Hero Suhas : సుకుమార్ దగ్గర పనిచేస్తే అలాగే ఉంటారేమో, చంపేసినా పట్టించుకోరు - ‘ప్రసన్నవదనం’ డైరెక్టర్‌పై సుహాస్ వ్యాఖ్యలు
Suhas: ‘ప్రసన్నవదనం’తో దర్శకుడిగా మారాడు సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ అర్జున్ వైకే. అసలు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ అంటే ఎలా ఉంటారు అనే విషయంపై ఈ మూవీ హీరో సుహాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Suhas About Prasanna Vadanam Director Arjun YK: గత కొన్నేళ్లలో ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్లు.. దర్శకులుగా మారి తమ సత్తా చాటుకున్నారు. ముఖ్యంగా సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్లు కొందరు.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో చిత్రాలు చేస్తూ బిజీ అయిపోయారు. ఆ లిస్ట్‌లోకి ఇప్పుడు అర్జున్ వైకే కూడా యాడ్ అయ్యాడు. సుహాస్ హీరోగా తెరకెక్కిన ‘ప్రసన్నవదనం’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు అర్జున్ వైకే. మొదటి మూవీతోనే వైవిధ్యభరితమైన కథతో, థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇటీవల విడుదలయిన ‘ప్రసన్నవదనం’ పాజిటివ్ రివ్యూలు అందుకుంటుండగా డైరెక్టర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సుహాస్.
వెరైటీ మనుషులు..
‘‘సుకుమార్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌తో పాటు రైటింగ్‌కు కూడా ఉండేవారట అర్జున్. జగడం నుండి సుకుమార్ దగ్గరే పనిచేశారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా సుకుమార్ మాట్లాడుతున్నట్టే ఉంటుంది. సార్‌ను బయట చూస్తుంటాం కదా. ఆలోచనా విధానం గానీ, మాట్లాడే తీరు, నడిచే తీరు అన్నీ అలాగే ఉంటుంది. నాకు అందరూ ముందే చెప్పారు సుకుమార్ సార్ బ్యాచ్ అంటే వాళ్లది ఒక విచిత్రమైన ప్రవర్తన ఉంటుంది. నిజంగానే అలాగే ఉంటుంది. పూర్తి ఫోకస్ అంతా మానిటర్‌పైనే ఉంటుంది. పక్కన నుండి ఎవరైనా వచ్చి కొట్టేస్తున్నా, చంపేస్తున్నా అలాగే ఉంటారు. తినడం కూడా వెరైటీగానే ఉంటుంది. తినేసా తరువాత సీన్ ఏంటి అన్నట్టే ఉంటారు. అసలు ఏం పట్టించుకోరు. సినిమా గురించి తప్పా ఇంకేమి మాట్లాడిన వినరు’’ అంటూ అర్జున్ వైకే గురించి, తన మనస్తత్వం గురించి వివరించాడు సుహాస్.
సుకుమార్ రైటింగ్స్..
సుకుమార్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తే.. వాళ్లు కూడా ఇండస్ట్రీలో పెద్ద దర్శకులు అయిపోతారేమో అని ప్రేక్షకులు సైతం ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన వారు.. దర్శకులుగా మారాలనుకుంటే సుకుమారే స్వయంగా వారి చిత్రాలను నిర్మిస్తారు కూడా. సుకుమార్ రైటింగ్స్ అనే నిర్మాణ సంస్థ.. ఎక్స్‌క్లూజివ్‌గా తన అసిస్టెంట్ డైరెక్టర్లను లాంచ్ చేయడానికే అన్నట్టుగా మారిపోయింది. ఇప్పటికే సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన బుచ్చిబాబు.. ‘ఉప్పెన’తో దర్శకుడిగా డెబ్యూ ఇవ్వడంతో పాటు నేషనల్ అవార్డును సైతం అందుకున్నాడు. అదే తరహాలో మరెందరో సుకుమార్ అసిస్టెంట్స్ కూడా డైరెక్టర్లుగా డెబ్యూ ఇచ్చారు. అందులో అర్జున్ వైకే కూడా యాడ్ అయ్యాడు.
కొత్త కాన్సెప్ట్..
సుహాస్, పాయల్ రాధకృష్ణ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రమే ‘ప్రసన్నవదనం’. ఈ మూవీలో హీరో ఫేస్ బ్లైండ్‌నెస్ అనే ఒక వింత వ్యాధితో బాధపడుతుంటాడు. తను మొహాలను గుర్తుపట్టలేడు. అలాంటి హీరో జీవితంలోకి హీరోయిన్ ఎలా వస్తుంది, ఒక మర్డర్‌ను కళ్లారా చూసిన తర్వాత తన జీవితం ఎలా మారుతుంది అనేది కథ. ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా తెరకెక్కలేదు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ కావడంతో ‘ప్రసన్నవదనం’కు పాజిటివ్ టాక్ లభిస్తోంది. మరోసారి సుహాస్ హిట్ అందుకున్నాడంటూ ప్రేక్షకులు.. తన యాక్టింగ్‌ను ప్రశంసిస్తున్నారు.
Also Read: బెల్లంకొండకి జోడీగా ‘డెవిల్’ బ్యూటీ - కుర్ర హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిన కేరళ కుట్టి!