ఏడాది ఆరంభంలోనే శని ప్రభావం తగ్గడంతో మీరున్న రంగంలో అడుగులు వడివడిగా పడతాయి. 2022 లో రకరకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడిన వారు 2023లో ఉపశమనం పొందుతారు
మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి కానీ మీ తెలివితేటలతో ఎలాంటి సమస్యా లేకుండా బయటపడతారు
కొత్త ఏడాదిలో మొదటి 40 రోజులు మాత్రమే ఇబ్బందికర పరిస్థితులుంటాయి..ఆ తర్వాత అంతా మంచే జరుగుతుంది
ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి..మానసిక ఒత్తిడి తగ్గతుంది...నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది .. మీ చుట్టూ ఉన్న అన్ని పరిస్థితులలో మార్పులు ఉంటాయి
ఈ సమయంలో మీరు విదేశీ పర్యటనలతో పాటూ దూర ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు
ఉద్యోగం మారాలి అనుకుంటే లాభదాయకంగా ఉంటుంది..మీకు సంతోషాన్నిస్తుంది..ఉద్యోగం మారడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు
నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు
సంవత్సరం ప్రారంభ నెలల్లో పిల్లలకు సంబంధించిన ఒత్తిడులు ఉంటాయి, ప్రేమ జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కానీ ఈ సమయం మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది
మొదటి నాలుగు నెలలు కన్నా తర్వాత 8 నెలలు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. 2023 మీ జీవితంలో మంచి సమయం అని చెప్పుకోవచ్చు
బృహస్పతి అనుగ్రహం వల్ల కుటుంబ జీవితం సామరస్యం, శాంతితో నిండి ఉంటుంది, శుభకార్యాలు జరుగుతాయి