Malayalam Actor Sreejith: లైంగిక వేధింపుల కేసు- ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవి అరెస్ట్
ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవిని లైంగిక వేధింపుల కేసు కింద పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 4 తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
![Malayalam Actor Sreejith: లైంగిక వేధింపుల కేసు- ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవి అరెస్ట్ Malayalam Actor Sreejith Arrest Under POSCO Act Malayalam Actor Sreejith: లైంగిక వేధింపుల కేసు- ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవి అరెస్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/07/9a9544b708325a8e4261461c1531bc171657187591_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవిని లైంగిక వేధింపుల కేసు కింద పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 4 తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. త్రిస్సూర్ ప్రాతంలో ఇద్దరు బాలికలని బహిరంగంగా వేదింపులకి గురి చేసినట్లు అతడిపై కేసు నమోదైంది. త్రిస్సూర్ లోని ఎస్ఎన్ పార్క్ సమీపంలో ఉన్న ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు దృవీకరించారు. పొక్సో చట్టం కింద అతడి మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధిత బాలికలు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అతడు నేరాన్ని ఒప్పకున్నట్లు తెలుస్తోంది. బిహేవియర్ డిజార్డర్ కి సంబందించిన ట్రీట్మెంట్ అతడు తీసుకుంటునట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. శ్రీజిత్ ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం ఇదేమి మొదటి సారి కాదు. ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ గతంలో కూడా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
2106లో పాలక్కడ్ ప్రాంతంలో 14 మంది పాఠశాల పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ కాసులోనూ పోలీసులు శ్రీజిత్ ని అరెస్ట్ చేశారు. తర్వాత అతడు బెయిల్ పై విడుదలయ్యాడు. పోలీసులు కేసుకి సంబంధించి సరైన ఆధారాలు సేకరించకుండా చేశారని మైనర్ బాధిత బాలికఅ తల్లిదండ్రులు ఆరోపించారు. మయూఖం అనే సినిమా ద్వారా శ్రీజిత్ మలయాళ చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. అతడు సహ నటుడిగా, విలన్ గా పలు చిత్రాల్లో నటించాడు. శ్రీజిత్ ప్రముఖ నటుడు టి జి. రవి కుమారుడు.
Also Read : 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)