అన్వేషించండి

Guppedantha Manasu మార్చి 8 ఎపిసోడ్: రిషికి మహేంద్ర క్లాస్-దేవయానికి వసు వార్నింగ్, జగతి ఏం చేయబోతోంది

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.జగతిని తన క్యాబిన్ కి పిలిచిన రిషి గాయం చేసిన బాణాన్నే మందు అడుగుతున్నా అంటాడు. మార్చి 8 మంగళవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంత మనసు మార్చి8 మంగళవారం ఎపిసోడ్

రిషి బాధకి కారణం మనమే కదా మహేంద్ర అన్న జగతితో..నాణేనికి రెండు వైపులా చూడు...మనం బంధం ఏంటో మనకు తెలుసు కొత్తగా తెలిసింది ప్రపంచానికి..అది ఎప్పుడో అప్పుడు తెలియాలి కదా...ఈరోజు బాధఅనిపించినా భవిష్యత్ లో బావుంటుంది అన్న మహేంద్రతో... అంతా చేయి దాటిపోయింది, ఇప్పుడు ఎవరేమనుకుంటారో అనేకన్నా రిషి బాధపడుతున్నాడే బాధ కలచివేస్తోంది. ఒకప్పుడు రిషి నన్ను తల్లిగా అంగీకరించాలని కోరుకున్నాకు కానీ ఇప్పుడా ఆశ లేదు..నన్ను తల్లిగా ఒప్పుకోపోయినా పర్వాలేదు కానీ తను సంతోషంగా ఉంటేచాలు. రిషి కళ్లలో ఆనందం తప్ప కన్నీళ్లు నేను చూడలేను అంటుంది జగతి.

ఇద్దరు లెక్చరర్లు
రిషి సార్, జగతి మేడం కొడుకుని మనకు తెలియదు..వాళ్లిద్దరూ సార్-మేడం అనిపిలుచుకున్నారు. వాళ్లెంత గుట్టుగా దాచిపెట్టారో, మహేంద్రసార్-జగతి మేడం చనువుగా ఉండడం చూసి నాక్కూడా ఏదో అనిపించింది. వీళ్లింతగా నాటకాలు ఆడుతున్నారంటే ఏదో పెద్దగొడవే జరిగి ఉంటుంది మేడం, ఎవరు ఎవర్ని వదిలేశారో తెలియదు కానీ అందరూ ఒకే కాలేజీలో పనిచేస్తున్నారు..ఇద్దరూ బాగానే ఉంటారు నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు మరి విడివిడిగా ఎందుకుంటున్నారు... పేరుకే పెద్దోళ్లు అంటారు కానీ వాళ్లలో ఎన్నో లోపాలు...వదిలేసిన తర్వాత కూడా ఇద్దరూ వేర్వేరుగా పెళ్లిచేసుకోలేదంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అనుకుంటారు. ఆ పక్కనే ఉన్న రిషి ఈ మాటలు విని ...ఆ లెక్చరర్లని పిలిచి ఓసారి జగతిమేడంని నా క్యాబిన్ కి రమ్మని చెప్పండి అనేసి వెళ్లిపోతాడు. అంతా విన్నాడంటావా అనుకుంటూనే..వింటే విననీ ఉన్నదేగా అన్నాం అనుకుంటారు.

Also Read: చనిపోయిన వంటలక్క, డాక్టర్ బాబు- కార్తీకదీపం సీరియల్ కి ఇదే క్లైమాక్సా

గౌతమ్-వసుధార
జగతి-రిషి మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటుంది వసుధార. వసుని ఒంటరిగా చూసిన గౌతమ్ ఇదే మంచి తరుణం అనుకుంటూ వెళ్లి పక్కన కూర్చుంటాడు.
గౌతమ్: జగతి మేడం రిషి మదర్ అని నీకు ఎప్పటి నుంచో తెలుసా..నీకు మేడం క్లోజ్ కదా అందుకే అడిగాను
వసుధార: ఆ టాపిక్ మనం మాట్లాడటం అంత బావోదేమో
గౌతమ్: నిజమే కానీ మన రిషి కదా అని అడిగాను
వసుధార: ఈ టాపిక్ వదిలేయండి..ఇలా మనం మాట్లాడుకోవడం సంస్కారం కాదు
గౌతమ్: నేనొకటి చెప్పాలి నీకు..మాటల్లో చెప్పడం కష్టమే కానీ తప్పడం లేదు... నేను నిన్ను ఘోరంగా, తీవ్రంగా, విపరీతంగా ప్రేమిస్తున్నాను..నీ బొమ్మ గీశాను, ప్రేమలేఖ రాశఆను, నీ పేరే తల్చుకుంటూ అలా గడిపేస్తున్నాను..ఐ లవ్ యూ వసుధార అని పక్కకు తిరిగి చూస్తాడు. అక్కడ వసుధార ఫ్రెండ్ పుష్ప ఉంటుంది. సార్ నాకు పెళ్లి కుదిరింది ఏంటి సార్ మీరు నన్ను ప్రేమించడం ఏంటి మీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి అని పుష్ప అనడంతో..ఐ లవ్ యూ నిన్ను అనుకుని చెప్పలేదన్న గౌతమ్ తో ఇది ఎవరికి చెప్పారు అంటుంది. నా నెక్స్ట్ షార్ట్ ఫిలింకోసం డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నా అంటూ పుష్పని అక్కడి నుంచి పంపించేస్తాడు.

