ఈ రాశివారు జరగబోయేది ముందే చెప్పేస్తారు!



మొత్తం 12 రాశులుంటాయి. వీటిలో ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే రాశులవారికి సిక్స్త్ సెన్స్ ఎక్కువ. అందుకే వీళ్లకి సమస్యలు, సమస్యాత్మక వ్యక్తులు ఎదురైనప్పటికీ వారిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.



మంచైనా చెడైనా జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు జరగబోయేది ముందే గుర్తిస్తారట..ఆ రాశులేంటో చూద్దాం..



మిథున రాశి
ఈ రాశి వ్యక్తులు సాంఘికవాదులు. తమ జీవితంలోని వివిధ వ్యక్తులతో సన్నిహితంగా మాట్లాడే ధోరణి కలిగి ఉంటారు. ఈ కారణంగా వీళ్లు తెరిచిన పుస్తకంలా ఉంటారు..ఎదుటివారిని కూడా ఈజీగా చదివేస్తారు. తమను కలిసిన లాకిని చదివేయడంలో ఈ రాశివారు నిష్ణాతులు.



కర్కాటక రాశి
కర్కాటక రాశిని భావోద్వేగ రాశిగా పరిగణిస్తారు. మనిషిని గుర్తించే అత్యుత్తమ సామర్థ్యం వీళ్లకి ఉంటుంది. ఏ వ్యక్తి ప్రత్యేకత ఏంటో వీళ్లు ఇట్టే పసిగట్టేస్తారు. నిశ్శబ్ధంగానే ఉంటూ తమకు సమీపంలో ఉన్న వారిని గమనిస్తారు. వీరితో మాట్లాడిన వారిని ఈజీగా అంచనా వేసేస్తారు.



తులా రాశి
తులా రాశివారికి నిశిత పరిశీలన చాలా ఎక్కువ. వీరికి సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువగా పని చేస్తుంది. తమ చుట్టూ ఉన్న అన్ని పరిస్థితుల విషయంలోనూ వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. తర్వాత ఏం జరగబోతోంది అనే విషయాన్ని వీరు కాస్త తొందరగా పసిగట్టగలరు.



వృశ్చిక రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారు చాలా తెలివైనవారు, కష్టపడి పనిచేసేవారు. ఎవరైనా వారికి అబద్ధం చెబితే వెంటనే పసిగట్టేస్తారు. ఎవరి నుంచి జాగ్రత్తగా ఉండాలో ముందే పసిగట్టేస్తారు. అందుకే ఈ రాశివారిని అంత ఈజీగా మోసం చేయలేరు.



ధనుస్సు రాశి
ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. సిక్త్స్ సెన్స్ ఉండడం వల్ల భవిష్యత్ లో జరగబోయే లాభనష్టాలను ముందే అంచనా వేసేస్తారు. ఈ రాశి వారు తమతో మాట్లాడే వారి మనసులో ఏముందో చాలా త్వరగా తెలుసుకుంటారు.



మీన రాశి
మీన రాశి వారి బుర్ర చాలా పదునుగా ఉంటుంది. ఏ పని మొదలెట్టినా కచ్చితంగా విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉంటారు. ఫ్యూచర్లో ఏది మంచో ఏది చెడో ముందే గ్రహించుకోగలుగుతారు. ఒకవేళ సమస్య వస్తుందంటే ముందుకానే అప్రమత్తం అయి అక్కడి నుంచి తప్పుకుంటారు.



'చెప్పాకదా ముందే చెప్పాను కదా అలా జరుగుతుందని కానీ నువ్వే వినలేదు' ఇలా మీ స్నేహితులు,సన్నిహితుల్లో ఎవరో ఒకరి నుంచి ఈ మాట వినే ఉంటారు. ఒకటి రెండు కాదు చాలా సందర్భాల్లో వారి మాట నిజమవుతుంది కూడా.



నీ నోటితో ఏమీ అనొద్దు ఏం అంటే అది జరిగిపోతుంది అంటారు కొందరు. అదే సిక్త్ సెన్స్ అన్నమాట.