అన్వేషించండి

Karthika Deepam September 30 Update: మోనితపై కార్తీక్ కి మొదలైన అనుమానం, దీపకు అభయం ఇచ్చిన దుర్గ

కార్తీకదీపం సెప్టెంబరు 30 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...

Karthika Deepam September 30th Episode 1471 (కార్తీకదీపం సెప్టెంబరు 30 ఎపిసోడ్)

దుర్గా మోనిత కోసం వెతుకుతాడు.ఇటువైపు వచ్చింది కదా ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇటువైపు వెళ్లిందంటే ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండే ఉంటుంది...రేపు ఉదయం వచ్చి వెతుకుదామని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో మోనిత ఇంట్లో కూర్చుని, కార్తీక్ నాకు ఒక్కడికే కనిపించాడు ఇంక హాయిగా ఉందామనుకున్న సమయంలో, దీపొచ్చింది. తర్వాత ఆంటీ,అంకుల్ వచ్చారు. ఇందాక శౌర్య వచ్చింది. ఇప్పుడు వీడు వచ్చాడు. అందరూ కలిసి వస్తున్నారా లేకపోతే ఇదేమైనా ప్లానా! అయినా నేనెందుకు భయపడాలి అందరూ కలిసి వచ్చిన సరే ఎవరు గతం గుర్తు చేయడానికి ప్రయత్నించిన కార్తీక్ ప్రాణాలకే ప్రమాదం అన్నారు కదా ఇంకా! దీప అలాంటి పనిచేయదు అని అనుకుంటుంది.
 
ఇంతలో కార్తీక్ నిద్రలో... దీప, శౌర్య ఎక్కడున్నారు? రౌడీ త్వరగా రా అని కలవరిస్తూ ఉంటాడు. అది విన్న మోనిత భయపడి కార్తీక్ కి గతం గుర్తొచేసిందా అనుకుంటుంది.ఇంతలో శివ అక్కడికి వచ్చి ఆ మాటలు వింటాడు. కంగారుపడిన మోనిత  శివను బయటకు పంపించేస్తుంది. సర్ ఏంటి దీపక్క పేరు, ఎవరో రౌడీ పేరు చెబుతున్నారు కచ్చితంగా మేడమ్, సార్ భార్య కాదు దీపక్కే సార్ భార్య అయిఉంటుందా..అంతా  తికమక గా ఉంది అని అనుకుంటాడు.

మరోవైపు దుర్గా..రాత్రి మోనిత వచ్చిన రూట్లో ఫాలో అయిన చుట్టుపక్కల వెతుకుతుంటాడు. ఎవరినైనా అడుగుదాం అనుకుంటూ  ఆ తర్వాత సీన్లో దుర్గా ఆ సందు లో  మోనిత కోసం వెతుకుతాడు. ఎక్కడా కనిపించట్లేదు ఎవరినైనా అడుగుదాము అని దీప ఇంటి ఎదురుగా వచ్చి నిల్చుని ఓ మేడం అని పిలుస్తాడు. అక్కడ దీపను చూసి షాక్ అవుతాడు...దుర్గను చూసిన దీప.. దేవుడికి ఇప్పుడే దారి చూపమన్నాను అప్పుడే దుర్గని పంపించాడు అని అనుకుంటుంది.
దుర్గ: దీపమ్మ నువ్విక్కడున్నావ్ ఏంటి ? కార్తీక్ సార్ ఎలా ఉన్నారు పిల్లలు బాగున్నారా 
జరిగిన విషయం అంతా చెబుతుంది దీప..
దుర్గ: అది కార్తీక్ సర్ వెంట పడుతోందని తెలుసు కానీ మరీ ఇంత దారుణానికి తెగిస్తుందని అనుకోలేదు దానిపని చెబుతాను ఉండు...
దుర్గ పొలమారడంతో దీప మంచినీళ్లు తెచ్చేందుకు వెళుతుంది..ఇంతలో దుర్గ అక్కడ ఉండడు..

