2023లో మేషరాశి వారి నెలవారీ ఫలితాలు

సంవత్సరం ప్రారంభంలో తొమ్మిదవ ఇంట సూర్యుడు, పదో స్థానంలో శని ఉండటం వల్ల ఓ గొప్పపని చేయాలనే సంకల్పం పెట్టుకుంటారు..తద్వారా మంచి పేరు పొందుతారు

ఫిబ్రవరిలో శుక్రుడు పదకొండో స్థానంలో సంచరించడం వల్ల స్నేహితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ప్రేమ జీవితం కూడా అందంగా ఉంటుంది.

మార్చిలో కుజుడు మూడో స్థానంలో ప్రవేశించడం వల్ల మీకు ధైర్యం, దృఢ సంకల్పం పెరుగుతుంది. తోబుట్టువుల మద్దతు ఉంటుంది కానీ శారీరక అనారోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు.

ఏప్రిల్‌లో బృహస్పతి మీ రాశిలోకి ప్రవేశిస్తుంది.. ఈ ఫలితంగా పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, అదృష్టం కలిసొస్తుంది.

మే - జూన్ మధ్యలో ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో కుటుంబ సంపద గురించి వివాదాలు ఉండవచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

జూలై -ఆగస్టు మధ్య మీరు మీ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. కోర్టు సంబంధిత విషయాల్లో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కెరీర్‌లో ప్రమోషన్ అవకాశాలు బలంగా ఉన్నాయి.

సెప్టెంబరు-అక్టోబరులో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది.

నవంబర్-డిసెంబరులో మీ ఖర్చులు పెరుగుతాయి. రాహువు పన్నెండో స్థానంలో సంచరించడం వల్ల అనుకోని తప్పించుకోలేని ఖర్చులుంటాయి...

నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Follow for more Web Stories: ABP LIVE Visual Stories