News
News
X

Krishna Hospitalized: క్రిటికల్‌గా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం - ఐసీయూలో చికిత్స!

Krishna Health Condition Update : సూపర్ స్టార్ కృష్ణను ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే?

FOLLOW US: 

సూపర్ స్టార్ కృష్ణ (Krishna Ghattamaneni) తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈ రోజు ఉదయం ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఉన్నారు. దాంతో ఘట్టమనేని, మహేష్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. 

ఇప్పుడు కృష్ణ ఆరోగ్యం ఎలా ఉందంటే?
కృష్ణ కొన్ని రోజులుగా కృష్ణ బయటకు రావడం లేదు. వయసు రీత్యా ఆయనకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అందువల్ల, ఎక్కువగా ఇంటికి పరిమితం అవుతున్నారు. గతంలో మహేష్ బాబు సినిమా ఫంక్షన్స్‌కు అటెండ్ అయ్యేవారు. ఈ మధ్య అది కూడా లేదు. ఫంక్షన్స్ గట్రా అవాయిడ్ చేస్తున్నారు. హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

Krishna Hospitalized : కృష్ణకు ఆస్థమా ఉందని, వాతావరణంలో మార్పులు రావడంతో కొద్దిగా నలత చేసిందని, అందువల్ల ఆస్పత్రికి తీసుకు వెళ్లారని మొదట్లో తెలిపారు. కానీ, ఆయన కార్డియాక్ అరెస్టుతో ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు స్పష్టం చేశారు. అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కృష్ణ సన్నిహిత వర్గాలు చెప్పారు. తొలుత రెగ్యులర్ చెకప్ కోసమే కృష్ణ ఆసుపత్రికి వెళ్లారని ఘట్టమనేని ఫ్యామిలీ వర్గాలు వెల్లడించాయి. అయితే, కృష్ణ‌కు చికిత్స అందించిన వైద్యులు మాట్లాడుతూ.. ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, వెంటీలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. 24 గంటల తర్వాత మరో హెల్త్ బులిటిన్ ఇస్తామని అన్నారు. కృష్ణ కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చేరారని వెంటనే ఆయనకు చికిత్స అందించామని, ఇంకా పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు వెల్లడించారు. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తుందా లేదా అనేది ఇప్పట్లో చెప్పలేమన్నారు. 

భార్య, కుమారుడి మరణం తర్వాత...
కుటుంబం అంటే కృష్ణకు ఎక్కువ ప్రేమ. ముఖ్యంగా పిల్లలు అంటే ఆయనకు పంచ ప్రాణాలు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరున కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్ను మూశారు. ఏడాది ప్రారంభంలో కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించారు. భార్య, కుమారుడి మరణం ఆయనను బాధకు గురి చేసిందని సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం. 

News Reels

Also Read : 'ఆహ నా పెళ్ళంట' to 'గాడ్ ఫాదర్', 'సర్దార్' - ఓటీటీల్లో ఈ వారం సందడి

కృష్ణ, ఇండియా దేవి దంపతులకు ఐదుగురు సంతానం. పెద్దమ్మాయి పద్మావతిని గల్లా జయదేవ్‌కు ఇచ్చి వివాహం చేశారు. రెండో అమ్మాయి మంజుల నటిగా, నిర్మాతగా ప్రేక్షకులకు తెలుసు. ఆమె భర్త సంజయ్ స్వరూప్ నటుడు. మూడో అమ్మాయి ప్రియదర్శిని యువ హీరో సుధీర్ బాబుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ సోదరుడు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేశారు. ఇక, మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో సూపర్ స్టార్‌గా, తండ్రి తగ్గ తనయుడిగా స్టార్ డమ్ కొనసాగిస్తున్నారు.  

మే 31న కృష్ణ బర్త్ డే. ఆ రోజు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. అందరితో కలిసి భోజనం చేశారు. కృష్ణ బర్త్ డే స్పెషల్ గా ఆయన్ను కుమార్తె మంజుల ఇంటర్వ్యూ చేశారు. 

View this post on Instagram
 
A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni)

Published at : 14 Nov 2022 10:55 AM (IST) Tags: Krishna Hospitalized Mahesh Babu Father Hospitalized Krishna Health Condition Krishna Health Update

సంబంధిత కథనాలు

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

18 pages movie song: మీరు పాడకపోతే ఇక్కడే ధర్నా చేస్తా - శింబుతో బలవంతంగా పాట పాడించిన నిఖిల్, ఈ వీడియో చూశారా?

18 pages movie song: మీరు పాడకపోతే ఇక్కడే ధర్నా చేస్తా - శింబుతో బలవంతంగా పాట పాడించిన నిఖిల్, ఈ వీడియో చూశారా?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

టాప్ స్టోరీస్

Green Signal To Sharmila Padayatra : షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతు !

Green Signal To Sharmila Padayatra :   షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతు !

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!