Also Read: దుర్గ రీఎంట్రీ ఇక మోనితకు దబిడి దిబిడే, సంతోషంలో దీప-షాక్ లో కార్తీక్

కార్తీక్ నిద్ర లేచి తలనొప్పిగా ఉంది మోనిత అనడంతో..ఇప్పుడు తలదుర్దితే గతం గుర్తొస్తుందేమో అని భయపడిన మోనిత డాక్టర్లు చెప్పారు కదా తల రుద్దొద్దంటుంది. తలరుద్దినంత మాత్రాన మెదడులో సెరటోనియల్ లెవెల్స్ తగ్గవు అని అంటాడు.
షాక్ అయిన మోనిత..నిన్న రాత్రి భార్య, పిల్లలు అని కలవరించాడు. ఇప్పుడు డాక్టర్ లా మాట్లాడుతున్నాడు ఏం చేయాలి అని అనుకునే సమయంలో మేడం అనే పిలుపు వినిపిస్తుంది. హమ్మయ్య ఎవరో వచ్చినట్టున్నారు అనుకుని కార్తీక్ ఎవరో వచ్చారు నేను వెళ్తాను అని వెళ్ళిపోతుంది. అక్కడ దుర్గని చూసేసరికి మోనిత షాక్ లో నిల్చుండిపోతుంది. 
మోనిత: దుర్గా నేను చాలా హీనమైన పరిస్థితిలో ఉన్నాను దయచేసి నన్ను వదిలేయ్ నీకు ఎంత కావాలో చెప్పు ఇచ్చేస్తాను 
మోనిత: నాకు ఇప్పుడు డబ్బులు అవసరం లేదు బంగారం. బానే సంపాదిస్తున్నాను అయినా నన్ను చూసిన తర్వాత మాట్లాడతావ్ అనుకుంటే పారిపోయావు అందుకే నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను  నా దగ్గర డబ్బులు, వైభోగం అన్నీ ఉన్నాయ్ కాని ఎంజాయ్మెంట్ లేదు అందుకే నీ దగ్గర ఉన్న నాలుగు రోజులు ఉందామని వచ్చాను 
మోనిత:  కోపంతో ఏం మాట్లాడుతున్నావు అనడంతో  శివ అక్కడికి వస్తాడు. 
శివ: మేడం ఎవరితను
దుర్గా: నేనూ మీ మేడం క్లోజ్ ఫ్రెండ్ ని 
మోనిత: నాకు ఇతను తెలుసు శివ కానీ ఇతని బుద్ధి మంచిది కాదు పంపించేయ్
ఎవడ్రా నువ్వు అని దుర్గ భుజం మీద చెయ్యేస్తాడు శివ.... అప్పుడు మోనిత బయటకు తీసుకువెళ్లిపో శివ ఇతన్ని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు దుర్గా చేయి తీయరా అని అంటాడు కాని శివ చేయ తీయడు. ఆ తర్వాత దుర్గ దీప దగ్గరికి వస్తాడు. మంచినీళ్లు అని అడిగి ఎక్కడికి వెళ్ళిపోయావు దుర్గ అని అనగా, ఆ మోనితకి చిన్న షాక్ ఇద్దామనుకొని వెళ్ళానమ్మ కానీ అక్కడ అది పెద్ద షాకే తిన్నది అని అంటాడు
దీప: చెప్పాను కదా దుర్గా..డాక్టర్ బాబుకి గతంగుర్తుకు రాకూడదనే దాని ప్రయత్నం
దుర్గ: మనం నయం చేయాల్సింది కార్తీక్ సార్ కి కాదు ఆ మోనితకి తనంతట తానే, నేను మీ భార్యను కాదు దీపే మీ భార్య అని చెప్పించేలా చేస్తాను 
అప్పుడు దీప ఆనందపడి..నా శక్తికి మించి చాలా ప్రయత్నాలు చేశాను దుర్గా ఇంక నావల్ల కాదు అనుకునే సమయంలో నువ్వు నాకు తోడుగా వచ్చావు. దేవుడే నిన్ను పంపించినట్టున్నాడు అని అనుకుంటుంది. 

Also Read: రిషికి ప్రేమగా అన్నం తినిపించిన వసు - ఆపరేషన్ రిషిధార కు ప్లాన్ చేసిన జగతి అండ్ కో!

