Pushpa: 'చూపే బంగారామాయనే.. శ్రీవల్లి..' సాంగ్ రిలీజ్ కి ముందే దేవిశ్రీ ట్రీట్..
'పుష్ప' సినిమాలో 'శ్రీవల్లి' పై రూపొందించిన పాటను ఈ నెల 13న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ పాట ఎలా వుండబోతుందనే చిన్న వీడియోను రిలీజ్ చేశారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'పుష్ప'. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా నుంచి ఆమె పాత్ర 'శ్రీవల్లి'ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో రష్మిక.. పల్లెటూరి పిల్లగా, లంగావోణీలో పూలు పెట్టుకుంటూ కనిపించింది.
Also Read: వాట్ అమ్మా..? వాట్ ఈజ్ దిస్ అమ్మా..? విష్ణు-ప్రకాష్ రాజ్ సెల్ఫీపై హీరో సెటైర్
ఈ సినిమా నుంచి ఇప్పటికే 'దాక్కో దాక్కో మేక' అనే పాటను రిలీజ్ చేశారు. ఐదు భాషల్లో, ఐదుగురు సింగర్లతో ఈ పాటను పాడించారు. అలానే 'శ్రీవల్లి' పై రూపొందించిన పాటను ఈ నెల 13న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ పాట ఎలా వుండబోతుందనే చిన్న వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, సింగర్ సిద్ శ్రీరామ్ కనిపించారు.
ముందుగా ఇద్దరూ హమ్ చేస్తూ కనిపించారు. ఆ తరువాత సిద్ 'చూపే బంగారామాయనే.. శ్రీవల్లీ.. మాటే మాణిక్యమాయనే.. చూపే బంగారామాయనే.. శ్రీవల్లీ.. నవ్వే నవరత్నమాయనే' అంటూ పాట అందుకున్నాడు. ఇక పూర్తి పాటను ఈ నెల 13న విడుదల చేయబోతున్నారు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో మలయాళ స్టార్ నటుడు ఫహాద్ పాజిల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Rockstar @ThisIsDSP and @sidsriram are all set to bring you the melodious chartbuster #Srivalli on 13th October ❤️https://t.co/NzlP0alYNO#SrivalliOnOct13th#PushpaTheRise #PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku @adityamusic @PushpaMovie pic.twitter.com/YQr1IgObn7
— Mythri Movie Makers (@MythriOfficial) October 10, 2021
Also Read: ప్రగ్యా జైస్వాల్కు మళ్లీ కరోనా.. టెన్షన్ లో బాలయ్య
Also Read: 'మా' ఎన్నికల్లో ఓటేసిన పవన్ కల్యాణ్.. అది అవసరమా అనిపించింది అంటూ కామెంట్
Also Read ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!
Also Read: ‘మా’లో రచ్చ.. శివబాలాజీ చేయి కొరికిన హేమా.. ప్రకాష్ రాజ్తో మంచు ఫైట్
Also Read: 'ఆర్ఆర్ఆర్'లో ఎవరూ చూడని స్టిల్స్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి