Chiranjeevi On Tadap: RX 100 హిందీ రీమేక్ ట్రైలర్ పై మెగాస్టార్ ఏమన్నారంటే ...
తెలుగు బ్లాక్ బస్టర్ RX 100 హిందీ రీమేక్ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ చూసిన చిరంజీవి ట్వీట్ చేశారు..
![Chiranjeevi On Tadap: RX 100 హిందీ రీమేక్ ట్రైలర్ పై మెగాస్టార్ ఏమన్నారంటే ... Megastar Chiranjeevi Reaction On Rx 100 Hindi Remake Ahan Shetty And Tara Sutaria's 'Tadap' Movie Trailer Chiranjeevi On Tadap: RX 100 హిందీ రీమేక్ ట్రైలర్ పై మెగాస్టార్ ఏమన్నారంటే ...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/27/d42b3cc335cabc367b9bea0c643a33e3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆర్ఎక్స్ 100 సినిమా ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కార్తికేయ-పాయల్ రాజ్ పుత్ క్రేజ్ ని అమాంతం పెంచేసింది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేశారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి హీరోగా నటిస్తుండగా తారా సుతరియా హీరోయిన్. మిలన్ లుత్రియా దర్శకత్వంలో రీమేక్ అయిన ఈ మూవికి తడప్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.
RAW & INTENSE! #SajidNadiadwala’s #TadapTrailer looks impressive! 💥
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 27, 2021
Love & good wishes to #AhanShetty & the team! https://t.co/ZvewVcBFTQ#Tadap #FoxStarStudios @TaraSutaria @MilanLuthria @rajatsaroraa @ipritamofficial @NGEMovies @foxstarhindi @WardaNadiadwala @TSeries
ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన బిగ్ బీ అమితాబ్...'అహాన్ నువ్వు ఎదగడం చూశాను ఈరోజు నీ మొదటి ప్రయత్నం ద్వారా సినీ ప్రపంచానికి నిన్ను పరిచయం చేయడం సంతోషంగా ఉంది' తడప్ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
#SajidNadiadwala #TadapTrailer #Tadap #FoxStarStudios @TaraSutaria @MilanLuthria @rajatsaroraa @ipritamofficial @NGEMovies @foxstarhindi @WardaNadiadwala @TSeries @sunielvshetty https://t.co/kTHfEDFqba
— Amitabh Bachchan (@SrBachchan) October 27, 2021
ట్రైలర్ విషయానికి వస్తే బాలీవుడ్ ఆడియెన్స్ కోరుకునే విధంగానే సాలిడ్ విజువల్స్, యాక్షన్ తో నిండి ఉంది. అలాగే హీరో ఆహాన్ రెండు వేరియేషన్స్ లో కూడా మంచి లుక్స్ లో కనిపించాడు. తారా సుతారియా కూడా గ్లామరస్ గా ఉంది. మరి ఓవరాల్ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.
తడప్ ట్రైలర్ ఇక్కడ చూడండి.
Also Read: ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే...!
Also Read: 'మీ అమ్మాయి పెళ్లికోసం డబ్బు దాచకండి' సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
Also Read: ‘దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరుగని’ వరుణ్ తేజ్ మూవీ ఫుల్ సాంగ్ వచ్చేసింది
Also Read: ప్రీతమ్‌తో సమంత ఫొటో.. విదేశాలకు చెక్కేస్తున్నానంటూ..
Also Read: మెగా సినిమా షూటింగ్ కు ముహూర్తం పెట్టేశారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)