మరోవైపు మోనిత కంగారుగా కార్తీక్ దగ్గరికి వెళ్లి కార్తీక్ మనం ఇల్లు మారిపోదాం అంటుంది. ఇంకా భయపడుతున్నావా అని కార్తీక్ అనడంతో...లేదు కార్తీక్ ఎవరి మీద భయంతోనే నేను వెళ్లడం లేదు కేవలం నాకు ఊరి బయట ఇల్లు తీసుకోవాలని ఉంది అనడంతో ఆలోచిద్దాంలే అన్న కార్తీక్ శివని వెతుక్కుంటూ వెళతాడు. బయట శివ కళ్లు తిరిగి పడిపోయి ఉంటాడు. వెంటనే కార్తీక్  శివ చేతి నీ పట్టుకుని హార్ట్ బీట్ చూసి వెళ్లి మంచి నీళ్ళు తీసుకురమ్మని అంటాడు. మంచినీళ్లు మొఖం మీద కొట్టి లేపేసరికి మోనిత భయపడి డాక్టర్లా ప్రవర్తిస్తున్నాడేంటి అని అనుకుంటుంది. అప్పుడు కార్తీక్ శివతో ఏమైంది పడిపోయావు అని అనగా ఇందాక ఎవరో వచ్చారు సార్.మేడం బెస్ట్ ఫ్రెండ్ అంట మేడం బయటకు పంపించమన్నారు తన భుజం మీద చెయ్యేసాను, అప్పడు కొట్టాడు అంతే ఇప్పుడే లేచాను అని అంటాడు శివ. అప్పుడు కార్తీక్,బెస్ట్ ఫ్రెండ్ అయ్యుంటే బయటకు పంపించడం ఎందుకు అని మోనితని అడగంతో ఇంతలో దుర్గ ఎంట్రీ ఇస్తాడు...
దుర్గ: నమస్తే సార్ నేను మోనిత ప్రాణ స్నేహితుడిని. నా మీద అలిగింది అందుకే నాతో సరిగ్గా మాట్లాడటం లేదు అని అంటాడు. 
కార్తీక్: నీ మీద ఎందుకు అలగడం
దుర్గ: వాళ్ళకి నచ్చింది ఇవ్వకపోతే అలుగుతారు. అలాగే నేను మీ పెళ్లికి ముందు ఒకటి ఇవ్వలేకపోయాను అందుకే అలిగింది, అందుకే మీ పెళ్లికి కూడా నన్ను పిలవలేదు. నాకు ఈ ఊర్లో కొంచెం బిజినెస్ పనుంది అలాగే హోటల్లో ఉండడం ఎందుకు ఇక్కడే నాలుగు రోజులు ఉంటే మోనిత అలక తీర్చినట్టు ఉంటుంది అనుకున్నాను కానీ అది నన్ను బయటకి తోసిసింది
ఇంతలో దీప అక్కడకు వచ్చి..తమ్ముడు శివ గోంగూర పచ్చడి అడిగావు కదా ఇదిగో అని ఇస్తుంది. అప్పుడు దుర్గను చూసిన దీప, ఎవరండీ తను అని కార్తీక్ ని అడుగుతుంది. మోనిత స్నేహితుడట అని కార్తీక్ అంటాడు. అప్పుడు మోనిత కచ్చితంగా వీళ్ళిద్దరూ ఏదో నాటకం వేస్తున్నారు. నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా చేస్తున్నారు అని అనుకుంటుంది. దుర్గ...నేను వెళ్లి హోటల్ లో ఉంటానులెండి ఇక్కడ తనకు ఇష్టం లేనట్టుంది అనడంతో కార్తీక్ అపుతాడు..ఎపిసోడ్ ముగిసింది...

రేపటి(శనివారం) ఎపిసోడ్ లో
దుర్గను వెళ్లిపొమ్మని బెదిరిస్తుంది మోనిత...దుర్గతో మోనిత సన్నిహితంగా ఉండడం చూసి కార్తీక్ ఇరిటేట్ అవుతాడు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Embed widget