Akira Nandan: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్
'ఆర్ఆర్ఆర్' సినిమాలో దోస్తీ సాంగ్ కు పియానో వాయించారు అకీరా.
అకీరా నందన్ మల్టీటాలెంటెడ్ అనే విషయం తెలిసిందే. చదువులు, ఆటలతో పాటు మ్యూజిక్ లో కూడా జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అప్పుడప్పుడు అకీరా పియానో ప్లే చేసే వీడియోలను రేణుదేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అకీరా టాలెంట్ కు ఫిదా అవుతుంటారు. ఇదిలా ఉండగా.. తాజాగా అకీరా నందన్ తన స్కూల్ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఈవెంట్ లో అకీరా పియానో వాయించారు.
'ఆర్ఆర్ఆర్' సినిమాలో దోస్తీ సాంగ్ కు పియానో వాయించారు అకీరా. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ మాదిరి ఆయన కొడుకు కూడా టాలెంటెడ్ అంటూ పవర్ స్టార్ అభిమానులు ఈ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు. ఈ వీడియలతో అకీరా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.
ఒక వీడియోలో అకిరా వేగన్ అని.. భూమి మీద అన్ని జీవులకు జీవించే హక్కు ఉందని నమ్ముతాడని.. అందుకే వేగన్ గా మారిపోయాడని అతడి గురించి ఈవెంట్ లో చెప్పారు. కరోనా సమయంలో నాలుగు ఆక్సిజన్ సిలిండర్లను హాస్పిటల్ కి డొనేట్ చేశాడని.. మార్షల్ ఆర్ట్స్, మ్యూజిక్ ఇలా అన్ని విషయాల్లో అతడికి ప్రావీణ్యం ఉందని చెప్పుకొచ్చారు. అకిరా గ్రాడ్యుయేషన్ కి పవన్ కళ్యాణ్ కూడా వెళ్లారు. అకిరా, పవన్, రేణు, ఆద్య కలిసి తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ
Also Read: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?
View this post on Instagram
Akira Playing Dosti song from #RRR ❤️ pic.twitter.com/KpVPYKWQYP
— Rusthum (@RusthumHere) May 23, 2022
Like Father Like Son @PawanKalyan ❤️🔥 pic.twitter.com/hTlUHVm0no
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) May 23, 2022
View this post on Instagram