అన్వేషించండి

Christopher Nolan: ఒక్క సినిమాకు రూ.600 కోట్ల రెమ్యునరేషన్, రికార్డు సృష్టించిన హాలీవుడ్ డైరెక్టర్

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సంచలనం సృష్టించారు. తన రీసెంట్ మూవీకి కనీవినీ ఎరుగని రీతిలో రెమ్యునరేషన్ తీసుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు.

Christopher Nolan Remuneration: ప్రపంచంలో భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. బాలీవుడ్ లో సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్ ఇప్పుడిప్పుడే సినిమాలు తెరకెక్కుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో తెరకెక్క బోతున్న ‘SSMB29’ సినిమా సుమారు రూ. 1000 కోట్లతో రూపొందబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ ఐదారు మంది టాప్ స్టార్లు ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క సినిమాకు రూ. 100 కోట్ల పారితోషికం అందుకున్న దర్శకుడు ఎవరూ లేరు. రెమ్యునరేషన్, లాభాల్లో వాటాలు అని తీసుకున్నా, ఇంత వరకు ఆ మార్క్ ఎవరూ దాటలేదు. ఈ నేపథ్యంలో కొంత మంది దర్శకులే తమ సినిమాలను నిర్మించుకుంటూ బాగా డబ్బు సంపాదిస్తున్నారు.  

ఒక్క సినిమాకు రూ. 600 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న హాలీవుడ్ డైరెక్టర్

కానీ, ఓ హాలీవుడ్ డైరెక్టర్ తాజాగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో రెమ్యునరేషన్ తీసుకున్నారు. తను దర్శకత్వం వహించిన సినిమాకు ఏకంగా రూ. 600 కోట్లు రెమ్యునరేషన్ అందుకుని ప్రపంచ సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేశారు. అతడు మరెవరో కాదు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. తాజాగా ఆయన అణుబాంబు పితామహుడు రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా ‘ఓపెన్ హైమర్’ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 8274 కోట్లు వసూళు చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లు సాధించిన చిత్రం మరొకటి లేదని చెప్పుకోవచ్చు.

రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకున్న నోలన్

నిజానికి నోలన్ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు అందుకుంటున్నాయి. వాటి మాదిరిగానే గత ఏడాది ఆయన తెరకెక్కించిన ‘ఓపెన్ హైమర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు గాను ఆయన సుమారు 72 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 600 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. వాస్తవానికి చాలా మంది దర్శకుడు రెమ్యునరేషన్ తో పాటు వచ్చే లాభాల్లో వాటాలు తీసుకుంటారు. కానీ, ముందు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. కలెక్షన్లలో వాటాను తీసుకుంటానని చెప్పారు. ఆయన కండీషన్ కు నిర్మాణ సంస్థ కూడా ఓకే చెప్పింది. ముందస్తు ఒప్పంద ప్రకారం ఆయన రూ. 8274 కోట్ల వసూళ్లలో  తన వాటాగా రూ. 600 కోట్లు తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు.

13 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లు

2023లో విడుదలైన ‘ఓపెన్ హైమర్’ సినిమా ‘బార్బీ’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడింది. అయితే, ‘బార్బీ’ సినిమా నోలన్ మూవీ ముందు నిలబడలేకపోయింది. అంతేకాదు, తాజా ఆస్కార్ నామినేషన్లలోనూ ‘ఓపెన్ హైమర్’ సినిమా దుమ్మురేపింది. ఏకంగా 13 విభాగాల్లో నామినేషన్లు అందుకుంది. ఈ సినిమాలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్ర పోషించారు. రాబర్ట్ డౌనీ జూనియర్, ఎమిలీ బ్లంట్, ఫ్లోరెన్స్ పగ్, మాట్ డామన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

Read Also: ‘స్పైడర్ మ్యాన్ 4’ రాబోతుందా? దర్శకుడు సామ్ రైమి కీలక వ్యాఖ్యలు!

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget