అన్వేషించండి

Karthika Deepam మార్చి 9 ఎపిసోడ్: 'మామా ఏక్ పెగ్ లా' సాంగ్ కి డాన్స్ ఇరగదీసిన వంటలక్క

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మార్చి 9 బుధవారం 1295 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

కార్తీకదీపం(Karthika Deepam) మార్చి 9 బుధవారం ఎపిసోడ్

బాధపడడం అలవాటు పడి లేని సమస్యలు ఊహించుకుని బాధపడుతున్నట్టుంది సౌందర్య నువ్వు అని క్లాస్ వేస్తాడు ఆనందరావు. మీరు ఎన్నైనా చెప్పండి నాకెందుకో మనసు ప్రశాంతంగా లేదంటుంది సౌందర్య. భయం గుప్పిట్లో బందీ అయిపోయి దాంట్లోంచి బయటకు రాలేకపోతున్నానంటుంది. భయం పిరికిది అందుకే అది మనసుచాటునుంచి భయపెడుతూ ఉంటుంది..అందుకే భయాన్ని వదిలేసి ధైర్యంగా ఉండు అని సముదాయిస్తాడు. 

చిక్ మంగుళూరు రిసార్ట్ లో వంటలక్క-డాక్టర్ బాబు మందుకొడతారు. వద్దంటూనే దీప పెగ్గుల మీద పెగ్గులేస్తూ ఊగుతుంటుంది. ఎత్తినగ్లాసు దించకుండా తాగుతున్న దీపని ఆగు ఆగు అంటాడు. ఏంటి ఆగేది..చికెన్ ఎవరు తినిపిస్తారంటే కార్తీక్ తినిపిస్తాడు.
కార్తీక్: వద్దు వద్దంటూనే అలా తాగేశారేంటి..కొంచెం కొంచెం తాగాలి
దీప: మేడం ఎవరు నువ్వు డాక్టర్ బాబు-నేను వంటలక్క..మధ్యలో మేడం ఎక్కడినుంచి వచ్చింది, ఎవరా మేడం, యూ టెల్, ఐ హియర్...హూ మేడం
కార్తీక్: మేడం అంటే ఇంకెవరో కాదు మేడం మీరే
దీప: ఐ మేడం..ఏంటి డాక్టర్ బాబు నన్ను మేడం అని పిలుస్తారా..ఏంటి సామి ఇది
కార్తీక్: అప్పుడప్పుడు మందు కొడితే ధైర్యం పెరుగుతుంది...రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది, ఎలా ఉంది మేడం 
దీప: ఎలాగో ఉంది...ఏదైనా మీరు గొప్పవారు డాక్టర్ బాబు
కార్తీక్: వై...
దీప: పెళ్లాన్ని టూర్ తీసుకొచ్చి పిల్లలకు తెలియకుండా మందు తాగిస్తున్నారు
కార్తీక్: మీరు గొప్పేళ్లే మేడం.. కష్టాల్లో ఉన్నప్పుడు ఓపిక పట్టావ్, నేను తప్పు చేసినా క్షమించావ్...మీరు గ్రేట్ మేడం 
దీప: హలో డాక్టర్ బాబు అవన్నీ వదిలేయండి..ఆ టాపిక్ ఎత్తకండి...గోలీమార్ ..పాత విషయాలు అన్నింటికీ గోలీమార్, మీరున్నారే నిజంగా గొప్పవారు...వద్దు వద్దు అంటున్నా మందు తాగించారు,ఇంకో పెగ్గు వేయ్
కార్తీక్: ఇక చాలు మేడం...
దీప: చాలా..ఏంటి సార్ నన్నేమనుకుంటున్నారు నాకు మందు ఎక్కువైంది అనుకుంటున్నారా నేను పడిపోతా అనుకుంటున్నారా...ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకోనా...
కార్తీక్: మీ వల్ల కాదు
దీప: నా వల్ల కాదా..నా వల్ల ఏదైనా అవుతుంది..దీప ...దీప ఇక్కడ...మిమ్మల్ని ఎత్తుకుని చూపించమంటారా
కార్తీక్: పడేస్తావ్ వద్దు దీపా
దీప: నేను ఫస్ట్ టైం మందుతాగుతున్నా..పడిపోతా అనిభయపడుతున్నారా ....పెద్ద పెద్ద కష్టాలే చూసింది వంటలక్క..ఇదెంత పని చెప్పండి... ఇవన్నీ గుర్తుండిపోతాయ్ సార్.. హైదరాబాద్ వెళితే ఏముంటుంది..నేను వంటలక్క-మీరు డాక్టర్ బాబు. మీరేమో కార్లో హాస్పిటల్ కి వెళుతూ దీప వెళ్లొస్తాను, మమ్మీ వెళ్లొస్తాను అంటాను. డాక్టర్ బాబు లంచ్ బాక్స్ తీసుకెళ్లండి-వేళకి తినండి అంటాను. ఇలా మందు కొట్టే అవకాశం మళ్లీ మళ్లీ రాదుకదా 
కార్తీక్: మీకు మందు ఎక్కువైంది మేడం
దీప:ఊరికే మందు ఎక్కువైందని అనకురా
కార్తీక్: రా.....అంటావా
మొత్తానికి దీప-కార్తీక్ తాగి తూగుతారు. బయట ఎవరో డాన్స్ వేస్తున్నారని కార్తీక్ చెప్పడంతో... నాతో నువ్వు డాన్స్ చేయగలవా అని ఛాలెంజ్ చేస్తుంది వంటలక్క. 

Also Read: రిషికి మహేంద్ర క్లాస్-దేవయానికి వసు వార్నింగ్, జగతి ఏం చేయబోతోంది

మోనిత స్కెచ్: కార్తీక్ తన కుటుంబంతో సహా చిక్ మంగుళూర్ వెళ్లాడని తెలిసిన మోనిత.. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా కార్తీక్ అనుకుంటుంది. గతంలో చిక్ మంగుళూరులో విహారి-దీపపై కార్తీక్ కి అనుమానించిన సంఘటనలు గుర్తుచేసుకుంటుంది. మరోవైపు వంటలక్క-డాక్టర్ బాబు డాన్స్ చేయడానికి వెళతారు. అప్పుడే అక్కడకు వచ్చిన పిల్లలు తల్లిని మోడ్రన్ డ్రెస్సులో చూసి అవాక్కవుతారు. ఇద్దరూ పచ్చబొట్టు చూపిస్తారు. తాగి తూగుతున్న వంటలక్కని చూసి..అమ్మకి ఏమైంది అదోలా ఉందని అడుగుతారు. అమ్మ నిద్రమత్తులో ఉందని కార్తీక్ చెబుతున్నా..నేను  నిద్రమత్తేంటి డాన్స్ చేద్దాం అంటే ఈ మీటింగ్స్ ఏంటంటూ పిల్లల్ని తీసుకుని వెళుతుంది. మామా ఏక్ పెగ్ లా సాంగ్ కి డాన్స్ చేస్తారు. కార్తీక్ పిల్లల్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. 

దీప-కార్తీక్: ప్రశాంతంగా నిద్రపోతున్న దీపని చూస్తూ..తాగాక చేసిన అల్లరి మొత్తం గుర్తుచేసుకుంటూ ఎంత రచ్చ చేశావ్ దీపా, అసలు నీకు అవన్నీ గుర్తున్నాయా ..జన్మ ధన్యం అయినట్టుగా ఉంది, మనిద్దరం మందుకొట్టడం, డాన్స్ చేయడం..ఇదంతా బావుంది దీపా అనుకుంటాడు. ఇంతలో దీప నిద్రలేవడంతో గుడ్ మార్నింగ్ దీప మేడం అంటాడు. రాత్రి ఏం జరిగింది...ఏం చేశాను అని అడుగుతుంది. నేనేమైనా ఎక్కువ చేశానా అంటే..అవును ఎక్కువ చేశావ్ నా ఆనందాన్ని అని రిప్లై ఇస్తాడు. కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు...ఎపిసోడ్ ముగిసింది.....

Also Read: చనిపోయిన వంటలక్క, డాక్టర్ బాబు- కార్తీకదీపం సీరియల్ కి ఇదే క్లైమాక్సా

రేపటి(గురువారం) ఎపిసోడ్ లో
చిక్ మంగుళూర్ అందాలను ఎంజాయ్ చేస్తుంటారు దీప-కార్తీక్ పిల్లలు. ఇంతలో హిమ అమ్మ కార్లో కూర్చో అంటుంది. దీప కూర్చోగానే నేను నడుపుతా అంటూ హిమ స్టార్ట్ చేసేస్తుంది. ఎంత చెప్పినా వినకుండా కార్ డ్రైవ్ చేస్తుంది. అసలే హిల్ స్టేషన్...కంట్రోల్ కాకపోవడంతో కార్లోంచి కేకలు పెడతారు. పరిగెత్తి వెళ్లిన డాక్టర్ బాబు కార్లో కూర్చుని కంట్రోల్ చేసేలోగా రాయిపైకి ఎక్కిన కారు కొండపైనుంచి బోర్లా పడి మంటలు చెలరేగుతాయి..శౌర్య కొండపై ఉంటుంది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget