మేష రాశి మేష రాశివారికి డిసెంబరు నెల మిశ్రమ ఫలితాన్నిస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో హడావుడిగా ఉంటారు. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సంఘంలో పెద్దవారిని కలుస్తారు.
వృషభ రాశి ఈ రాశివారికి కూడా డిసెంబరు నెలలో గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. బుధుడు, శుక్రుడు, సూర్యుడు రాశి మారుతున్నందున ఈ రాశివారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.స్థిరాస్తి విషయాలలో నిరాశ ఉండవచ్చు. పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలో ఉన్నవారు ఇంకొంత కాలం ఆగడం మంచిది.
మిథున రాశి మిథున రాశివారికి కూడా డిసెంబరు మిశ్రమ ఫలితాలనే ఇస్తోంది. వక్రంలో కుజుడి సంచార ప్రభావం మీపై ఉంటుంది. వృత్తి రీత్యా పర్వాలేదు అనిపించినా..ధన వ్యయం విపరీతంగా ఉంటుంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. బంధు మిత్రులత విరోధాలు, సోదర నష్టం ఉండొచ్చు. వాహనం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది
కర్కాటక రాశి ఈ నెల కర్కాటక రాశివారికి శుభాశుభాలు మిశ్రమంగా ఉంది. కెరీర్ పరంగా అనుకూల ఫలితాలున్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ మాటలు గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సరిగ్గా ప్లాన్ చేసుకోపోవడం వల్ల రాబడికి మించిన ఖర్చులుంటాయి.
సింహ రాశి సింహరాశివారు డిసెంబరు నెలలో ఆదాయానికి కొంత ఇబ్బంది పడతారు. చేసే వృత్తి వ్యాపారాలు అంతగా కలసి రావు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనోధైర్యం కోల్పోవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. స్నేహితులతో విబేధాలు ఉండొచ్చు. వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి డిసెంబరు నెల మకర రాశివారికి శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలు వేస్తారు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు.
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు