Shaitan Web Series: ఓటీటీ కోసం 'యాత్ర' దర్శకుడి వెబ్ సిరీస్ - 'సైతాన్'
ఓటీటీ కోసం సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీస్తున్న దర్శకుల జాబితాలో మహి వి. రాఘవ్ కూడా చేరారు. ఇప్పుడు ఆయన ఒక వెబ్ సిరీస్ తీస్తున్నారు. దాని టైటిల్ ఖరారు చేశారని తెలిసింది.
మహి వి. రాఘవ్ (Mahi V Raghav)... విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు. 'పాఠశాల'తో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తీసిన 'ఆనందో బ్రహ్మ', ముఖ్యంగా 'యాత్ర'తో పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ దర్శకుడు ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు.
మహి వి. రాఘవ్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. దీనికి 'సైతాన్' (Shaitan web series) టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం అందింది. దర్శకుడిగా మహి వి. రాఘవ్ తీసిన చిత్రాలకు ఈ వెబ్ సిరీస్ భిన్నంగా ఉండబోతోందని టాక్. త్వరలో టైటిల్ లోగో, ఆ తర్వాత ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
Also Read : కృతి శెట్టితో పాటు ఆవిడకూ కథ చెప్పాలి - 'ది వారియర్' విడుదల సందర్భంగా విజిల్ మహాలక్ష్మి చెప్పిన ముచ్చట్లు
Sai Kamakshi Bhaskarla plays main lead in Mahi V Raghav's web series Shaitan: 'సైతాన్' వెబ్ సిరీస్‌లో సాయి కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ రోల్ చేశారు. 'ప్రియురాలు' సినిమాలో ఆమె హీరోయిన్. అంతకు ముందు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో అఖిల్ అక్కినేని స్నేహితురాలిగా నటించారు. ఓటీటీలో విడుదలైన 'మా ఊరి పొలిమేర' సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించారు. ఇంకా 'ద బేకర్ అండ్ ద బ్యూటీ', 'కుబూల్ హై', 'అన్యాస్ ట్యుటోరియల్' వెబ్ సిరీస్‌లలో కీలక పాత్రల్లో కనిపించారు.
Also Read : సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
View this post on Instagram