అన్వేషించండి
Harish Shankar: ‘అనసూయ అదే పదాన్ని వాడితే నవ్వారు? విశ్వక్‌సేన్ అంటే సీన్ చేస్తున్నారు, హరీష్ శంకర్ ఫైర్!
దర్శకుడు హరీష్ శంకర్ విశ్వక్ సేన్ ఇష్యూపై స్పందిస్తూ.. కొన్ని సెటైరికల్ వీడియోలను షేర్ చేశారు.

దేవి నాగవల్లి - విశ్వక్ సేన్ ఇష్యూ
ఇటీవల విశ్వక్ సేన్ తన సినిమా ప్రమోషన్స్ కోసం రోడ్డు మీద ఒక ప్రాంక్ చేశారు. దీనిపై ఓ ఛానెల్ లో డిబేట్ పెట్టారు. ఇందులో విశ్వక్ సేన్ కూడా పాల్గొన్నాడు. యాంకర్ దేవి నాగవల్లి.. విశ్వక్ సేన్ ను ఉద్దేశిస్తూ పాగల్ సేన్, డిప్రెస్డ్ పెర్సన్ అంటూ కామెంట్స్ చేసింది. దీనిపై రియాక్ట్ అయిన విశ్వక్ సేన్ తనను వ్యక్తిగతంగా ఎటాక్ చేస్తున్నందుకు పరువు నష్టం దావా వేయొచ్చని, కానీ అలా చేయనని ఎందుకంటే మీకు నాకు తేడా ఉండాలి కదా అని తన అభిప్రాయాన్ని చెప్పారు.
దీంతో ఆగ్రహానికి లోనైన దేవి నాగవల్లి తన స్టూడియో నుంచి విశ్వక్ సేన్ ను వెళ్లిపోమంటూ.. 'గెట్ అవుట్' అంటూ గట్టిగా అరిచింది. దీంతో విశ్వక్.. యాంకర్ దేవిని ఉద్దేశిస్తూ F*** అనే పదాన్ని ఉపయోగించాడు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సదరు ఛానెల్, యాంకర్.. ఈ విషయంపై వరుస కథనాలు ప్రసారం చేస్తూ విశ్వక్ సేన్ ను ఆడుకున్నారు. ఈ విషయంలో చాలా మంది విశ్వక్ సేన్ ను సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
ఓ హీరోని స్టూడియోకి పిలిచి, అవమానించి బయటకు పంపేయడమే కాకుండా ఇలా టార్గెట్ చేస్తారా..? అంటూ మండిపడుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో విషయంలో ఇలా చేయగలరా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. సదరు ఛానెల్ లో ప్రసారమైన పాత కథనాలను వెలికి తీస్తున్నారు. విశ్వక్ సేన్ కి నెటిజన్ల నుంచే కాకుండా సెలబ్రిటీల మద్దతు కూడా పెరుగుతోంది. కరాటే కళ్యాణి, కస్తూరి శంకర్, రాహుల్ రామకృష్ణ ఇలా చాలా మంది విశ్వక్ సేన్ ను సపోర్ట్ చేస్తున్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. కొన్ని సెటైరికల్ వీడియోలను షేర్ చేశారు. ఈ వీడియోతో తన సపోర్ట్ విశ్వక్ సేన్ కి అంటూ చెప్పకనే చెప్పారు. గతంలో అనసూయ కూడా ఇలాంటి పదాన్నే వాడినప్పుడు దేవి నాగవల్లి నవ్వేసి ఊరుకుంది. ఇప్పుడు విశ్వక్ సేన్ అంటే మాత్రం సీన్ చేసిందని ఒక వీడియోలో ఉంది. అలానే కొన్ని ట్రోలింగ్ వీడియోలను షేర్ చేస్తూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను క్యాప్షన్ గా పెట్టారు.
Nobody addresses the vile nature of @TV9Telugu in terms of +showing+ us news whereas all they care about is…
— Rahul Ramakrishna (@eyrahul) May 3, 2022
..they don’t really care about anything, they’re well funded.
I have a problem with @TV9Telugu because they are not part of any constructive space
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
హైదరాబాద్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion