News
News
వీడియోలు ఆటలు
X

Keerthi Suresh: మీ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను - కీర్తి సురేష్ ఎమోషనల్ లెటర్

నటి కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ ను పోస్ట్ చేసింది.

FOLLOW US: 
Share:

'మహానటి' సినిమాతో వాంటెడ్ హీరోయిన్ గా మారింది కీర్తి సురేష్. ఈ సినిమా తరువాత ఆమె కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. కానీ దాదాపు అన్నీ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. దీంతో కీర్తి సురేష్ ఐరన్ లెగ్ అంటూ కామెంట్స్ చేశారు. అలాంటి సమయంలో ఆమెకి 'సర్కారు వారి పాట' సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇందులో కళావతి పాత్రలో మెరిసిపోయింది. అయితే ఈ సినిమా విషయంలో కూడా మహేష్ ఫ్యాన్స్.. కీర్తి సురేష్ పట్ల సందేహం వ్యక్తం చేశారు. ఆమె బ్యాడ్ లక్ ఈ సినిమాకి తగిలిస్తుందేమోనని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. 

ఫైనల్ గా ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో అందరూ ఆనందించారు. అలానే ఈ ఏడాది 'చిన్ని' అనే సినిమాతో మరో సక్సెస్ అందుకుంది కీర్తి సురేష్. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కీర్తి సురేష్ పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ రెండు సినిమాల సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది కీర్తి సురేష్. 

ఈ సందర్భంగా అభిమానులను, దర్శకనిర్మాతలు ఉద్దేశిస్తూ ఓ లెటర్ ను పోస్ట్ చేసింది. అందులో ఏమని రాసుందంటే.. ''నటులుగా జీవించడమనేది చాలా కష్టమైన పని. మా కెరీర్ లో ఎత్తుపల్లాలను చూస్తాం.. అదే మా గమ్యాన్ని నిర్ణయిస్తుంది. గత కొంతకాలంగా నాకు పరీక్ష సమయంలా గడిచింది. ఆ ఫేస్ లో నా బెస్ట్ ఇవ్వడానికి నేను నిరంతరం శ్రమించాలని గ్రహించాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం.. 'సాని కాయిదం'(చిన్ని), 'సర్కారు వారి పాట' సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడమే. 

ముందుగా 'సాని కాయిదం' టీమ్ ని నా సిన్సియర్ థాంక్స్. ఈ చిత్ర నిర్మాత, దర్శకుడు అరుణ్ మతేశ్వరన్ పొన్ని పాత్రలో నేను నటించగలని నమ్మి నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. నా కోస్టార్ సెల్వరాఘవన్ సర్.. నా పాత్ర బాగా పండడంలో హెల్ప్ చేశారు. మీరు చేసినట్లుగా ఈ పాత్రకు ఎవరూ న్యాయం చేయలేదు. డీఓపీ యామినీ.. ఈ సినిమాను మీ భుజాలపై వేసుకొని నడిపించారు. మీ హార్డ్ వర్క్ మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. మెమొరబుల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన 'సాని కాయిదం' టీమ్ మొత్తానికి నా థాంక్స్. 

'సర్కారు వారి పాట' టీమ్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్,14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, దర్శకుడు పరశురామ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డీఓపీ మది అందరూ కష్టపడి ఈరోజు సినిమాను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ సినిమా జర్నీలో నాకు సపోర్ట్ చేసిన నమ్రత మేడమ్ కి థాంక్స్. మహేష్ బాబు గారితో కలిసి వర్క్ చేయడం గౌరవడం భావిస్తున్నాను. అలానే మంచి ఫన్ ఎక్స్ పీరియన్స్ అనే చెప్పాలి. మొత్తం క్యాస్ట్ అండ్ క్రూకి థాంక్స్'' అంటూ రాసుకొచ్చారు. 

అలానే తన అభిమానులను ఉద్దేశిస్తూ.. 'మీరే నా బలం.. మీ వలనే నేను ఈరోజు ఈ స్థానములో ఉన్నాను. దానికి ఎప్పటికీ మీకు కృతజ్ఞతగా ఉంటాను. మీరిచ్చే సపోర్ట్ వలనే నా జర్నీలో ఎలాంటి అడ్డంకి వచ్చిన అధిగమించి ముందుకు సాగగలుగుతున్నాను' అంటూ చెప్పుకొచ్చారు.   

Published at : 02 Jun 2022 07:13 PM (IST) Tags: keerthi suresh Sarkaru Vaari Paata Keerthi Suresh emotional letter Keerthi Suresh instagram chinni

సంబంధిత కథనాలు

Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

టాప్ స్టోరీస్

Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?

Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ ఎలా ఉంది? - ఎలా పని చేస్తుంది? - ఈ ఫొటోలు చూస్తే ఫుల్ క్లారిటీ!

యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ ఎలా ఉంది? - ఎలా పని చేస్తుంది? - ఈ ఫొటోలు చూస్తే ఫుల్ క్లారిటీ!

iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!

iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!