News
News
X

SSMB28: మహేష్ సినిమాలో టాలెంటెడ్ యంగ్ హీరోకి ఛాన్స్!

SSMB28 కొంతమంది టాలెంటెడ్ నటులను తీసుకుంటున్నారు త్రివిక్రమ్. 

FOLLOW US: 

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా (SSMB 28 Movie) ఇది.

ఈ సినిమాలో కొంతమంది టాలెంటెడ్ నటులను తీసుకుంటున్నారు త్రివిక్రమ్. ఈ క్రమంలో మలయాళ నటుడికి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అతడి పేరు రోషన్ మాథ్యూ. గత కొన్నేళ్లలో ఇతడికి మలయాళంలో మంచి పేరొచ్చింది. 'కప్పెల' సినిమా అతడి పెర్ఫార్మన్స్ హైలైట్ గా నిలిచింది. ఇంకా చాలా సినిమాల్లో నటించారు. ఇతడికి బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి. కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు. 

ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో కీలకపాత్ర కోసం త్రివిక్రమ్ అతడిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ మలయాళ ఇండస్ట్రీ నుంచి కొంతమంది స్టార్స్ ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు రోషన్ వంతు వచ్చింది. సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్ పైకి వెళ్లనుంది. 

తొలిసారి ఈ సినిమా కోసం తనకు అచొచ్చిన ఫ్యామిలీ డ్రామాను పక్కన పెడుతున్నారు త్రివిక్రమ్. పూర్తిగా యాక్షన్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సీన్ ఈ సినిమాలో కనిపించవట. నిజానికి త్రివిక్రమ్ ఫ్యామిలీ సబ్జెక్టు రాసుకున్నప్పటికీ.. మహేష్ మాత్రం యాక్షన్ పై దృష్టి పెట్టమని అడిగారట. దీంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో కీలకమార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఆలస్యమైందని తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది.

ఇక ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ కి 'A' అనే అక్షరం చాలా సెంటిమెంట్. అందుకే ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అదే లెటర్ తో మొదలయ్యే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. కథకు కూడా 'అర్జునుడు' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

విలన్ గా తమిళ స్టార్:

SSMB28 సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి కనిపించనున్నారని కొన్ని రోజుల క్రితం వినిపించింది. అసలు నిజం ఏంటంటే... విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అందులో కొన్ని గ్రే షేడ్స్ ఉంటాయి. విజయ్ సేతుపతి రీసెంట్‌గా కథ, అందులో తన క్యారెక్టర్ గురించి విన్నారు. సినిమాలో నటించడం తనకు సంతోషం అంటూ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం కూడా చేసినట్లు తెలుస్తోంది.

Also Read : సుమన్ బతికుండగా చంపేసిన యూట్యూబ్ ఛానళ్లు

Also Read : విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల హిట్టూ ఫ్లాపులు రాలేదు - దర్శక అభిమాని సూటి లేఖ

Published at : 31 Aug 2022 02:27 PM (IST) Tags: Mahesh Babu Trivikram SSMB28 Roshan Mathew

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu Episode 30: ఇనయాను మళ్లీ రెచ్చగొట్టిన శ్రీహాన్, టైటిల్ కొట్టి తీరుతా అంటూ శపథం చేసిన ఇనయా, నామినేషన్స్ డే హీట్

Bigg Boss 6 Telugu Episode 30: ఇనయాను మళ్లీ రెచ్చగొట్టిన శ్రీహాన్, టైటిల్ కొట్టి తీరుతా అంటూ శపథం చేసిన ఇనయా, నామినేషన్స్ డే హీట్

Godfather First Review : 'గాడ్ ఫాదర్' ఫ్లాప్ అంటుంటే హ్యాపీగా మెగా ఫ్యాన్స్

Godfather First Review : 'గాడ్ ఫాదర్' ఫ్లాప్ అంటుంటే హ్యాపీగా మెగా ఫ్యాన్స్

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

Dooralaina Theeralaina: 'ది ఘోస్ట్' - రోల్ రైడా పాడిన ర్యాప్ సాంగ్ అదిరిందిగా!

Dooralaina Theeralaina: 'ది ఘోస్ట్' - రోల్ రైడా పాడిన ర్యాప్ సాంగ్ అదిరిందిగా!

Prabhas-Maruthi: ప్రభాస్‌తో హారర్ కామెడీ కాదు - కథ మారిందట!

Prabhas-Maruthi: ప్రభాస్‌తో హారర్ కామెడీ కాదు - కథ మారిందట!

టాప్ స్టోరీస్

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!

In Pics : చంద్రప్రభ వాహనంపై శ్రీవారు, నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనం

In Pics : చంద్రప్రభ వాహనంపై శ్రీవారు, నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనం