మేష రాశి అనుకున్నపనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులుకు శుభసమయం. వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. పెండింగ్ లో ఉన్న మొత్తం అనుకోకుండా చేతికందుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థికపరిస్థితి బావున్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి.
వృషభ రాశి ఈ వారం మీరు ప్రారంభించిన పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా అధిగమించి పనులు పూర్తిచేస్తారు. చిన్న చిన్న విషయాలకే కుంగిపోవద్దు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. తీసుకున్న అప్పులు చెల్లించగలుగుతారు. వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
మిథున రాశి ఉద్యోగులు, వ్యాపారుల శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. అప్పులబాధలు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులకు ఇదే మంచి సమయం. శుభకార్యాల నిర్వహణపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి వారం ఆరంభంలో కొంత అటు ఇటుగా ఉన్నా రాను రాను పరిస్థితులు అనుకూలిస్తాయి.
కర్కాటకం ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవడంలో బిజీగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది..కొత్తగా వేసే అడుగులు మంచి ఫలితాన్నిస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
సింహ రాశి ఈ వారం సింహ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి. అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోకుండా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. అధిక ఒత్తిడికి గురికాకుండా పనులు పూర్తిచేసుకోవాలి. వ్యాపారులు లాభాలు పొందుతారు...నూతన పెట్టుబడులకు అనుకూలం.
కన్యా రాశి ఈ రాశివారు చేపట్టిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలున్నా పట్టుదలగా వ్యవహరించి పనులు పూర్తిచేస్తారు. ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకునేందుకు ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి ప్రోత్సాహం ఉంటుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు