తులా రాశి నుంచి మీన రాశి వరకూ ఈ వారం ఎలా ఉందంటే ( నవంబరు 27- డిసెంబరు 3)
తులా రాశి ఈ వారం తులారాశివారికి అద్భుతంగా ఉంది. చేపట్టిన పనులన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది..ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు.
వృశ్చిక రాశి గ్రహబలం అనుకూలంగా ఉంది. విందు వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సమయం మీకు అనుకూలంగా ఉంది. మంచి ఆలోచనతో చేసే పని సక్సెస్ అవుతుంది. వ్యాపారులు, ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. నూతన పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి. ఈ వారం మీరు ఓ శుభవార్త వింటారు.
ధనుస్సు రాశి ఈ వారం మీకు చేపట్టే పనుల్లో సక్సెస్ అవుతారు. స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాలు కలిసొస్తాయి. వ్యాపారులు అనుకున్న విధంగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. అవసరానికి సహాయం చేసే స్నేహితులు మీరున్నారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు...పెట్టుబడులకు సరైన సమయం.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) ఈ వారం ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు అధిగమిస్తారు. నిముషానికో నిర్ణయం తీసుకునే ఆలోచనను మార్చుకోకుంటే ఇబ్బంది పడతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు) ఈ వారం మీరు చేపట్టే కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కాంట్రాక్టర్లకు కలసివచ్చే కాలం ఇది. వాహనాలు, స్థలాలు కొనుగోలు కోసం ప్రయత్నాలు సాగుతాయి. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులు కొత్త భాధ్యతలను తీసుకుని సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఖర్చులు తగ్గించాలి
మీన రాశి ఈ వారం మీన రాశివారికి అనుకూల సమయం. నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించిన సమాచారం వింటారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది..అప్పుల బాధ తీరుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు సరైన సమయం. పారిశ్రామిక వేత్తలు,కళాకారులకు కూడా కలిసొచ్చే సమయం ఇది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి.
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు