అన్వేషించండి
Advertisement
KGF 2: బాలీవుడ్ లో హయ్యెస్ట్ గ్రాసర్స్ - మన సౌత్ సినిమాలే
హిందీ మార్కెట్ లో 'కేజీఎఫ్2' సినిమా సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన 'కేజీఎఫ్1' సినిమా నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' రికార్డులు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది ఈ సినిమా. మొదటి రోజు నుంచి ఈ సినిమా దేశవ్యాప్తంగా వసూళ్ల మోత మోగిస్తోంది. అందరి అంచనాలను మించిపోయి.. వరుసగా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ ముందుకు వెళ్తోంది.
ముఖ్యంగా హిందీ మార్కెట్ లో 'కేజీఎఫ్2' సినిమా సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలేవీ కూడా దీని ముందు నిలవలేకపోతున్నాయి. ఎన్నో భారీ చిత్రాలను వసూళ్లను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందు వెళ్తోన్న 'కేజీఎఫ్2' ఇప్పుడు మరో మైలురాయిని దాటేసింది. ఆమిర్ ఖాన్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ 'దంగల్' వసూళ్ల రికార్డుని 'కేజీఎఫ్2' అధిగమించింది.
హిందీ మార్కెట్ లో హయ్యెస్ట్ గ్రాసర్ల జాబితాలో రాజమౌళి సినిమా 'బాహుబలి: ది కంక్లూజన్' రూ.511.3 కోట్ల నెట్ వసూళ్లతో అగ్రస్థానంలో ఉండగా.. 'దంగల్' సినిమా రూ.387.4 కోట్లతో రెండో స్థానంలో ఉండేది. ఇప్పుడు ఆమిర్ ఖాన్ సినిమాను మూడో స్థానానికి నెట్టేసింది 'కేజీఎఫ్2'. బుధవారం థియేట్రికల్ రన్ అయ్యేసరికి ‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్ వసూళ్లు రూ.391.65 కోట్లకు చేరుకున్నాయి. ఈ సినిమా రూ.400 కోట్ల మార్క్ ను అందుకోవడం కూడా ఖాయమనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్కుని దాటేసింది.
Also Read: ‘అనసూయ అదే పదాన్ని వాడితే నవ్వారు? విశ్వక్సేన్ అంటే సీన్ చేస్తున్నారు, హరీష్ శంకర్ ఫైర్!
TOP 3 HIGHEST GROSSING *HINDI* FILMS...
— taran adarsh (@taran_adarsh) May 4, 2022
1. #Baahubali2
2. #KGF2
3. #Dangal
Nett BOC. #India biz. #Hindi. pic.twitter.com/66wCCW9sEy
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
విజయవాడ
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement