Krithi Shetty Interview: కృతి శెట్టితో పాటు ఆవిడకూ కథ చెప్పాలి
Krithi Shetty About Ram Pothineni and N Lingusamy's The Warriorr Movie, Read Full Interview Here: రామ్ పోతినేనికి జంటగా కృతి శెట్టి నటించిన 'ది వారియర్' జూలై 14న విడుదలవుతోంది. కృతి చెప్పిన సంగతులు...
కృతి శెట్టి... తెలుగులో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్లలో ఒకరు. ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటారని ఆమెకు పేరుంది. మరి, కథలు ఓకే చేసే ముందు కృతి శెట్టి ఫాలో అయ్యే రూల్ ఏంటో తెలుసా? ఎంటర్‌టైన్‌మెంట్! అంటే కామెడీ అని కాదు. ఆసక్తిగా ఉందా? లేదా? అని! ''కథ వినేటప్పుడు నేను ఎంటర్‌టైన్ అయితే ప్రేక్షకులు కూడా ఎంటర్‌టైన్ అవుతారని ఫీల్ అవుతా'' అని కృతి శెట్టి చెప్పారు.
ఇంకొకటి... కృతికి మాత్రమే కథ చెబితే చాలదు, ఆమె తల్లికి కూడా కథ చెప్పాలి. ''సినిమా ఓకే చేసే ముందు మా అమ్మ అభిప్రాయం తీసుకుంటాను. నాతో పాటు మా అమ్మ కూడా కథ వింటుంది. మేమిద్దరం కలిసే కథ వింటాం'' అని కృతి శెట్టి తెలిపారు.
'ఉప్పెన'తో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి, తొలి సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' చిత్రాలు చేశారు. ఇప్పుడు 14న 'ది వారియర్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వం వహించిన చిత్రమిది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా కృతి శెట్టి చెప్పిన సంగతులు ఇవి.
''ఒకరోజు లింగుస్వామి గారు ఫోన్ చేశారని మా అమ్మ చెప్పింది. ఆయన తీసిన 'ఆవారా' నాకు చాలా ఇష్టం. మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ సినిమా సీడీ తీసుకు వెళ్ళేదాన్ని. రోజుకు రెండు మూడు సార్లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన సినిమా కథలు, హీరోయిన్ల పాత్రలు చాలా బావుంటాయి. పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న హీరోయిన్ రోల్స్ ఉంటాయి. అందువల్ల, ఎగ్జైట్ అయ్యాను. కథ విన్నాక మరింత ఎగ్జైట్ అయ్యా. వెంటనే ఓకే చేశా'' అని కృతి శెట్టి చెప్పారు.
హీరో ఉస్తాద్ రామ్, పాటల గురించి కృతి శెట్టి మాట్లాడుతూ ''షూటింగ్ స్టార్ట్ చేసే ముందు రామ్ ఎనర్జీని మ్యాచ్ చేయడం ఎలా? అని నెర్వస్ ఫీల్ అయ్యా. ముఖ్యంగా సాంగ్స్ చేసే ముందు! అయితే... రామ్ చాలా కూల్ పర్సన్. ఒక్కసారి సెట్స్‌కు వెళ్ళాక బాగా కలిసిపోయా. షూటింగ్ స్టార్ట్ అయినా తర్వాత ఒక ఫ్లోలో వెళ్ళిపోయా. సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయ్యాయి. ఆ సాంగ్స్‌కు ముందు వచ్చే సీన్స్ చాలా బావుంటాయి. సినిమాలో నేను ఆర్జే మహాలక్ష్మి పాత్రలో కనిపిస్తా. రామ్ పోలీస్ ఆఫీసర్ చేశారు. పోలీస్ స్టేషన్, రేడియో స్టేషన్ మధ్య రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ ప్రేమ పుడుతుంది. మా పెయిర్ బావుందని అంటున్నారు. మా మధ్య సీన్స్ సినిమాలో చూడాలి'' అని అన్నారు. తనది గాళ్ నెక్స్ట్ డోర్ రోల్ అని, ప్రేక్షకులు అందరూ ప్రేమించేలా ఉంటుందని చెప్పుకొచ్చారు.
నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఖర్చుకు వెనుకాడలేదని కృతి శెట్టి చెప్పుకొచ్చారు. 'ది వారియర్' థియేటర్లలో ప్రేక్షకుల రియాక్షన్ చూశాక... తాను విజిల్ వేయడం పక్కా అని ఆమె అంటున్నారు.
Also Read : సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన కృతి శెట్టి ఒక సినిమా చేస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'ది వారియర్' నిర్మాత శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమా కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. అందులో కృతి శెట్టి కథానాయిక. నితిన్ జోడీగా కృతి శెట్టి నటించిన 'మాచర్ల నియోజకవర్గం' ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్