అన్వేషించండి

Robot Movie : ‘రోబో‘ ఫస్ట్ ఛాయిస్ రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ కాదా? శంకర్ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు?

Shankar Robot Movie : శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘రోబో‘. 2010లో విడులైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు రజనీ, ఐశ్వర్య మొదటి ఛాయిస్ కాదట.

Rajinikanth-Aishwarya Rai Not First Choices For Robot : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ ‘రోబో‘. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. వసూళ్ల సునామీ సృష్టించింది. ఇండియన్ సినిమా రేంజిని అమాంతం అతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. 2010లో విడుదలైన ఈ సినిమా రజనీకాంత్ కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. భారతీయ సినీ పరిశ్రమలో ఏ చిత్రం సాధించని వసూళ్లను అందుకుంది.   

రజనీ, ఐశ్వర్య ఫస్ట్ ఛాయిస్ కాదట!

వాస్తవానికి ఈ సినిమాను 2000 సంవత్సరం నుంచే శంకర్ ప్లాన్ చేశారు. అయితే ముందుగా హీరో రజనీకాంత్ ను అనుకోలేదట. విశ్వనటుడు కమల్ హాసన్ తో చేయాలి అనుకున్నారట. హీరోయిన్ గా ఐశ్వర్యాయ్ కాకుండా ప్రీతి జింటాను సెలెక్ట్ చేసుకున్నారట. అంతేకాదు, కమల్ హాసన్, ప్రీతిజింటాకు సంబంధించి ఫోటో షూట్ కూడా నిర్వహించారు. ఓ పాటను కూడా చిత్రీకరించారు. అప్పట్లో ఈ ఫోటోలు సంచలనం అయ్యాయి. ఫోటో షూట్ తో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని శంకర్ ప్రయత్నాలు చేశారు. కానీ అనుకున్న బడ్జెట్ సరిపోకపోవడంతో ఆయన ఈ సినిమాను నిలిపివేశారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో ‘రోబో’ సినిమా చేయాలనుకున్నారు. అదీ ముందుకు సాగలేదు. చివరకు రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ హీరో, హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది.

బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత

శంకర్ తెరకెక్కించిన ‘రోబో’ సినిమా వసూళ్ల పరంగా సత్తా చాటింది. ఏ ఇండియన్ సినిమా సాధించని కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం 2010లోనే ఏకంగా రూ. 320 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఏ బాలీవుడ్ స్టార్ హీరోకు సాధ్యం కాని, రికార్డులను రజనీకాంత్ దక్కించుకున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘రోబో 2.0’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రజనీకాంత్ హీరోగా నటించగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషించారు.  అమీ జాక్సన్ హీరోయిన్ గా కనిపించింది. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

ప్రతిష్టాత్మక చిత్రాలతో శంకర్ బిజీ బీజీ

ప్రస్తుతం శంకర్ ‘గేమ్ ఛేంజర్’తో పాటు ‘ఇండియన్ 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతోంది. తెలుగులో శంకర్ నేరుగా తెరకెక్కిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.  దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ.. రామ్ చరణ్ సరసన నటిస్తోంది. అటు కమల్ హాసన్ తో కలిసి ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నారు. ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.     

Read Also: 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నన్ను ఇంత దారుణంగా అవమానిస్తారా? కరణ్ జోహార్ ఆవేదన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget