నవంబరు 24 రాశిఫలాలు

మేష రాశి
ఈ రాశివారికి మంచి స్నేహితులుంటారు...అవసరమైనప్పుడు వారినుంచి సహాయం పొందుతారు. ఇప్పుడు మీకున్న పరిచయాలు భవిష్యత్ లో ఉపయోగపడతాయి. వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి.

వృషభ రాశి
జీవిత భాగస్వామి పట్ల విశ్వాసంగా ఉంటారు...కానీ..ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయేమో అనే భయం వెంటాడుతుంటుంది. అవివాహితులకు ఇంకొన్నాళ్లు నిరాశ తప్పదు. నిరుద్యోగులు మరికొంత కాలం ఉద్యోగం కోసం వెతకాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు.

మిధునరాశి
ఈ రోజంతా సోమరిగా ఉంటారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మంచి రోజు. డబ్బుల కోసం తప్పుచేయాలనే ఆలోచన విరమించుకోండి. చెడు ప్రవర్తన ఉన్నవారితో స్నేహం సరికాదు. మీ చుట్టూ ఉన్నవారితో కొంత అప్రమత్తంగా వ్యవహరించండి. ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన ఉంటుంది.

కర్కాటక రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు మాత్రం మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. పనులన్నీ సకాలంలో పూర్తిచేస్తారు.చాలా కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడనుంది. వివాహ సంబంధాలలో పరస్పర ప్రేమ పెరుగుతుంది.

సింహ రాశి
ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కంటెంట్ మార్కెటింగ్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉన్నవారు లాభపడతారు. తప్పుడు పనులు చేయడంపై ఆసక్తి చూపిస్తారు. షేర్ మార్కెట్ సంబంధిత వర్గాలు నష్టపోతారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకోవాలి అనుకుంటే జాగ్రత్తగా ఉండాలి.

కన్యా రాశి
ఈ రోజు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ పనిలో నాణ్యత పెరుగుతుంది. మీ లక్ష్యాల నుంచి దృష్టి మరల్చకండి. . వివాహ సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త..ప్రత్యేక శ్రద్ధ వహించండి. మానసిక ఆరోగ్యం కూడా బాగా ఉండదు.

తులా రాశి
ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారు ఈరోజు ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండవలసి ఉంటుంది...లేదంటే ఇరుక్కుపోతారు. మీ ప్రవర్తన కారణంగా మీ చుట్టూ ఉండేవారు కొంత కోపాన్ని ప్రదర్శిస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దు

వృశ్చిక రాశి
ఈరోజు మీ పనులు పూర్తిచేసుకునే పనిలో పడండి. డబ్బు విషయంలో ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరస్థితులుంటాయి. కార్యాలయంలో మీ పనిపై ఎక్కువగా ఆధారపడతారు. విదేశీ ప్రయాణాలు ఉండొచ్చు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

ధనుస్సు రాశి
ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల మధ్య మాటా మాటా పెరిగినా కాస్త ఓపికగా వ్యవహరించండి. ఉద్యోగులు పని విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఉద్యోగం మారేందుకు ఇది సరైన సమయం కాదు. విద్యార్థుల మనసు చదువుపై నుంచి చలిస్తుంది.

మకర రాశి
ఈ రోజు డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. మతపరమైన పనులపై మీ విశ్వాసం బలంగా ఉంటుంది. పెద్ద కంపెనీ నుంచి పెద్ద ఉద్యోగ ఆఫర్లు వచ్చే అవకాశాలున్నాయి. మీ జీవిత భాగస్వామికి బహుమతి ఇవ్వడానికి మీరు ఒక ప్రణాళిక వేసుకుంటారు

కుంభ రాశి
ఈ రోజు మీ కుటుంబంలో చాలా సంతోషం ఉంటుంది. అందరి మధ్యా పరస్పర అనురాగం పెరుగుతుంది. ఓ శుభవార్త వింటారు. కొత్తపనులేవీ ఇప్పుడు ప్రారంభించవద్దు. ఉద్యోగులు కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలి

మీన రాశి
ఈ రోజు మీరు ఆఫీసు పనులుతో పాటూ ఇతర పనులతోనూ బిజీగా ఉంటారు. ఆస్తికి సంబంధించి పెద్ద ఒప్పందం కుదరవచ్చు. పిల్లల విషయంలో కొంచెం ఆందోళన చెందుతారు. కోపం, తొందరపాటు కారణంగా చేసిన పని చెడిపోతుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో గొడవ పడతారు.