దేవయాని-రిపోర్టర్
ప్రెస్ మీట్లో జగతిని ప్రశ్నలు అడిగిన రిపోర్టర్ కాల్ చేసిన దేవయాని..నేను చెప్పిందేటి నువ్వు చేసిందేంటని ప్రశ్నిస్తుంది. ఈ న్యూస్ సోషల్ మీడియా, పేపర్, టీవీల్లో రావాలి కదా ..ఆ మేటర్ బయటకు రావాలి రచ్చరచ్చ కావాలని చెప్పాను కదా..మంచి అవకాశం దొరికింది దీన్ని వాడుకోవాలని నేను చూస్తుంటే నువ్వేంటి ఏమీ చేయడం లేదంటుంది. ఈ మేటర్ బయటకు రాకూడదని వార్నింగ్ వచ్చిందని..ఎండీ రిషీంద్ర భూషణ్ గారు చెప్పారంటూ కాల్ కట్ చేస్తాడు రిపోర్టర్. ఆ మాటలు విన్న దేవయాని.. జగతిని తొక్కేయడానికి మంచి అవకాశం దొరికిందని నేను ట్రై చేస్తుంటే దానికి రిషి అడ్డుపడుతున్నాడా...రిషి-జగతిని విడిదీలాయలంటే ఇంతకన్నా మంచి అవకాశం రాదు.. ఈ విషయాన్ని ఎలాగైనా రచ్చ రచ్చ చేయాలి అనుకుంటూ వెనక్కు తిరగ్గానే ఎదురుగా ధరణి కనిపిస్తుంది. నువ్వేంటి ఎప్పుడొచ్చావ్... రూమ్ లోకి వచ్చేముందు డోర్ కొట్టాలని తెలియదా ..నేను మాట్లాడిన మాటలు విన్నావా అంటుంది. ఎందుకొచ్చావ్ అంటే కూరలు ఏం చేయమంటారని అడుగుతుంది. ఆగు అని దేవయాని అనడంతో స్వీట్ ఏమైనా చేయమంటారా అన్న ధరణితో...నేను అడిగానా అనిఫైర్ అవుతుంది. రిషి ఏమంటున్నాడు, ఎప్పటిలానే ఉన్నాడా నీతో మాట్లాడాడా అంటే..లేదు నాతో మాట్లాడలేదు అంటంది ధరణి. మహేంద్ర నీతో చెప్పాడా అంటే ఏమీ లేదంటుంది. ఇక్కడి నుంచి పో అని తిట్టి డోర్ గట్టిగా వేస్తుంది.

Also Read: ప్రశ్నించే గొంతులు, గుసగుసలు ఆగాలన్న రిషికి జగతి చెప్పే సమాధానం ఇదేనా

రిషి-జగతి
రిషి సార్ ఎందుకు రమ్మన్నట్టు అనుకుంటూ రిషి క్యాబిన్లో అడుగుపెడుతుంది జగతి
జగతి: సార్ రమ్మన్నారట
రిషి: కూర్చోండి మేడం
జగతి: జరిగిన సంఘటన గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు..కానీ అందరూ దానిగురించే మాట్లాడుకుంటున్నారు. మనసుకి బాధ కలిగితే మనం మౌనంగా ఉంటాం.. కానీ ఇతరుల నోర్లు మూయించలేం కదా.. ఇలాంటి పరిస్థితి వస్తుందని భయపడుతూనే ఉన్నాను కానీ ఇలా ఎదురవుతుందని అస్సలు ఊహించలేదు. అవమానమో, పరాజయమో ఎవరిది ఓటమో, ఎవరిది గెలుపో తెలియని పరిస్థితి. స్టూడెంట్స్ ముందు, మినిస్టర్ గారి ముందు,మీడియా ముందు ఇలా జరిగి ఉండాల్సింది కాదు. మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానంటే..తప్పొప్పులు తవ్వుకుంటే మర్యాదగా ఉండదు.. ఓసారి చెప్పాను డాడ్ కి దూరంగా ఉండమని, మినిస్టర్ గారి ప్రోగ్రామ్ కి ముందే హెచ్చరించాను... జరగాల్సిన నష్టం జరిగింది...ఆ నష్టం ఒక జీవితం. ఏం చేయాలో ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తెలియదు. బంధానికి బురద అంటించారు. ప్రతిరోజూ గుచ్చి గుచ్చి చూసే చూపులు, మనం నడుస్తుంటే వెనుక వినిపించే గుసగుసలు...ఏంటి మేడం ఇది...కాలేజీకి వచ్చారు..జాబ్ లో చేరారు.. మీ ఇద్దరి చనువు ..మీ బంధాన్ని నేను ప్రశ్నించలేదు. కానీ ఇఫ్పుడు ఆ అవసరం వచ్చింది అనుకుంటున్నాను. 
జగతి: నన్ను ఏం చేయమంటారు సార్
రిషి: ప్రశ్నించే గొంతులు ఆగిపోవాలి..వెనుక గుసగుసలు ఆగాలి..ఏం చేస్తారో అది మీ ఇష్టం మేడం..ఇక మీకు నేను చెప్పేది ఏముందని..మనసుకి గాయం ఈ రోజే అయిందేమీ కాదు మేడం, 22 ఏళ్లుగా గాయం పచ్చిగానే ఉంది. గాయం చేసిన బాణాన్నే గాయానికి మందు అడుగుతున్నాను...మీరే ఆలోచించండి ఏం చేయాలో
జగతి: ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ సైలెంట్ గా వెళ్లిపోతుంది.

క్యాబిన్ బయట ఉన్న వసుధార ఈ మొత్తం వింటుంది. రిషి క్యాబిన్ నుంచి ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన జగతిని ఏమైందని ప్రశ్నిస్తాడు మహేంద్ర. రిషి ఏమైనా అన్నాడా అని అడుగుతూ ఉండగానే ఏమీ సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోతుంది. వసుధారని పిలిచిన మహేంద్ర...నువ్వు జగతితో వెళ్లు, తనెందుకు ఏడుస్తోంది వెళ్లి చూసుకో ప్లీజ్ అంటాడు. 

రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
జగతిని ఏమన్నావ్ అన్న మహేంద్ర ప్రశ్నకి...సమస్యకి పరిష్కారం వెతకమన్నా అని సమాధానం ఇస్తాడు రిషి. ఎవరికి సమస్యకి..నువ్వే పెద్ద సమస్య రిషి. నీకు తల్లిదండ్రులం అవడమే మా తప్పా అంటాడు మహేంద్ర. కట్ చేస్తే చాలా ఆనందంగా ఉంది జగతి అంటూ ఎంట్రీ ఇస్తుంది దేవయాని. బాధపడేవాళ్లని చూసి ఆనందపడేవారిని ఏమంటారో మీరే ఆలోచించుకోండి అన్న వసుపై ఫైర్ అవుతుంది దేవయాని. నేను మీకన్నా గట్టిగా అరవగలను.. మీరు చేసిన ప్రతిపనీ రిషి సార్ కి చెప్పగలను అని కౌంటర్ ఇస్తుంది వసుధార.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Parvesh Verma BJP: కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ అభ్యర్థి.. ఇంతకీ ఎవరీ పర్వేశ్ వర్మ?
కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ అభ్యర్థి.. ఇంతకీ ఎవరీ పర్వేశ్ వర్మ?
Arvind Kejriwal: మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
Anna Hazare On AAP Loss: హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​
Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi Elections Results 2025 | మాస్టర్ మైండ్ Manish Sisodia ను వీక్ చేశారు..ఆప్ ను గద్దె దింపేశారు | ABP DesamDelhi Elections Results 2025 | Delhi గద్దె Arvind Kejriwal దిగిపోయేలా చేసింది ఇదే | ABP DesamArvind Kejriwal Lost Election | ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా ఓటమి | ABP DesamDarien Gap Crossing in Telugu | మానవ అక్రమరవాణాకు దారి చూపెడుతున్న మహారణ్యం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parvesh Verma BJP: కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ అభ్యర్థి.. ఇంతకీ ఎవరీ పర్వేశ్ వర్మ?
కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ అభ్యర్థి.. ఇంతకీ ఎవరీ పర్వేశ్ వర్మ?
Arvind Kejriwal: మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
Anna Hazare On AAP Loss: హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​
Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​
Bandi Sanjay: అవినీతి, అక్రమాల ఆప్‌ను ఢిల్లీ ప్రజలు ఊడ్చిపారేశారు - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అవినీతి, అక్రమాల ఆప్‌ను ఢిల్లీ ప్రజలు ఊడ్చిపారేశారు - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Delhi Elections 2025: ఢిల్లీలో మ్యాజిక్​ ఫిగర్​ దాటిన బీజేపీ, హస్తినలో ఆప్ కోటకు బీటలు!
ఢిల్లీలో మ్యాజిక్​ ఫిగర్​ దాటిన బీజేపీ, హస్తినలో ఆప్ కోటకు బీటలు!
Delhi Election Results: మనం మనం కొట్లాడుకుంటే ఇట్లుంటాది - ఢిల్లీ ఫలితాలపై ఒమర్ అబ్దుల్లా మీమ్ రిప్లై
మనం మనం కొట్లాడుకుంటే ఇట్లుంటాది - ఢిల్లీ ఫలితాలపై ఒమర్ అబ్దుల్లా మీమ్ రిప్లై
PM Modi: 'ANR భారతదేశానికి గర్వ కారణం' - అక్కినేని ఫ్యామిలీ మీట్‌పై ప్రధాని మోదీ ట్వీట్
'ANR భారతదేశానికి గర్వ కారణం' - అక్కినేని ఫ్యామిలీ మీట్‌పై ప్రధాని మోదీ ట్వీట్
Embed widget