Manchu Vishnu: హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు.. ఊరుకునేదే లేదంటున్న హీరో..
హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఊరుకునేదే లేదని మంచు విష్ణు హెచ్చరించారు.
![Manchu Vishnu: హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు.. ఊరుకునేదే లేదంటున్న హీరో.. Manchu Vishnu Strong Warning to Youtube Channels Manchu Vishnu: హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు.. ఊరుకునేదే లేదంటున్న హీరో..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/24/c07609cef60a920e19241fd8a1bc5ce6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికైన వెంటనే తన మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'WEGC' (Women Empowerment & Grievance Cell) అనే కమిటీను ఏర్పాటు చేసేలా చూశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో నటీమణులకు అండగా నిలుస్తున్నారు. హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఊరుకునేదే లేదని మంచు విష్ణు హెచ్చరించారు.
Also Read: సంక్రాంతి రేస్ నుంచి మహేష్, పవన్ ఔట్.. కొత్త రిలీజ్ డేట్లు ఇవేనా..?
తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ నటుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయని.. అసభ్యకరంగా వ్యవహరించే అలాంటి ఛానెల్స్ పై చర్యలు తప్పవని అన్నారు. యూట్యూబ్ ఛానళ్ల థంబ్‌నైల్స్ హద్దులు మీరుతున్నాయని మండిపడ్డారు.
నటీమణులు మన ఆడపడుచులని.. వారిని గౌరవించుకోవాలని అన్నారు. అలాంటి వారిపై అభ్యంతరకర వీడియోలు పెడితే మాత్రం ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. యూట్యూబ్ ఛానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్ సేన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హద్దులు దాటితే ఇలాంటి యూట్యూబ్ ఛానెల్స్ ను నిరయంత్రించడం తన ఎజెండాలో ఓ అంశమని చెప్పుకొచ్చారు. తెలుగు మీడియా ఎప్పుడూ హద్దులు దాటలేదని.. తన కుటుంబానికి, సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ సహకారం అందిస్తూనే ఉందని అన్నారు.
నిజానికి ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరూ యూట్యూబ్ ఛానెల్స్ ను తెరిచి.. దాని ద్వారా డబ్బు సంపాదించే పనిలో పడ్డారు. దీనికోసం ఎక్కువగా సినిమా వాళ్లపై దృష్టి పెడుతున్నారు. కొన్ని ఛానెల్స్ తప్పుడు థంబ్‌నైల్స్ పెట్టి యూజర్స్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు. నటీనటులపై ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. దీనివలన మన తారలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తోంది. అందుకే ఈ విషయంపై మంచి విష్ణు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)