Karthika Deepam December 1Update:కార్తీక్ గురించి దీపకి నిజం చెప్పేసిన డాక్టర్, మోనితను బంధించిన సౌందర్య
కార్తీకదీపం డిసెంబరు 1 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Karthika Deepam December 1st Episode 1524 (కార్తీకదీపం డిసెంబరు 1ఎపిసోడ్)
దీపని చూసి కార్తీక్ బాధ పడతాడు. దీప జీవితంలో సమస్యలేని క్షణం లేదని అనుకుంటాడు. ఆపరేషన్ సమయానికి బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉండాలని..ఆవిడ ఏదో విషయంలో తీవ్రంగా ఆలోచిస్తోందని ఆ విషయం పరిష్కరించండి అని అక్కడికి వచ్చిన డాక్టర్ చెబుతుంది. సరే అన్న కార్తీక్..నేను ఆపరేషన్ చేసినట్టు మా ఆవిడకు చెప్పొద్దు ప్లీజ్ అంటే..సరే అని.. ఏదైనా సమస్య ఉంటే ముందే సాల్వ్ చేసుకోండి అని చెబుతుంది. అది విన్న కార్తీక్..ఆపరేషన్ అయిపోయిన తర్వాత నిజం చెప్పేస్తాను అనుకుంటాడు..
మరోవైపు మోనితను తీసుకెళ్లి రూమ్ లో బందిస్తుంది సౌందర్య. నీ కొడుకుని తీసుకొచ్చినందుకు మా మీద కేసు పెడతానన్నావు కదా అంటే..అప్పుడేదో ఆవేశంలో అన్నానంటుంది. నన్ను వదిలేయండి అని మోనిత అంటే...నువ్వు ఏదో చేస్తున్నావే కానీ ఏదో దాస్తున్నావు అయినా నీకు బట్టలు కొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదని సౌందర్య అనుమానపడుతుంది. మరి నా తల ఎందుకు పగుల కొట్టావని అడిగితే..మీరు అస్తమానం వచ్చిన నన్ను విసిగిస్తున్నారు అందుకే అని చెప్పి తప్పించుకుంటుంది. కార్తీక్ కి గతం గొర్తొచ్చిందా..గుర్తొస్తే ఇక్కడకే వచ్చేవారు కదా..రానీ మళ్లీ మొదట్నుంచీ మొదలెడతా అనుకుంటుంది
మరోవైపు కళ్లు తెరిచిన దీప...కార్తీక్ ని శౌర్య గురించి అడుగుతుంది. రోజులుగా వెతికినా దొరకలేదు ఇప్పుడు ఎలా దొరుకుతుందా అని అంటాడు. శౌర్య గురించి పక్కన పెట్టు నువ్వు ఎందుకు బయటికి వెళ్లావు నేను వెతుక్కుంటూ వచ్చేసరికి అలా రోడ్డు పక్కన పడిపోయావని బాధతో మాట్లాడుతాడు.
దీప : మాట్లాడకండి డాక్టర్ బాబు పదేపదే ఆరోగ్యమంటారు నా కూతురు దొరికనప్పుడు నాకు ఆరోగ్యం ఎందుకు నా కూతురిని వాళ్ళు ఎక్కడికైనా దూరంగా తీసుకొని వెళ్ళిపోతారేమో అని బాధగా ఉంది
కార్తీక్:నిన్ను వదిలేసి ఎలా వెళతాను
దీప: నేను ఏమైనా చిన్న పిల్లనా...శౌర్య చిన్నపిల్ల కదా
కార్తీక్: ఏడవద్దు..నీ ఆరోగ్యం బాలేదు..బీపీ పెరుగుతుంది..
దీప: అసలు నాకు ఆపరేషనే వద్దు..నేను వెళ్లిపోతాను..
కార్తీక్: ఎందుకు మొండిగా ప్రవర్తిస్తున్నావ్..రేపు శౌర్య వచ్చాక తనని చూసుకోవాలంటే ఆరోగ్యంబావుండాలి కదా.. నీకు ఆపరేషన్ ఇవాళే జరగాలి కానీ నువ్వుటెన్ష్ పడడం వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది...
దీప: మీరు నా ఆరోగ్యం గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నారు..అసలు ఆపరేషన్ కోసం ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు
కార్తీక్: నేనే నీ పరిస్థితుల్లో ఉంటే ఇలాగే చూసుకునేదానివా...సంబంధం లేకుండా వదిలేసేదానివా
దీప: చూసుకుంటాను ...కానీ...మీరు నా భర్త ..కానీ నన్ను భార్య అనుకోవడం లేదుకదా..ఇప్పుడు మోనిత వచ్చి రమ్మంటే క్షణాల్లో ఇక్కడి నుంచి వెళ్లిపోతారు..కానీ నేను దేవుడే దిగి వచ్చినా మిమ్మల్ని వదిలి వెళ్లను..అది మీకు నాకు తేడా... ఇప్పుడు చెప్పండి నాకోసం ఎందుకిదంతా
కార్తీక్: నువ్వు నన్ను భర్తగా అనుకుంటున్నావ్ కదా..నీభర్త చెబితే వింటావుకదా..రేపు ఆపరేషన్ అయ్యేవరకూ ప్రశాంతంగా ఉండు..ఈ ఒక్కమాటా విను..సరేనా...డాక్టర్ తోమాట్లాడి వస్తాను మళ్లీ ఈ గది దాటి బయటకురావొద్దు..
Also Read: జగతి ఆనందంపై నీళ్లు చల్లేసిన రిషి, మరో కుట్ర ప్లాన్ చేస్తోన్న దేవయాని!
ఇంద్రుడు చంద్రమ్మ ఎంత అడిగినా కూడా పట్టించుకోకుండా ఒక చోటికి తీసుకెళతాడు.. ఏం జరిగిందో చెప్పు అని గట్టిగా అరుస్తుంది చంద్రమ్మ. అప్పుడు ఇంద్రుడు జరిగింది మొత్తం చంద్రమ్మకు వివరిస్తాడు. అంత ఆస్తిపరురాలైన ఆమె శౌర్యమ్మ కోసం తిరిగి తిరిగి ఒక అనాధల రోడ్డు పక్కన పడింది చంద్రమ్మ అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతాడు ఇంద్రుడు. అప్పుడు చంద్రమ్మ అయితే ఇచ్చేద్దాం గండ వెంటనే చంద్రుడు నాకు మనసంతా ఏదోలా ఉంది నిద్ర పట్టడం లేదు ఆకలి కావడం లేదు అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతాడు. సరే గండ నాకు నువ్వు నీకు నేను చాలు మనకు పిల్లలు అవసరం లేదు శౌర్య ని వాళ్లకు ఇచ్చేద్దాం అంటుంది.
అప్పుడు పోస్టర్లో ఉండే ఫోన్ నెంబర్ కీ ఫోన్ చేసి ఆ అడ్రస్ కి వెళ్తాడు కార్తీక్. నీకు ఇంద్రుడు తెలుసా అని అడిగితే తెలియదు అని అబద్ధం చెబుతాడు. అప్పుడు అతను ఈ ఫోన్ ఇచ్చి ఎవరు వచ్చినా నిజం చెప్పొద్దు అని అన్నాడు..ఇతను చూస్తే పోలీసులు కేసులు అంటున్నాడు ఎందుకు వచ్చిన గొడవ అసలు నిజం చెప్పేస్తాను అనే కార్తిక్ దగ్గరికి వెళ్తాడు. మళ్లీ అబద్ధం చెప్పడంతో కార్తీక్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు.
మరోవైపు దీప శౌర్య ఫోటో పట్టుకుని హాస్పిటల్లో అందరినీ అడుగుతూ కళ్ళు తిరిగి పడిపోతుండగా ఇంతలో కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు. ఏంటి దీప ఇలా చేస్తున్నావు నీకు ఏం చెప్పాను బయటకు రావద్దు అని చెప్పానా లేదా అని అంటాడు కార్తీక్. బయటికి వెళ్ళొద్దన్నారు కనీసం బయటకు కూడా రాకూడదా అని అనగా నువ్వు రూమ్ లో నుంచి బయటకు రాకూడదు దీప ఆపరేషన్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు కార్తీక్.
Also Read: కార్తీక్ ని ప్రశ్నించిన దీప, మోనితను తీసుకెళ్లిపోయిన సౌందర్య, ఇంద్రుడిలో మార్పు -ఇదే కీలక మలుపు
రేపటి(శుక్రవారం)ఎపిసోడ్ లో
వాడు నా బిడ్డని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లిపోతే ఎవరు తీసుకొస్తారు..నేనే వెళ్లి వెతుక్కుంటా అని బెడ్ పైనుంచి దీప లేస్తుంది. అక్కడున్నడాక్టర్ కోపంగా...ఆయన ఇక్కడే ఎందుకున్నారంటే...నీకు ఆపరేషన్ చేసింది తనే అని నిజం చెప్పేస్తుంది..