News
News
X

Mega154: అవన్నీ రూమర్స్ మాత్రమే - మెగాస్టార్ సినిమా సంక్రాంతికి పక్కా!

సంక్రాంతికి 'ఆదిపురుష్', 'వారసుడు' లాంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బాలయ్య సినిమా కూడా అప్పుడే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఈ క్రమంలో చిరు సినిమా వాయిదా పడనుందని ప్రచారం జరుగుతోంది.

FOLLOW US: 
 
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), దర్శకుడు బాబీ(Bobby) కాంబినేషన్ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

సంక్రాంతికి 'ఆదిపురుష్', 'వారసుడు' లాంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బాలయ్య సినిమా కూడా అప్పుడే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఈ క్రమంలో చిరు సినిమా వాయిదా పడనుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతమాత్రం నిజం లేదని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు సన్నిహితులైన కొందరు చిరు సినిమా సంక్రాంతికి రావడం పక్కా అని చెబుతున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారట. 'గాడ్ ఫాదర్' సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా బాబీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. దాదాపు టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. మహా అయితే నాలుగైదు రోజులు బ్యాలెన్స్ ఉంటుంది. అలానే మరో మూడు పాటలు షూటింగ్ చేయాల్సివుందట. అందులో రెండు డాన్స్ నెంబర్స్ కాగా.. మరొకటి ఐటెం సాంగ్ అని తెలుస్తోంది. మరో మూడు నెలల సమయం ఉంది కాబట్టి ఈ పాటల చిత్రీకరణ అప్పటికి పూర్తవ్వడం ఖాయం. కచ్చితంగా ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. 

గోదావరి యాసలో చిరు డైలాగ్స్:

News Reels

ఈ సినిమాలో ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడతారట. వింటేజ్ స్టఫ్ తో కూడిన మంచి ఎంటర్టైనర్ గా సినిమా నిలుస్తుందని ఇటీవల చిరు వెల్లడించారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, టీజర్ ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తామని చెప్పారు.

ఈ సినిమాలో చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.  

Read Also: పెళ్లికూతురుగా కీర్తి సురేష్‌ - బర్త్‌డే గిఫ్ట్ అదుర్స్, బరాత్‌లో మహానటి రచ్చ!
 
ఈ సినిమా కోసం పాటలు పూర్తి చేశారట దేవిశ్రీప్రసాద్. మొత్తం నాలుగు మాస్ సాంగ్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి సినిమాల్లో మాస్ సాంగ్స్ తో పాటు మెలోడీస్ కూడా ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం మెలోడీకి చోటు లేదట. కథ ప్రకారం.. నాలుగు పాటలు ఉంటే.. నాలుగూ కూడా మాస్ సాంగ్స్ అని తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ చాలా బాగా వచ్చిందని చెబుతున్నారు. రవితేజ, చిరంజీవి కాంబినేషన్ లో కూడా ఓ పాట ఉంటుందట. అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ నటుడు బిజూ మీనన్ ను విలన్ గా కనిపించనున్నారని టాక్. 

Published at : 17 Oct 2022 03:44 PM (IST) Tags: raviteja Bobby Mega154 Chiranjeevi Mega154 sankranthi release

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్, విన్నర్ ప్రైజ్ మనీ పెంచేందుకు వింత టాస్కులు

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్, విన్నర్ ప్రైజ్ మనీ పెంచేందుకు వింత టాస్కులు

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Tamannaah Interview : 'గుర్తుందా శీతాకాలం' ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఓపెన్ అయిన తమన్నా

Tamannaah Interview : 'గుర్తుందా శీతాకాలం' ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఓపెన్ అయిన తమన్నా

Mirzapur season 3: ‘మీర్జాపూర్’ సీజన్ 3 అప్‌డేట్ - ఎమోషనల్ పోస్టుతో గుడ్డూ భయ్యా గుడ్ న్యూస్!

Mirzapur season 3: ‘మీర్జాపూర్’ సీజన్ 3 అప్‌డేట్ - ఎమోషనల్ పోస్టుతో గుడ్డూ భయ్యా గుడ్ న్యూస్!

Telugu Movies Remake 2022 : తెలుగులో ఈ ఏడాది రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?

Telugu Movies Remake 2022 : తెలుగులో ఈ ఏడాది రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?

టాప్ స్టోరీస్

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

KTR Vs Bandi Sanjay : కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస - టెస్టులకు శాంపిల్స్ ఇవ్వాలని బండి సంజయ్ సవాల్ !

KTR Vs Bandi Sanjay :  కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస - టెస్టులకు శాంపిల్స్ ఇవ్వాలని బండి సంజయ్ సవాల్ !