అన్వేషించండి
Advertisement
Manchu Sisters: 'ఫ్రెండ్‌షిప్' సాంగ్ తో మంచు సిస్టర్స్ ఎంట్రీ!
మంచు సిస్టర్స్ 'ఫ్రెండ్షిప్' సాంగ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు మనవరాళ్లు, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా సింగర్స్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. విష్ణు మంచు హీరోగా నటించిన 'జిన్నా' చిత్రంలో ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో సాగే పాటను ఈ ట్విన్ సిస్టర్స్ ఆలపించారు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు.
'ఇదే స్నేహం...' అంటూ సాగే ఈ పాట వీడియోను ఆదివారం విడుదల చేశారు. మంచు సిస్టర్స్ పాడిన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకులు యం.యం.కీరవాణి, కోటి, దేవిశ్రీప్రసాద్, తమన్, అచ్చు రాజామణి ... సింగర్స్ మనో, గీతామాధురి తదితరులు ఈ మంచు సిస్టర్స్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ సంగీత ప్రపంచంలోకి వెల్ కమ్ చెప్పారు.
మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'జిన్నా' సినిమాకి కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా, భాను, నందు డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
న్యూస్
హైదరాబాద్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion