1 డిసెంబరు 2022 రాశిఫలాలు



మేష రాశి
ఈ రాశివారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇతరులను ఆకట్టుకోవడానికి అధికంగా ఖర్చు చేయొద్దు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. అనవసర చర్చల్లో సమయాన్ని వృథా చేయడం కంటే ప్రశాంతంగా ఉండడం మేలు.



వృషభ రాశి
కుటుంబ సభ్యుల్లో కొందరి అసూయ స్వభావం మీకు చికాకు కలిగిస్తుంది..కానీ మీరు వివేచన కోల్పోవద్దు. లేదంటే పరిస్థితి అదుపు తప్పుతుంది. కొన్నింటిని మెరుగుపర్చలేరు వాటిని అంగీకరించడమే మంచింది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.



మిథున రాశి
దీర్ఘకాలంగా ఉన్న రోగాలు దూరమవుతాయి. భాగస్వామ్య వ్యాపారం, ఆర్థిక పథకాలలో పెట్టుబడికి ఇది మంచి సమయం కాదు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇంటి విషయాలు ఈ రోజు పూర్తవుతాయి.



కర్కాటక రాశి
మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కోపం ప్రదర్శించవద్దు. ఈ రోజు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులకు మంచి సమయం. స్నేహితులు, కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేస్తారు.



సింహ రాశి
ఈ రోజు పనిభారం కొంత ఒత్తిడికి, చిరాకును కలిగిస్తుంది. డబ్బు ఆదాచేయడానికి ఇంట్లో పెద్దల సలహాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు



కన్యా రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అదనపు ఆదాయాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టొచ్చు. వృద్ధుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పని ఒత్తిడిని జయిస్తారు. నిరుద్యోగులకు మంచి సమయం. ఇంటర్యూల్లో విజయం సాధిస్తారు.



తులా రాశి
ఈ రోజు ఈ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి. సమయానికి,డబ్బుకి విలువ ఇవ్వండి...లేదంటే రాబోయే రోజుల్లో కష్టాలు తప్పవు. కుటుంబ జీవితం బావుంటుంది. సంతోషంగా ఉంటారు.



వృశ్చిక రాశి
ఇతరుల విజయాన్ని మెచ్చుకోవడం ద్వారా మీరు ఆనందిస్తారు. పాత పెట్టుబడుల వల్ల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ చుట్టూ ఉన్న కొంతమంది మీకు చెడుచేసేవారే..వారిని గుర్తించి దూరంగా ఉండడం మంచిది. ఒకరి జోక్యం కారణంగా మీ వ్యక్తిగత జీవితంలో కలతలు వస్తాయి.



ధనుస్సు రాశి
ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలను పునఃప్రారంభించడానికి రోజు మంచిది. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకానికి ఈ రోజు మంచిరోజు. మీరు మీ ఇంటి బాధ్యతలను విస్మరించడంతో ఇంట్లో వారి కోపానికి గురవుతారు.



మకర రాశి
మీ అదనపు శక్తిని అందరి ప్రయోజనం కోసం సానుకూలంగా ఉపయోగించాలి. ఉద్యోగులు పనిని శ్రద్ధగా చేయాలి. వ్యాపారులు అప్పులు ఇవ్వొద్దు. ఇంట్లో చిన్న సమస్య కూడా పెద్దగా చేసేవారున్నారు జాగ్రత్త.



కుంభ రాశి
ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది. అనుకోని ఖర్చులు పెరిగి మీ మనశ్శాంతికి భంగం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. వారి సంతోషం, దుఃఖంలో పాలుపంచుకోండి. మీ ప్రియమైన వారితో బయటకు వెళ్లేటప్పుడు మీ దుస్తులు, ప్రవర్తనలో వినూత్నంగా ఉండండి.



మీన రాశి
ధ్యానం, యోగా మీకు ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా భౌతికంగా కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పిల్లలు చదువుపై దృష్టి సారించి భవిష్యత్తును ప్లాన్ చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు.