Mega154: మెగాస్టార్ సినిమా కొత్త షెడ్యూల్ - అప్డేట్ ఇచ్చిన టీమ్!
ఇటీవల దర్శకుడు బాబీ తండ్రి మరణించడంతో చిరు సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలవ్వదని అందరూ అనుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మరికొంతమంది స్టార్స్ ను తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది.
ఇటీవల దర్శకుడు బాబీ తండ్రి మరణించడంతో చిరు సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలవ్వదని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ను మొదలుపెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు. సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో టీమ్ మొత్తం పాల్గొంటుంది. చిరు, రవితేజ, శృతిహాసన్ ఇలా అందరూ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
చిరు సవతి సోదరుడిగా రవితేజ:
కథ ప్రకారం.. చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.
దేవిశ్రీప్రసాద్ మాస్ ట్యూన్స్:
ఈ సినిమా కోసం పాటలు పూర్తి చేశారట దేవిశ్రీప్రసాద్. మొత్తం నాలుగు మాస్ సాంగ్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి సినిమాల్లో మాస్ సాంగ్స్ తో పాటు మెలోడీస్ కూడా ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం మెలోడీకి చోటు లేదట. కథ ప్రకారం.. నాలుగు పాటలు ఉంటే.. నాలుగూ కూడా మాస్ సాంగ్స్ అని తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ చాలా బాగా వచ్చిందని చెబుతున్నారు. రవితేజ, చిరంజీవి కాంబినేషన్ లో కూడా ఓ పాట ఉంటుందట. అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
సినిమా బడ్జెట్:
ఈ సినిమా కోసం రూ.125 నుంచి రూ.150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. రెమ్యునరేషన్లకే రూ.75 కోట్లు ఖర్చు అవుతుందట. చిరంజీవికి అటు ఇటుగా రూ.40 కోట్లకు పైగానే ఇస్తున్నారు. రవితేజకి రూ.18 కోట్లని టాక్. దర్శకుడు బాబీకి ఎలా లేదన్నా ఐదారు కోట్లు ఇస్తారు. మిగిలిన నటీనటులకు టెక్నీషియన్స్ కు కలుపుకొని రూ.75 కోట్లు దాటేస్తుందట.
ఈ సినిమాలో మలయాళ నటుడు బిజూ మీనన్ ను విలన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ దాదాపు ఫైనల్ చేసినట్లే. ఈ సినిమాతో పాటు చిరు లిస్ట్ లో 'భోళాశంకర్', వెంకీ కుడుముల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా దసరా సీజన్ లో రిలీజ్ కానుంది.
Also Read : ఒకవేళ ఆ సినిమాలు పవన్ కళ్యాణ్ చేస్తే మహేశ్, రవితేజ, సూర్యకు స్టార్‌డమ్ వచ్చేదా?