News
News
X

Uorfi Javed Files Complaint: బహిరంగ ప్రదేశాల్లో అర్థనగ్న ప్రదర్శనా? బీజేపీ నాయకురాలిపై ఉర్ఫీ జావేద్ ఫిర్యాదు

ఉర్ఫీ జావేద్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

FOLLOW US: 
Share:

వింత వస్త్రధారణతో నిత్యం సోషల్ మీడియాలో హంగామా చేసే ఉర్ఫీ జావేద్, మరోసారి వార్తల్లోకి ఎక్కింది. బీజేపీ మహిళా నాయకురాలు చిత్ర కిషోర్‌ వాఘ్‌ పై మ‌హారాష్ట్ర మ‌హిళా కమిష‌న్‌ లో ఫిర్యాదు చేసింది. తన డ్రెస్సింగ్ స్టైల్ మీద  వాఘే అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. ఆమెపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. పాపులర్ నటిపై బెదిరింపులకు పాల్పడినందుకు వాఘ్ మీద ఫిర్యాదు చేసినట్లు ఉర్ఫీ న్యాయవాది నితిన్ సత్పుటే వెల్లడించారు.

మహిళా కమిషన్ కు ఉర్ఫీ ఫిర్యాదు

ప్రముఖ నటి మోడల్ అయిన ఉర్ఫీపై, బీజేపీ నేత చిత్ర కిషోర్ వాఘ్‌ బెదింపు ధోణిలో మాట్లాడారని ఆమె లాయర్ వెల్లడించారు. వాఘ్‌ మీద  ఐపీసీ సెక్షన్‌  U/s 153(A)(B), 504, 506, 506(ii) కింద కంప్లైంట్ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ రుపాలీ చకంకర్‌ ను కలిసి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశానని చెప్పారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు, చిత్ర కిషోర్‌ వాఘే వ్యాఖ్యల తర్వాత, ఉర్ఫీ ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమెకు రక్షణ కల్పించాలని కోరినట్లు న్యాయవాది నితిన్ వెల్లడించారు.

బీజేపీ నాయకురాలు ఏమన్నారంటే?

జనవరి 4న బీజేపీ నేత చిత్ర  కిషోర్‌ వాఘే, ఉర్ఫి జావేద్‌ వస్త్రధారణపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  ఉర్ఫీ డ్రెస్సింగ్‌పై మ‌హిళా క‌మిష‌న్ ఏమైనా చేస్తుందా?  అంటూ క్వశ్చన్ చేశారు. బ‌హిరంగంగా అర్ధ‌న‌గ్న ప్రదర్శనలు చేస్తున్నా, మహిళా కమిషన్ ఎందుకు చూస్తూ ఉరుకుంటుందని ప్రశ్నించారు.  వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను మాట్లాడేది ఒక్క ఉర్ఫీ గురించి మాత్రమే కాదని, ఆమెలా ఎంతో మంది అర్థనగ్న వస్త్రధారణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోను చూసిన ఉర్ఫీ,   ఈ మేరకు ట్విటర్‌లో వీడియో విడుదల చేశారు.   ఈ ట్వీట్ల‌పై స్పందించిన ఉర్ఫి జావేద్ త‌న న్యాయ‌వాదితో మ‌హారాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్‌ కు కంప్లైంట్ చేయించారు.   

వింత డ్రెస్సింగ్ స్టైల్ తో ఉర్ఫీ పాపులర్

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఉర్ఫీ జావేద్. బిగ్ బాస్ ఓటీటీ రియాలిటీ షో ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందే పలు సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించింది. ‘బడే భయ్యా కీ దుల్హనియా’సీరియల్‌ తో బుల్లితెరకు పరిచయం అయ్యింది. ‘దుర్గా’ లాంటి సీరియల్ తన కెరీర్ కు ఎంతో ఉపయోగపడుంది. నిత్యం వింత వింత డ్రెస్సులతో కనిపించే ఉర్ఫీ, పలు వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నది.   

Read Also: 'RRR’ బాలీవుడ్ మూవీ కాదు, అసలు విషయం చెప్పిన దర్శకుడు రాజమౌళి!

Published at : 14 Jan 2023 03:51 PM (IST) Tags: Model Uorfi Javed BJP Leader Chitra Kishor Wagh Maharashtra Women Commission

సంబంధిత కథనాలు

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్

Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్

Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?

Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?

టాప్ స్టోరీస్

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి