Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు
మెగాస్టార్ చిరంజీవి పేరులో మార్పు గమనించారా? ఆయన న్యూమరాలజీని బలంగా నమ్ముతున్నారని తెలుస్తోంది.
'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ విడుదలైంది. టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే... మీరు ఆ టీజర్‌లో ఒక విషయం గమనించారా? చిరంజీవి పేరులో చిన్న మార్పు ఉంది. సాధారణంగా మెగాస్టార్ పేరును 'Chiranjeevi' అని రాస్తారు. ఇప్పుడు అలా రాయడం లేదు. నిన్న విడుదలైన 'గాడ్ ఫాదర్' టీజర్‌లో 'Chiranjeeevi' అని ఉంది. ఒక 'e' ఎక్స్ట్రా యాడ్ అయిందన్నమాట. దీనికి న్యూమరాలజీ కారణం అని చిత్ర పరిశ్రమ వర్గాల భోగట్టా.
చిరంజీవి ట్విట్టర్ ఖాతాలో కూడా Chiranjeevi Konidela అని రాసి ఉంటుంది. మరి, టీజర్‌లో ఎందుకు మారింది? కారణం ఎవరు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చిరు అనుమతి లేకుండా మారే అవకాశం ఉండదు. స్క్రీన్ మీద ఇక నుంచి మెగాస్టార్ పేరు 'Chiranjeeevi' అని పడుతుందని సమాచారం. అదీ సంగతి!
Also Read : దసరా బరిలో చిరు Vs బాలయ్య - బాక్సాఫీస్ షేక్!
మలయాళ హిట్ 'లూసిఫర్'కు రీమేక్‌గా రూపొందుతోన్న 'గాడ్ ఫాదర్' సినిమా (God Father Telugu Movie)కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. చిరంజీవి సోదరి పాత్రలో నయనతార కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
Also Read : ఓటీటీ కోసం 'యాత్ర' దర్శకుడి వెబ్ సిరీస్ - 'సైతాన్'
View this post on Instagram