డిసెంబరు నెల ఈ రాశులవారికి కలిసొస్తుంది

కన్యా రాశి
డిసెంబరు నెల కన్యారాశివారికి అత్యద్భుతంగా ఉంది. ఆస్తులు కలిసొస్తాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. జీవిత భాగస్వామి, పిల్లల వల్ల సంతోషంగా ఉంటారు. అధికార అనుగ్రహం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలొస్తాయి. బంధువర్గంలో ఆధిక్యత ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక లాభాలుంటాయి.

తులా రాశి
ఈ నెల మీ గ్రహసంచారం బావుంది. అన్ని రంగాలవారికి ఈ నెల అనుకూల సమయం. ఆదాయానికి లోటుండదు..అనుకున్న పనులు చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ నెరవేరుతాయి. ప్రతివిషయంలోనూ ముందుంటారు. స్నేహితులకు సహాయ సహకారాలు అందిస్తారు. నమ్మినవారివలన మోసపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త.

వృశ్చిక రాశి
ఈ నెల వృశ్చిక రాశివారికి పరిస్థితులు కొంతవరకూ కలిసొస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఏడో స్థానంలో కుజుడి సంచారం వల్ల కోపం అధికంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఉద్రేక పడతారు. చికాకు కలిగించే సంఘటనలు జరుగుతాయి. తీరికలేనంత బీజీగా ఉంటారు. రాని బాకీలు వసూలవుతాయి.

ధనస్సు రాశి
ధనస్సు రాశివారికి డిసెంబరు నెల మిశ్రమ ఫలితాలున్నాయి.ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఆరోగ్యం బావుంటుంది. రవి సంచారం ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు...అయినప్పటికీ ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉంటారు. నమ్మినవారే మోసం చేస్తారు. అనుకోని ప్రమాదం పొంచిఉంది జాగ్రత్తపడండి.

కుంభ రాశి
ఈ నెల కుంభరాశివారికి బాగానే ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడతారు. సమస్యలుతొలగి జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దేనికీ లోటుండదు..ఆర్థిక పరిస్థితి బావుంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులు,స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది.

మీన రాశి
డిసెంబరు నెల మీన రాశివారికి గ్రహసంచారం అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనుల్లో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. గత నెలతో పోల్చుకుంటే ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అడుగువేస్తారు. కోపం తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. కుటుంబంలో వివాదాలకు దూరంగా ఉండండి.

నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

(Images Credit: Freepik)