News
News
X

Karthika Deepam October 1st Update: మన గురించి ఏమీ చెప్పొద్దు బంగారం అంటూ మోనితతో అత్యంత చనువుగా దుర్గ, డిస్ట్రబ్ అయిన కార్తీక్

కార్తీకదీపం అక్టోబరు 1 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...

FOLLOW US: 

Karthika Deepam October 1sth Episode 1472 (కార్తీకదీపం అక్టోబరు 1 ఎపిసోడ్)

మోనితకు కోపం వచ్చింది వెళ్లిపోతానన్న దుర్గని ఆపుతాడు కార్తీక్. మోనితకి స్నేహితుడిని అంటున్నావ్ కదా అంటే తన కోపం గురించి నీకు తెలిసే ఉంటుంది కదా..దగ్గరగా ఉన్న వాళ్ళపైనే కోపం చూపిస్తాం అలాగని వాళ్లని మనం వదిలేసి ఉండలేమా నీ బిజినెస్ పని అయ్యేంతవరకూ ఇక్కడే ఉండు. వెళ్లి లగేజ్ తెచ్చుకో అని కార్తీక్ అంటాడు. డాక్టరమ్మ మా మీద కూడా ఇలాగే కోపం ప్రదర్శిస్తుంది కానీ మేము పట్టించుకోం అంటుంది దీప. ఆ తర్వాత ఎటువాళ్లు అటు వెళ్లిపోయిన తర్వాత మోనిత దీపపై ఫైర్ అవుతుంది..ఇద్దరూ కలసి నాటకాలు ఆడుతున్నారా అంటుంది. ఏమో డాక్టర్ బాబుకు తెలియకుండా నువ్వే రప్పించావేమో అని అంటుంది.

అటు సౌందర్య, హిమ కార్లో వెళ్తూ మాట్లాడుకుంటారు. మనం ఓ తప్పుచేశాం..ఆనంద్ కోసం ఓ గంట ముందే వెళ్లి ఉంటే బావుండేది వాడిని తెచ్చుకుని ఉంటే నీకు టైమ్ పాస్ అయ్యేది అంటుంది సౌందర్య. కాదు నానమ్మా..మనం లేటుగా వెళ్లి మంచిపని చేశాం..శౌర్య ఎలాగూ తల్లిదండ్రులతో లేదు..కనీసం ఆనంద్ అయినా తన అమ్మ తో ఉంటాడు కదా ఉండనివ్వండి అంటుంది. అప్పుడు సౌందర్య..నువ్వు చాలా పెద్ద దానివి అయిపోయావే అని హిమ ను పొగుడుతుంది. 

Also Read: ప్రాజెక్ట్ పేరుతో మళ్లీ ఒక్కచోట చేరిన ప్రియమైన శత్రువులు రిషిధార

News Reels

దుర్గ:చూసేవా దీపమ్మ నన్ను చూడగానే అది ఎలా భయపడిందో..
దీప:ఇది చాలదు దుర్గ నువ్వు ఇక్కడికి వస్తావని అనుకోకుండా మొదటి అడుగులో అది భయపడింది.. దానిభయం మొదలు మాత్రమే.. ఈ భయంతో కొత్తఆలోచనల వస్తాయి
దుర్గ: ఇప్పుడు ఏం చేద్దాం దీపమ్మ
అప్పుడు దీప ముల్లుని ముల్లుతోనే తీయాలని చెప్పి దుర్గకి ఒక పథకం చెప్తుంది. సరే నేను వెళ్లి అమలుపరుస్తాను ఈ లోపల నువ్వు వంట చేసి తీసుకుని రా అంటాడు. 

మోనిత ఇంట్లో కూర్చుని..దుర్గ ఇప్పుడే వచ్చాడంటే కార్తీక్ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటాడేమో అదే వాళ్ళ ప్లాన్ అయ్యుంటుందేమో!కార్తీక్ కి  ఏదో ఒకటి చెప్పి దుర్గని పంపించేయాలి అని అనుకుంటుంది. కార్తీక్ అక్కడికి వచ్చి, అయినా తన్ని ఎందుకు అలా అవమానించావు మోనిత అని అడుగుతాడు. మోనిత ఏదో చెప్పేలోగా దుర్గ ఎంట్రీ ఇస్తాడు. మీ స్నేహితుడు వచ్చాడు కదా ఒక స్పెషల్ వంట చెయ్యు మోనిత అంటాడు
దుర్గ: నేను హోటల్ కి వెళ్ళిపోతాను . సార్ తన వంట నేను సంవత్సరం తిన్నాను మీరు నాలుగేళ్లు తిని అలవాటైపోయినట్టుంది, నావల్ల కాదు. అప్పుడు కూడా ఇంతే బలవంతంగా ఉప్పు ఎక్కువ చేసి, ఉడకని వంటలు చేసేది. నేను ఇప్పుడు వంటలక్కని వండితెమ్మని చెప్పాను
మోనిత: తనికి వండిపెట్టానన్నది అబద్ధం అని మోనిత అంటే... 
దుర్గ: గతంలో జరిగిన విషయాలను ఇప్పుడు గుర్తు చేయనా మోనిత..కార్తీక్ సార్ ముందు మాట్లాడితే బాగుండదు..కార్తీక్ గారికి గుర్తు చేయద్దు తట్టుకోలేరని చెబుతుంది. రండి భోజనం చేద్దాం అని దుర్గ పిలుస్తాడు...

