Chiranjeevi Tested Covid Positive: చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్...

సినిమా ఇండస్ట్రీని అన్ని రకాలుగా పట్టిపీడిస్తోంది కరోనా. రోజురోజుకీ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తనకు కరోనా సోకిందని ట్వీట్ చేశారు..

FOLLOW US: 

కరోనా థర్డ్ వేవ్ ఇండస్ట్రీని వణికిస్తోంది. సినిమాల విడుదలకు సంబంధించిన ఇబ్బంది ఓవైపు.. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం మరోవైపు. వెండితెర, బుల్లితెర నుంచి కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా కరోనా బారిన పడిన చిరంజీవి..ఈ విషయాన్ని ట్వీట్ చేశారు..

పాజిటివ్ వచ్చిన విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలియజేశారు చిరంజీవి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తనకు పాజిటివ్ వచ్చిందని.. స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడినట్టు పోస్ట్ చేశారు. గతంలో ఓసారి చిరంజీవి కరోనా బారిన పడ్డారనే ప్రచారం జరిగింది. అప్పుడు వెంటనే స్పందించిన చిరంజీవి తప్పుడు కరోనా కిట్ తో పరీక్షించుకున్నానని..తాను బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డానన్నారు.   ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానన్న చిరంజీవి... గత రెండు మూడు రోజులుగా తనను కలిసిన  వారంతా వెళ్లి టెస్ట్ చేయించుకోవాలి సూచించారు. 

Also Read: కార్తీక్ పై మోనిత కుట్రని డాక్టర్ భారతి కనిపెట్టిందా, డాక్టర్ బాబుపై అలిగిన వంటలక్క … కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్

సినిమాల విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిరంజీవి 'ఆచార్య' విడుదలకు సిద్ధంగా ఉండగా, లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్, భోళా శంకర్, దర్శకుడు బాబితో మరో ప్రాజెక్ట్ సహా వెంకి కుడుములతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు చిరంజీవి కరోనా బారిన పడడంతో షూటింగ్ వాయిదా పడక తప్పదు. మరి చిరు కరోనా బారిన పడడంతో షెడ్యూల్స్ అన్నీ రెండు వారాల వెనక్కు వెళ్లినట్టే...

Also Read: దేవయానికి భారీ షాకిచ్చిన రిషి, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 26 Jan 2022 10:11 AM (IST) Tags: chiranjeevi Megastar Chiranjeevi chiranjeevi corona positive chiranjeevi tests positive chiranjeevi tests positive for coronavirus covid positive for chiranjeevi megastar chiranjeevi tests positive for covid-19 chiranjeevi tested positive for coronavirus chiranjeevi tests positive for covid-19 megastar chiranjeevi tested covid positive chiranjeevi corona chiranjeevi tests covid positive megastar chiranjeevi tests positive

సంబంధిత కథనాలు

Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సాంగ్ - ప్రోమో రిలీజ్ చేసిన రాజమౌళి

Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సాంగ్ - ప్రోమో రిలీజ్ చేసిన రాజమౌళి

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

టాప్ స్టోరీస్

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్ 

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్ 

Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?

Texas School Shooting :  మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?