అన్వేషించండి

Manjummel Boys OTT: ఓటీటీలోకి ‘మంజుమ్మెల్ బాయ్స్’- స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

థియేటర్లలో దుమ్మురేపిన మలయాళీ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఏప్రిల్ రెండో వారంలో డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తోంది.

Manjummel Boys OTT Release: ఇటీవల విడుదలైన మలయాళీ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ సంచలన విజయాన్ని అందుకుంది. సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులను అపురూప స్పందన లభించింది. దర్శకుడు చిదంబరం ఎస్ పొడువల్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 22న విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తోంది. కేవలం రూ.5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.   

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చేతికి ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్?

వాస్తవానికి ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఓటీటీ విడుదలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో ఇప్పట్లో ఓటీటీలోకి అడుగు పెట్టే అవకాశం కనిపించడం లేదు.  ఏప్రిల్ రెండో వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రావచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమా మార్చి 15న తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మలయాళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.    

వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన ‘మంజుమ్మెల్ బాయ్స్’

2006లో తమిళనాడు కొడైకెనాల్​ గుణ గుహల్లో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. కొంత మంది స్నేహితులు టూర్ లో భాగంగా కొడైకెనాల్ వెళ్లగా, అందులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లోయలో పడిపోతాడు.  స్నేహితుడిని కాపాడేందుకు మిత్రులు చేసిన ప్రయత్నాన్ని దర్శకుడు సినిమాగా తెరకెక్కించారు. రెస్క్యూ సిబ్బంది సైతం కాపాడలేమని చెప్పినా, తమ స్నేహితులు అతడిని ఎలా కాపాడుకున్నారో ఇందులో అత్యద్భుతంగా చూపించారు. ఈ సినిమాలోని ప్రతిసీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సినిమా చూస్తున్నట్లుగా కాకుండా, ప్రేక్షకులు లీనం అయ్యేలా రూపొందించారు. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఇట్టే ఆకట్టుకుంటోంది. శోభున్ షాహిర్​, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్, అరుణ్, దీపక్ ఈ సినిమాలో నటించారు.  

 ‘2018’ కలెక్షన్ల రికార్డును బద్దలుకొట్టేనా?

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘మంజుమ్మేల్ బాయ్స్’ మూవీ, బాక్సాఫీస్ దగ్గర సంచలనాలను క్రియేట్ చేసింది.  12 రోజుల్లో ఏకంగా రూ.100 కోట్లు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి మలయాళ చిత్రంగా రికార్డు సాధించింది. మలయాళంలో ‘పులిమురుగన్’, ‘లూసిఫర్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేశాయి. వీటిలో కేరళ వరదలను బేస్ చేసుకుని తెరకెక్కిన ‘2018’ మూవీ రూ.177 కోట్లతో అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా ‘2018’ కలెక్షన్ల రికార్డును బద్దలుకొట్టేందుకు ప్రయత్నిస్తోంది.

Read Also: ఒక్క సినిమాకు రూ.600 కోట్ల రెమ్యునరేషన్, రికార్డు సృష్టించిన హాలీవుడ్ డైరెక్టర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
Embed widget