అన్వేషించండి

Pawan Kalyan: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!

పవన్ కళ్యాణ్ తన పిల్లలు, మాజీ భార్యను కలిసిన తాజా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pawan Kalyan Son Akira Nandan | వర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనంటే అభిమానులకు ప్రాణం. ఇక ఆయన తన వారసుడు అకీరా నందన్‌ను కలిశాడంటే చాలు.. అభిమానుల తెగ మురిసిపోతుంటారు. పవన్ కళ్యాణ్‌తో విడాకుల వల్ల కొడుకు అకిరా, కూతురు ఆద్యలు తల్లి రేణు దేశాయ్‌తోనే ఉంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పుడప్పుడు వారిని కలుస్తూనే ఉంటారు. ప్రత్యేక సందర్భాల్లో పవన్ పిల్లలతోనే గడుపుతుంటారు. తాజాగా అకీరా స్కూల్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తన పిల్లలు, రేణ దేశాయ్‌తో కలిసి ఫొటో తీసుకున్నారు. 

Also Read: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ

రేణు దేశాయ్ ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన కొడుకు అకిరాను ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ఒక శకం ముగుసిందంటే మరో శకం ప్రారంభమవుతుంది. మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం తల్లిదండ్రులుగా గర్వపడుతున్నాం. ఇక ఉదయాన్నే  స్కూల్‌కు  సిద్ధం కావక్కర్లేదు. బస్సు టైమింగ్ గురించి చింతించాల్సిన అవసరం లేదు. భోజనం సమయానికి ప్యాక్ చేయడానికి తొందరపడక్కర్లేదు. ట్యూషన్‌లు లేవు, పేటీఎం లేదు, పాఠశాల లేదు. నిజమైన ప్రయాణం ఇప్పుడే మొదలవుతుందని నేను అకిరాతో చెప్పాను. అతను తన తల్లిదండ్రుల ‘కాంతి’ అవసరం లేకుండా ‘సూర్యకాంతి’లో తనదైన స్థానాన్ని కనుగొంటాడని నేను ఆశిస్తున్నాను. నా చిన్న బిడ్డ చాలా వేగంగా పెరిగాడు’’ అని రేణు దేశాయ్ పేర్కొన్నారు. 

View this post on Instagram
 
A post shared by renu (@renuudesai)

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. అకిరా ఏ రంగాన్ని ఎంచుకుంటాడనే చర్చ సాగుతోంది. పవన్ వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెడతాడా? లేదా మరేదైనా రంగాన్ని ఎంచుకుంటాడా అనేది భవిష్యత్తే చెబుతుంది. ప్రస్తుతమైతే రేణు గానీ, పవన్ గానీ.. తన కొడుకు సినీ రంగ ప్రవేశం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. విడాకులు తీసుకున్నా.. రేణు దేశాయ్ తన పిల్లలను మెగా ఫ్యామిలీకి దూరం చేయలేదు. చిరు ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా పిల్లలను పంపిస్తారు. ప్రస్తుతం అకిరాకు 17 ఏళ్లు మాత్రమే. సినిమాల్లోకి రావాలంటే ఇంకా చాలా సమయం ఉంది. అయితే, అభిమానులు మాత్రం అంతవరకు ఆగేలా లేరు. అకిరాను హీరోగా చూడాలని ఉందంటున్నారు. 

Also Read: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget