Bhale Unnade: అలా చేస్తే తేడా అనుకుంటారేమో - అలాంటి వాళ్లకి స్వీట్ సినిమా ఇది: దర్శకుడు మారుతి
Bhale Unnade: చిన్నసినిమాలు ఆడాలని, అవి ఆడుతుంటేనే తనకు హ్యపీ అని అన్నారు డైరెక్టర్ మారుతి. ‘భలే ఉన్నాడే’ టీజర్ లాంచ్ కి వచ్చిన ఆయన సినిమా గురించి చాలా విషయాలు పంచుకున్నారు.
Director Maruti Speect at Bhale Unnade Teaser Launch: యువ హీరో రాజ్ తరుణ్ నటించిన సినిమా ‘భలే ఉన్నాడే’. మారుతి టీమ్ ప్రొడక్ట్ నిర్మాణ సంస్థ సమర్పణలో వస్తోంది ఈ సినిమా. ఈ సినిమా టీజర్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి డైరెక్టర్ మారుతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడారు. రాజ్ తరుణ్‌తో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి ఉందని, ఇలా కుదిరిందని చెప్పుకొచ్చారు. అమ్మాయిల్లో ఉన్న భయాలను, సందేహాలను ఈ సినిమా ద్వారా తీరిపోతాయంటూ చెప్పారు. చిన్న సినిమాగా రిలీజై.. కచ్చితంగా భారీ హిట్ కొడుతుంది అని ధీమా వ్యక్తం చేశారు.
చిన్న సినిమా.. కానీ, అందరికీ నచ్చుతుంది..
"చాలా రోజుల నుంచి రాజ్ తరుణ్ తో ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకున్నాను. అనుకోకుండా ఈ పాయింట్ తట్టడంతో సాయికి చెప్పాను. నిజంగా చాలా బాగా డిజైన్ చేసి తీసుకొచ్చాడు. కిరణ్ గారికి కూడా ఒకసారి కథ చెప్పగానే ఓకే అన్నారు. చాలా రోజుల నుంచి కామెడీ చేయాలని అనుకుంటున్నారట. అలా సినిమా నచ్చడం జరిగింది. ఇది చిన్న కాన్పెప్ట్ ఫిలిమ్. నిజానికి ఆడియెన్స్ థియేటర్ కి వచ్చే పరిస్థితి లేదు. ఏదైనా సూపర్ గా ఉంటేనే తప్ప రారు. కానీ ఈ పాయింట్ డెఫనెట్ గా థియేటర్లకి రప్పిస్తుంది" అని అన్నారు మారుతి.
అమ్మాయిల డౌట్స్ క్లియర్..
"చాలామంది అమ్మాయిలకి ఒక డౌట్ ఉంటుంది. నా కాబోయే వాడు రొమాంటిక్ గా లేకపోతే నా లైఫ్ ఏమైపోతుంది అనుకుంటారు. అలా అని టెస్ట్ చేయలేరు. టెస్ట్ చేస్తే నన్ను తేడా అనుకుంటారేమో అనుకుంటారు. అలా రకరకాల డౌట్స్ తో చాలామంది ముందుకు వెళ్తుంటారు. ఎవ్వరికీ చెప్పుకోలేరు. పెద్దవాళ్లు చూపించిన సంబంధం తల వంచుకుని చేసుకుంటే నేను బుక్ అయిపోతానేమో అని అనుకుంటారు. ఇలా రకరకాల డౌట్స్ తో చాలామంది కన్ ఫ్యూజ్ అవుతున్నారు. కొంత మంది ఎక్స్ పీరియెన్స్ విని నా లైఫ్ కూడా ఇలా అయిపోతుందేమో అని భయపడుతున్నారు. అలాంటి వాళ్లకి స్వీట్ సినిమా ఇది. వాళ్ల డౌట్స్‌ను క్లియర్ చేసేలా ఉంటుంది ఈ సినిమా. మన మధ్య జరిగే కథలాగా ఉంటుంది" అని స్టోరీ గురించి చెప్పుకొచ్చారు మారుతి.
చిన్న సినిమాలు ఆడితే ఆనందం..
ఈ సినిమాలో ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారని అన్నారు మారుతి. హీరోయిన్ మనీష బాగా యాక్ట్ చేసిందని, రాజ్ తరుణ్ తో నాన్ తెలుగు అమ్మాయి, కొత్త అమ్మాయి ఇంత బాగా నటించిందని అన్నారు. డీఓపీ కూడా బాగా వర్క్ చేశారని, తమిళ ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలామందే ఉన్నారని చెప్పారు. "ప్రతి ఒక్కరు చాలా బాగా కష్టపడ్డారు. ఇది చిన్న సినిమాగా రిలీజై.. కచ్చితంగా పెద్ద హిట్ కొడుతుంది. చిన్న సినిమాలు ఎప్పటికీ బాగుండాలని, చిన్న సినిమాతో వచ్చాను కాబట్టి. చిన్న సినిమాలను వదలకుండా చేసుకుంటూ ఉంటాను. చిన్న సినిమాలు కూడా ఆడుతుంటే.. నాకు బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది" అంటూ తన మనసులో మాటలు చెప్పారు మారుతి.
ఆకట్టుకున్న టీజర్..
ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో రిలీజైన పాటలు కూడా మంచి టాక్ తెచ్చుకున్నాయి. ‘గీతా సుబ్రహ్మణ్యం’, ‘పెళ్లి గోల 2’, ‘హలో వరల్డ్’ లాంటి వెబ్ సిరీస్‌లు చేసిని డైరెక్టర్ జె.శివసాయి వర్ధన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మనీషా కంద్కూర్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ సహా పలువురు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మారుతి టీమ్ ప్రొడక్ట్ నిర్మాణ సంస్థ సమర్పణలో ఈ చిత్రాన్ని రవి కిరణ్ ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు.
Also Read: ‘రోబో‘ ఫస్ట్ ఛాయిస్ రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ కాదా? శంకర్ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు?