By: ABP Desam | Updated at : 09 Jan 2022 02:45 PM (IST)
Edited By: harithac
(Image credit: Crazybollywood.com)
మహేష్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు శనివారం రాత్రి హఠాత్తుగా మరణించారు. అతని అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఘట్టమనేని కుటుంబసభ్యులతో పాటూ, కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అంత్యక్రియల వేళ ఘట్టమనేని కుటుంబం కన్నీరుమున్నీరైంది. అంతకుముందు అభిమానులు, పరిశ్రమలోని వారి చివరి చూపు కోసం పద్మాలయ స్టూడియోస్‌లో కాసేపు రమేష్ బాబు భౌతిక కాయాన్ని ఉంచారు. అక్కడ కుటుంబసభ్యులంతా నివాళులు అర్పించారు. యాభై ఆరేళ్ల వయసులోనే రమేష్ బాబు మరణించడం వారి కుటుంబానికి తీరని లోటే. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణ భోరున విలపించారు.
రమేష్ బాబు బాలనటుడిగా ఎన్నో సినిమాలు చేశారు. ఆ తరువాత హీరోగా కూడా మారారు. తండ్రి, తమ్ముడితో కలిసి కూడా నటించారు. పదిహేను సినిమాలకు పైగా నటించారు. 1997లో చివరిసారి తెరపై కనిపించారు. ఆ తరువాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. 2004లో మహేష్ బాబు హీరోగా అర్జున్ అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమాతో రమేష్ బాబు నిర్మాతగా మారారు. ఆ తరువాత తమ్ముడి సినిమాలకు సమర్పకుడిగా మారారు. మహేష్ బాబు సినిమాల్లో ఆగడు, దూకుడు అతని సమర్పణలో వచ్చినవే.
రమేష్ బాబు అంత్యక్రియలకు మహేష్ బాబు దూరమయ్యారు. కరోనా సోకి ఐసోలేషన్లో ఉన్నారు. అన్నయ్యను చివరిసారి చూసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అన్నయ్యపై ప్రేమను వ్యక్తపరిచారు. ‘నువ్వు లేకుంటే ఈ రోజు నేను లేను. నువ్వే నాకు అన్నీ. ఇంతవరకు నాకోసం చేసిన అన్నింటికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీసుకో. ఈ జన్మలోనే కాదు, నాకు మరో జన్మంటూ ఉంటే అప్పుడు కూడా నువ్వే నా అన్నయ్య, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అంటూ పోస్టు చేశారు మహేష్ బాబు.
Also Read: రమేష్ బాబు Vs బాలకృష్ణ.. ఆ టైటిల్ కోసం వివాదం..
Also Read: రామ్.. మంచి కాఫీ లాంటి అబ్బాయ్.. భర్తపై ప్రేమ కురిపించిన సునీత..
నా కూతురితో పాటూ నేను చనిపోయా - కన్నీళ్లు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ట్వీట్!
మంచు విష్ణు ‘కన్నప్ప' నుంచి తప్పుకున్న కృతి సనన్ సోదరి - కారణం?
Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్
New Parliament: కొత్త పార్లమెంట్ వద్ద తమన్నా, మంచు లక్ష్మీ, దివ్యా దత్తా - మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏమన్నారంటే?
యాంకర్ మెడలో దండేసిన నటుడు, వెంటనే ఆమె ఆ దండ తీసి ఏం చేసిందో చూడండి
Purandeshwari: వైన్ షాప్లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్ను అప్డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
/body>