Also Read: మోనితపై కార్తీక్ కి మొదలైన అనుమానం, దీపకు అభయం ఇచ్చిన దుర్గ

మోనిత మాత్రం దీపను లాక్కుని బయటకు వచ్చి ఆర్గుమెంట్ మొదలుపెడుతుంది. డాక్టర్ బాబుకి నువ్వు నిజం చెప్పెయ్ అని చెప్పాలని దీప అనడంతో..ఎప్పటికీ చెప్పను అంటుంది మోనిత. ఏంటా నిజం అని కార్తీక్ బయటకు వస్తాడు. 
దీప:దుర్గ వచ్చినప్పటి నుంచీ భయపడుతోంది డాక్టరమ్మ...ఏదైనా ఉంటే చెప్పెయ్ అంటుంది
కార్తీక్: చెబితేనే కదా అర్థం చేసుకుంటాను అనేసి వెళ్లిపోతాడు..
దీప-దుర్గ కలసి మాట్లాడుకుంటారు. దానికి చిన్నబ్రేక్ ఇచ్చినా చెలరేగిపోతుంది అస్సలు బ్రేక్ ఇవ్వొద్దు...కనీసం వారంపాటు  అలాగే ఉండని చెబుతుంది. నన్ను పరాయి మగాడి వెనకాల పడుతున్న అమ్మాయి లా ఎలా ముద్ర వేసిందో, తనకి  కూడా అలాగే ముద్రపడాలి అంటుంది. ఇక డోస్ పెంచుతానని చెప్పి లోపలకు వెళతాడు దుర్గ

దుర్గ ఇక ఇక్కడే ఉంటే కార్తీక్ లో అనుమానం పెరిగిపోతుందని ఆలోచించిన మోనిత..ఎలాగైనా దుర్గని పంపించేయాలనుకుంటుంది. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన దుర్గని బెదిరించేందుకు చూస్తుంది మోనిత. చేతులు పట్టుకుని ఏదో మాట్లాడుతుండగా కార్తీక్ చూస్తాడు. కోపం పోవాలని బుజ్జగించడానికి చేయి పట్టుకున్నాను సార్ అని చెప్పి, నేను ఇంతవరకే మేనేజ్ చేశాను.తర్వాత నువ్వే మానేజ్ చేయని కావాలని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోనిత ఏదో చెప్పేలోగా కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. శివని కూడా బయటకు పంపించేశావా అని కార్తీక్ బయటకు వచ్చేస్తాడు. 

దీపని కలసిన కార్తీక్ మనసేం బాలేదు అంటాడు. ఏమైంది డాక్టర్ బాబు అని అడిగితే..చెప్పడానికి నాకే అసహ్యంగా ఉందంటాడు.  ఇంతలో శివ అక్కడికి వచ్చి నన్ను పిలిచారట సార్ అని అంటాడు. ఇప్పుడు అవసరం లేదులే అని కార్తీక్ అనడంతో మేడం మిమ్మల్ని ఓ రెండు గంటలు బయట తిప్పి రమ్మన్నారని చెబుతాడు. ఎప్పుడూ బయటకు వెళ్లొద్దనే మోనిత బయటకు ఎందుకు వెళ్లమందని కార్తీక్ ఆశ్చర్యపోతాడు. 
ఎపిసోడ్ ముగిసింది

Published at : 01 Oct 2022 09:21 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Serial October 1st Karthika Deepam Episode 1472

సంబంధిత కథనాలు

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు: అడివి శేష్

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు:  అడివి శేష్

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో  - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Chiranjeevi IFFI Award : ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అందుకున్న చిరంజీవి | ABP Desam

Chiranjeevi IFFI Award : ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అందుకున్న చిరంజీవి | ABP Desam