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశీస్సులు తన బిడ్డకు ఉండాలంటూ ఆకాంక్షించారు. నరేష్ గురించి చెప్పాలంటే.. ఈ ఎన్నికల కోసం ఎంతగానో శ్రమించాడని.. అతడి కష్టానికి ప్రతిఫలం దక్కిందని అన్నారు. గత రెండు నెలలుగా సభ్యులు చాలా కష్టపడ్డారని.. భార్యాబిడ్డలను సైతం కొన్ని రోజులగా పట్టించుకోకుండా మంచు విష్ణు విజయం కోసం ఎంతగానో పాటుపడ్డారని చెప్పారు. బాలయ్య, నాగార్జున, నా మిత్రుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా అందరి ఆశీస్సులు విష్ణుకు ఉండాలన్నారు.
Also Read: 'మా' ఎన్నికల్లో ఓటేసిన పవన్ కల్యాణ్.. అది అవసరమా అనిపించింది అంటూ కామెంట్
Also Read ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!
Also Read: ‘మా’లో రచ్చ.. శివబాలాజీ చేయి కొరికిన హేమా.. ప్రకాష్ రాజ్‌తో మంచు ఫైట్
Also Read: 'ఆర్ఆర్ఆర్'లో ఎవరూ చూడని స్టిల్స్..
Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement