Upcoming Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోయే సినిమాలివే!
మే చివరి వారంలో థియేటర్, ఓటీటీల్లో విడుదల కాబోయే సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

మే చివరి వారంలో థియేటర్, ఓటీటీల్లో విడుదల కాబోయే సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
ఎఫ్3:
వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటిస్తోన్న సినిమా 'ఎఫ్3'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 'ఎఫ్ 2' సినిమాలో కనిపించిన తారలే ఈ సినిమాలో కూడా కనిపించనున్నారు. వీరితో పాటు కొన్ని పాత్రలను యాడ్ చేశారు. అందులో సునీల్, సోనాల్ చౌహన్ లాంటి స్టార్లు ఉన్నారు. ఈ సినిమాను మే 27న విడుదల చేయనున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!
View this post on Instagram
టాప్ గన్:
1986లో వచ్చిన హాలీవుడ్ సినిమా 'టాప్ గన్' అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇన్నాళ్లకు ఈ సినిమాకి సీక్వెల్ గా 'టాప్ గన్: మావెరిక్' అనే సినిమా రాబోతుంది. మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియాలో అయితే మే 26 నుంచే టికెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి.
View this post on Instagram
ఓటీటీ రిలీజెస్:
అశోకవనంలో అర్జున కళ్యాణం:
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా మే 6న విడుదలైంది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయబోతుంది. మే 27 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
View this post on Instagram
కన్మణి రాంబో ఖతీజా:
విజయ్ సేతుపతి, సమంత, నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్ లో మంచి సక్సెస్ అయింది కానీ తెలుగులో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
View this post on Instagram
ఎటాక్:
జాన్ అబ్రహం, రకుల్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదలైంది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా జీ5 యాప్ లో మే 27 నుంచి ప్రసారం కానుంది.
స్ట్రేంజర్స్ థింగ్స్:
నెట్ ఫ్లిక్స్ లో పాపులర్ సిరీస్ లలో 'స్ట్రేంజర్స్ థింగ్స్' ఒకటి. ఇప్పటికే మూడు సీజన్లతో అలరించిన ఈ సిరీస్ ఇప్పుడు నాలుగో సీజన్ తో సందడి చేయబోతుంది. మే 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో సీజన్ 4 స్ట్రీమింగ్ కానుంది.
వీటితో పాటు.. ఫోరెన్సిక్ అనే సినిమా మే 24 జీ 5లో రాబోతోంది. ఒబీ వ్యాన్ కెనోబీ అనే వెబ్ సిరీస్ మే 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రానుంది. నిర్మల్ పాఠక్ కీ ఘర్ వాపసీ అనే హిందీ సిరీస్ మే 27 నుంచి సోనీ లివ్‌లో ప్రసారం కానుంది.
Also Read: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్
Also Read: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















