నవంబరు 27 రాశిఫలాలు

మేష రాశి
ఈ రాశివారు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమ వ్యవహారాలు మీకు పెద్దగా కలసిరావు

వృషభ రాశి
ఉద్యోగాలు మారాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం మీకు అందుతుంది. సంతోషం, శ్రేయస్సు పెరగడం వల్ల సమస్యను తెలివిగా పరిష్కరించుకోవడం సాధ్యమవుతుంది.

మిథున రాశి
అనుకోకుండా చేసిన పొరపాటు వల్ల నష్టపోతారు. వ్యాపారంలో సమస్యలు ఒత్తిడిని పెంచుతాయి. కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. ఉత్తమ వ్యక్తులతో సమావేశం ఉంటుంది. కుటుంబ కలహాలు తీరుతాయి.

కర్కాటక రాశి
నూతన పెట్టుబడులకు ఈ రాశివారికి ఇది అనుకూల సమయం. ఉద్యోగంలో పని పెరుగుతుంది. ఈ రోజు మీరు శుభ-అశుభ రెండు వార్తలూ వినే అవకాశం ఉంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. సమయ పాలన చాలా అవసరం.

సింహ రాశి
మీ కుటుంబ సభ్యులను అనవసరంగా అనుమానించకండి. ఈ రోజు మీరు ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీ ప్రియమైనవారి ప్రాముఖ్యతను మరచిపోకండి. వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు సకాలంలో తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

కన్యా రాశి
సమయానికి పని చేయడం నేర్చుకోండి. మీ ఆలోచనలను నియంత్రించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఖర్చుల పెరుగుదల బడ్జెట్‌ను పాడు చేస్తుంది. వ్యాపారం సాధారణంగా సాగుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది.

తులా రాశి
ఈ రోజు మీ కుటుంబానికి ముఖ్యమైన రోజు. వ్యాపారంలో అధిక ఆలోచనల వల్ల అలసిపోతారు. ఉద్యోగులు, ఇతర పనులు చేసేవారు పనికి తగిన ఫలితం పొందుతారు. వాహనం కొనాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు.

వృశ్చిక రాశి
మీ చుట్టూ ఉన్నవారికి మీపై ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోండి. బయటి వారిని త్వరగా నమ్మి నెత్తిన పెట్టుకోవడం మానేస్తే చాలా మంచిది. అర్థం లేని వివాదాలకు దూరంగా ఉండండి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి
ఈ రోజు ప్రారంభం నుంచీ బిజీగా ఉంటారు. మీ దినచర్య దెబ్బతింటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు బాగా సాగుతాయి. చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ సక్సెస్ కోసం ప్రయత్నించడం మానొద్దు

మకర రాశి
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ, గృహ సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో మీ ప్రభావం పెరగడం వల్ల శత్రువులు ఓడిపోతారు. ప్రయాణంలో మీ వస్తువులను సురక్షితంగా ఉంచండి. కొత్త సంబంధాలు లాభిస్తాయి.

కుంభ రాశి
ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ కీర్తి పెరుగుతుంది. చేయాల్సిన పనుల నుంచి తప్పించుకోవద్దు...మీ పరిచయాల వల్ల ప్రయోజనం పొందుతారు

మీన రాశి
అవసరమైన పత్రాలను సకాలంలో సేకరించండి. పిల్లల చదువు గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారంలో కొత్త ప్రతిపాదనలు అందుతాయి. వ్యక్తిగత పనుల్లో నిర్లక్ష్యం వద్దు. కార్యాలయంలో పురోగతికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.