RRR: 'నరాలు బిగుసుకుపోయే సీన్' ఎగ్జైట్మెంట్ పెంచేసిన జక్కన్న
డిసెంబర్ లో ముంబై వేదికగా 'ఆర్ఆర్ఆర్' ప్రమోషనల్ ఈవెంట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే.
'ఆర్ఆర్ఆర్' సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ గనుక లేకుంటే జనవరి 7న ఈ సినిమా రిలీజ్ అయ్యేది. కానీ కుదరలేదు. ఇప్పుడు మార్చి 25న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకి ఎగ్జైట్మెంట్ పెరిగిపోతూనే ఉంది. ఆ ఎగ్జైట్మెంట్ ను తన స్పీచ్ తో మరింత పెంచేశారు జక్కన్న.
డిసెంబర్ లో ముంబై వేదికగా 'ఆర్ఆర్ఆర్' ప్రమోషనల్ ఈవెంట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ ఈవెంట్ ను హోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. దర్శకుడు రాజమౌళి ఈ సినిమా గురించి చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
సినిమాలో పర్టిక్యులర్ గా ఓ సీన్ గురించి మాట్లాడారు రాజమౌళి. ఇప్పటివరకు ఏ ప్రోమోలో కూడా ఆ సన్నివేశం గురించి హింట్ ఇవ్వలేదని.. దానికి సంబంధించి ఎవరికీ ఏం చూపించలేదని.. దాని గురించి ఎవరికీ ఐడియా లేదని అన్నారు. ఆ సీన్ ను థియేటర్లో చూసినప్పుడు జనాల్లో ఎగ్జైట్మెంట్ మాములుగా ఉండదని జక్కన్న చెప్పుకొచ్చారు.
సినిమా సెకండ్ హాఫ్ లో ఈ సీన్ వస్తుందని.. తెరపై ఆ సీన్ చూస్తున్నప్పుడు నరాలు బిగుసుకుపోతాయని.. ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతారని.. కానీ మీ గుండె వేగంగా కొట్టుకుంటుందని తన మాటలతో సీన్ ఎలా ఉండబోతుందో చెప్పారు. చరణ్, తారక్ అంత అద్భుతంగా నటించారని.. ఇంతకుమించి ఆ సీన్ గురించి ఇంకేమీ చెప్పనని అన్నారు. స్వయంగా రాజమౌళి ఈ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారంటే.. ఆ సీన్ ఏ రేంజ్ లో ఉంటుందో మరి!
View this post on Instagram