అన్వేషించండి

Kovai Sarala: అల్లు అర్జున్​ను పెళ్లి చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన లేడీ కమెడియన్

Kovai Sarala Marriage : ప్రముఖ లేడీ కమెడియన్ కోవై సరళ తన మనసులో మాట బయటపెట్టింది. టాలీవుడ్ హీరోలలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుంది? అనే ప్రశ్నకు అల్లు అర్జున్ అని ఠక్కున చెప్పింది.

Kovai Sarala On Her Marriage:  సౌత్ లో లేడీ కమెడియన్ గా తనకంటూ  ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుది కోవై సరళ. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమా పరిశ్రమలలో 300లకు పైగా చిత్రాల్లో నటించింది. 9వ తరగతిలో ఉన్నప్పుడే తొలి సినిమా అవకాశం వచ్చింది.  1979లో ‘వెల్లి రథం‘ అనే  తమిళ సినిమాలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో సత్తా చాటింది. తన అద్భుత నటనతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది.

కోవై సరళ అంటే అర్థం ఏంటో తెలుసా?

తాజాగా ఈ సీనియర్ నటి ‘ఆలీతో సరదాగా‘ షోలో పాల్గొన్నది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన కుటుంబంతో పాటు సినిమాలకు సంబంధించిన ఎవరికీ తెలియని ముచ్చట్లు చెప్పింది. కోయంబత్తూర్ ను కోవై అంటారని, అక్కడే పుట్టి పెరిగిన తనను కోవై సరళ అంటారని వెల్లడించింది. తనతో పాటు నలుగురు సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నట్లు చెప్పిన ఆమె, అందరూ జీవితంలో సెటిల్ అయ్యారని వివరించింది. ఇప్పుడు అందరూ కోయంబత్తూర్ లోనే ఉన్నారని చెప్పింది. తనతో సినిమా చేసేందుకు దిగ్గజ నటుడు కమల్ హాసన్ ఏకంగా మూడు నెలలు వెయిట్ చేసినట్లు వివరించింది.

దర్శకుడు పూరి జగన్నాథ్ అంటే ఎంతో ఇష్టం

తెలుగు సినిమా పరిశ్రమలో ఏ కమెడియన్ అంటే ఇష్టం అనే ప్రశ్నకు సిగ్గు పడుతూ సమాధానం చెప్పింది. ఏయ్, కావాలనే ఈ ప్రశ్న అడుగుతున్నావ్ కదా.? నేను ఎప్పుడో మీకు ఐ లవ్ చెప్పాను అని ఆలీతో అనడంతో అందరూ నవ్వారు. తన వాయిస్ పుట్టుకతోనే అలా వచ్చిందని చెప్పింది. తెలుగులో తనకు ఇష్టమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ అని చెప్పింది కోవై సరళ. ఆయన తెరకెక్కించిన ‘దేశ ముదురు‘ సినిమా తనకు ఎంతో గుర్తింపు తెచ్చిందని వివరించింది.

పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన కోవై సరళ

పెళ్లి చేసుకుని ఉద్దరించాలని ఎవరూ ఏమీ చెప్పలేదన్నారు. పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉంటడమే మంచిదని చెప్పింది. ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలలో పెళ్లి చేసుకోవంటే, అల్లు అర్జున్ ను చేసుకుంటానని మనసులో మాట బయటపెట్టింది. చిన్నప్పుడు తన పేరెంట్స్ ఎంతో కష్టపడ్డారని చెప్పింది. తండ్రి డప్పు కొట్టి డబ్బులు సంపాదించేవారని చెప్పింది. డబ్బు విలువ ఏంటో తమకు బాగా తెలుసని చెప్పింది. చాలా మంది మా కుటుంబానికి డబ్బు పిచ్చి ఉందని భావిస్తారు. కానీ, డబ్బులేక పడిన ఇబ్బంది ఏంటో తనకు బాగా తెలుసని కోవై సరళ వెల్లడించింది. అందుకే, వచ్చిన అవకాశాలు అన్నింటినీ వినియోగించుకుంటున్నట్లు వివరించింది. కళామతల్లికు తన జీవితాన్ని అంకితం చేసినట్లు వివరించింది. ప్రస్తుతం సౌత్ లోని పలు సినిమాల్లో నటిస్తున్నట్లు కోవై సరళ వివరించింది. వీటిలో పలు తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలు ఉన్నట్లు తెలిపింది. 

Read Also : సుకుమార్ దగ్గర పనిచేస్తే అలాగే ఉంటారేమో, చంపేసినా పట్టించుకోరు - ‘ప్రసన్నవదనం’ డైరెక్టర్‌ పై సుహాస్ వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Embed widget