ఎన్టీఆర్ తల్లికి, నాగశౌర్యకు కాబోయే భార్యకు సంబంధం ఏంటో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి షాలినికి, నాగశౌర్యకు కాబోయే భార్య అనూష శెట్టికి ఓ సంబంధం ఉంది. అదేమిటో తెలుసా?
యువ కథానాయకుడు నాగశౌర్య (Naga Shourya) త్వరలో ఏడు అడుగులు వేయనున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అనూష శెట్టి (Anusha Shetty) ని ఆయన వివాహం చేసుకోనున్నారు. ఆమెకు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లికి ఓ సంబంధం ఉంది. అదేమిటో తెలుసా?
Know About Naga Shourya's Wife Anusha Shetty: ఎన్టీఆర్ తల్లి షాలిని కర్ణాటకకు చెందిన మహిళ. మంగుళూరుకు దగ్గరలోని కుందాపూర్ ఆవిడ స్వస్థలం. ఇప్పుడు నాగశౌర్యకు కాబోయే భార్య అనూష శెట్టిది కూడా అదే ఊరు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం అది. అన్నట్టు... నాగశౌర్యకు ఇష్టమైన హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. నాగశౌర్య అంటే ఎన్టీఆర్ సతీమణి ప్రణతికి అభిమానం. ఆయన సినిమాలో ఓ పాటను ఆవిడ రింగ్ టోన్‌గా పెట్టుకున్నారని వినికిడి.
అనూష శెట్టి ఎవరు?
అసలు అనూష శెట్టి ఎవరు? ఆవిడ నేపథ్యం ఏమిటి? అంటే... ఆమె ఇంటీరియర్ డిజైనర్. పలు ప్రముఖ కంపెనీలకు సేవలు అందించారు. ఆర్కిటెక్‌గా కర్ణాటక స్టేట్ అవార్డును కూడా ఆమె అందుకున్నారు. అనూష శెట్టి డిజైన్స్ పేరుతో ఓ కంపెనీ ప్రారంభించిన ఆమె... పలు అవార్డులు గెలుచుకున్నారట.
బెంగళూరులో అనూష శెట్టితో నాగశౌర్యకు పరిచయం అయ్యిందని, అది ప్రేమగా మారిందని సమాచారం. వాళ్ళిద్దరి ప్రేమకు ఇరువురు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లికి రెడీ అయ్యారు.
బెంగళూరులో 20న నాగశౌర్య పెళ్లి
Naga Shourya Weds Anusha : నాగశౌర్య పెళ్లి నవంబర్ 20న బెంగళూరులో జరగనుంది. విఠల్ మాల్య రోడ్డులోని జెడబ్ల్యూ మారియట్ హోటల్ ఆయన పెళ్ళికి వేదిక కానుంది. ఆదివారం (నవంబర్ 20) ఉదయం 11.25 గంటలకు అనూషతో ఆయన పెళ్లి జరగనుంది. ఆల్రెడీ పెళ్లి పనులు ప్రారంభించారు. శౌర్య ఇంట పెళ్లి సందడి మొదలైంది. శుభలేఖలు కూడా పంచుతున్నారు. పెళ్ళికి భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా నాగశౌర్య ఫ్యామిలీ ఆహ్వానితులను కోరుతోంది. పెళ్ళికి ముందు రోజు 19న మెహందీ ఫంక్షన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి కూడా స్పెషల్ డ్రెస్ కోడ్ ఉందట.
Also Read : 'లైగర్' గాయాలు - విజయ్ దేవరకొండకు ఎనిమిది నెలల తర్వాత
హింట్ ఇచ్చిన నాగశౌర్య తల్లి!
'కృష్ణ వ్రింద విహారి'తో ఈ ఏడాది సెప్టెంబర్ 23న నాగశౌర్య థియేటర్లలోకి వచ్చారు. విశేషం ఏమిటంటే... పెళ్లి నేపథ్యంలో ఆ సినిమా రూపొందింది. ఆ సినిమా విడుదల సమయంలో నాగశౌర్య పెళ్లి ప్రస్తావన రాగ... ఆయన తల్లి ''ఈ తరం యువతకు పెళ్లి విషయంలో స్పష్టత ఉంది. అబ్బాయి పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది. అయినా ఈ కాలం పిల్లల మాట వింటారా?'' అని అన్నారు. తమ కుమారుడికి ప్రేమ వివాహమని అప్పట్లో ఆవిడ హింట్ ఇచ్చారు.
కొత్త సినిమా స్టార్ట్ చేయనున్న శౌర్య
ఇటీవల నాగశౌర్య కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. హీరోగా ఆయనకు 24వ సినిమా అది. ఆ చిత్రాన్ని నూతన దర్శకుడు ఎస్ఎస్ అరుణాచలంతో వైష్ణవి ఫిలింస్ పతాకంపై ప్రొడక్షన్ నెం 1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి నిర్మించనున్నారు.