Karthika Deepam మార్చి 8 ఎపిసోడ్: చనిపోయిన వంటలక్క, డాక్టర్ బాబు- కార్తీకదీపం సీరియల్ కి ఇదే క్లైమాక్సా

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మార్చి 8 మంగళవారం 1294 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం(Karthika Deepam) మార్చి 8 మంగళవారం ఎపిసోడ్

చిక్ మంగుళూరులో దీప-కార్తీక్ పిల్లలు రిసార్ట్ కు చేరుకుంటారు. పిల్లలు అంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్లని చూసి దీప-కార్తీక్ మురిసిపోతారు. మళ్లీ దీప గతంలో అక్కడ కార్తీక్ తో కలసి హ్యాపీగా స్పెండ్ చేసిన విషయాలు తలుచుకుని నవ్వుకుంటుంది. పిల్లలిద్దరూ ఓరూమ్, కార్తీక్ -దీప మరో రూమ్ కి వెళతారు. వెనుకనుంచి దీప కళ్లు మూస్తే..ఎవరబ్బా అన్న కార్తీక్ తో నేను కాక ఎవరుంటారు అని అలుగుతుంది. కదా...ఇక్కడికైనా ఎక్కడికైనా ఎవరొస్తారు వంటలక్క తప్ప అంటాడు కార్తీక్. బయటకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ డాక్టర్ బాబు అన్న దీపతో..ఈ ఐడియా అమ్మది..ఆ మాట ఆమెకు చెప్పు అంటాడు. కాల్ చేసిన దీప ఫోన్ కలవడం లేదేంటని కంగారుపడుతుంది. ఇక్కడ సిగ్నల్స్ సరిగా ఉండవు..వేరేచోట ట్రై చేద్దాంలే అంటాడు కార్తీక్. రిసార్ట్ నుంచి బయటకు వచ్చిన దీప...ఇక్కడకు వచ్చిన ఆనందం మనసులో ఉన్నా..దార్లో వచ్చేటప్పుడు హిమ అలా అనేసరికి ( భయపడకు శౌర్య మనం ఏం చచ్చిపోంలే )భయంభయంగా ఏదో అనిపిస్తోంది. 
కార్తీక్:  పిచ్చిపిచ్చిగా ఆలోచించకు
దీప: మనసులో ఏదో గుబులుగుబులుగా ఉంది
కార్తీక్: నా వంటలక్క ఎన్నో కష్టాలు ఎదుర్కొంది, ఒక్కమాటకే ఇంత భయపడుతోందా
దీప: బయటకు ధైర్యవంతురాలిలా కనిపిస్తున్నా లోపల చాలా పిరికిదాన్ని
కార్తీక్: ఏం కాదు 
దీప: మీకు దూరంగా ఉన్న రోజుల్లో చాలాసార్లు చచ్చిపోవాలి అనిపించింది
కార్తీక్: ఈ ప్రపంచంలో ఏ భార్య-భర్త పడనన్ని కష్టాలు మనం పడ్డాం, అన్నేళ్లు దూరంగా ఉన్నాం, ఎన్నో సంతోషాలు కోల్పోయాం, ఎన్నో అవమానాలు ఎదిరించాం... ఇప్పుడు అన్నీ పోయాయ్..నాకు నువ్వు నీకు నేను...డాక్టర్ బాబు-వంటలక్క ఇద్దరిమధ్యా వేరే వ్యక్తి లేరు..రారు..ఆ దేవుడు కూడా మనల్ని విడదీయలేడు

Also Read:
సౌందర్య ఇంట్లో
పిల్లలు లేకపోయేసరికి బోర్ కొడుతోందా శ్రావ్యా అంటాడు ఆనందరావు. అవును మావయ్య పిల్లలు ఉంటే సందడిగా ఉండేది అంటారు శ్రావ్య, ఆదిత్య. ఇంతలో సూట్ కేస్ సర్దుకుని కిందకు వచ్చిన సౌందర్య..నన్ను ఎయిర్ పోర్ట్ వరకూ డ్రాప్ చేయి ఆదిత్య....పెద్దోడి గురించి పూజారి అలా చెప్పినప్పటి నుంచీ నేను మనశ్సాంతిగా ఉండలేకపోతున్నా అంటుంది. మనం గుడికి వెళ్లాం కాబట్టి అలా చెప్పారు, ఆ మాటలకు నువ్వు కంగారుపడి మమ్మల్ని కంగారుపెడుతున్నావ్..కొన్ని మాటలు వినాలి, కొన్నే నమ్మాలి..పైవాడి రాతని మనిషి ఎప్పుడూ మార్చలేదు. ఇంతకాలం వాళ్లు ఎదుర్కొన్న కష్టాలకు మంచి ఇంకేం వస్తాయ్ అని ఆనందరావు,అవును కదా అని ఆదిత్య చెబుతారు. నా భయానికి తగ్గట్టుగా ఫోన్ కూడా కలవడం లేదని మరింత బాధని వ్యక్తం చేస్తుంది సౌందర్య. హిల్ స్టేషన్ కదా సౌందర్య సిగ్నల్స్ కూడా ఉండవ్ అంటుంది శ్రావ్య. ప్రింట్ తీసిన టికెట్స్ ఆనందరావు చింపేస్తే..ఆదిత్య టికెట్స్ క్యాన్సిల్ చేస్తాడు. 

Also Read: ప్రశ్నించే గొంతులు, గుసగుసలు ఆగాలన్న రిషికి జగతి చెప్పే సమాధానం ఇదేనా
ఫైర్ చుట్టూ ఎంజాయ్ చేస్తున్న హిమ,శౌర్య, కార్తీక్...అమ్మకూడా వస్తే బావుంటుంది అనుకుంటారు. వంటచేస్తున్న దీప దగ్గరకు వెళ్లిన కార్తీక్...ఈ వంటలక్క చేతి వంట తినేందుకైనా వచ్చే జన్మలో కూడా నువ్వే భార్యగా రావాలి అంటాడు. ఏం వంటలక్క తొందరగా కానీయ్..స్మెల్ అదిరింది అంటుంది హిమ. నన్ను వంటలక్క అంటారా ఆ హక్కు డాక్టర్ బాబుకి మాత్రమే ఉందంటూ గరిట పట్టుకుని హిమ చుట్టూ పరిగెడుతుంది. తూలిపడబోతున్న దీపని పట్టుకున్న కార్తీక్... వచ్చే జన్మలో నీ మొగుడిగా కాకపోయినా నీ చేతిలో గరిటలా పుడతా అంటాడు. ఇద్దరూ ఐ లవ్ యూ చెప్పుకుంటారు. వంట రుచి చూసి అదిరిపోయింది అంటారంతా. హిమ-శౌర్య ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.  
ఈ టూర్ వచ్చినందుకు పిల్లలు సంతోషంగా ఉన్నారు డాక్టర్ బాబు
కార్తీక్:ఏం వాళ్లమ్మ సంతోషంగా లేదా
దీప:నేను కూడా హ్యాపీనే
కార్తీక్:నేను హ్యాపీనో కాదా అడగవా
దీప:మీరు హ్యాపీ కాదా
కార్తీక్:అంటే ఇలాంటి వాతావరణంలో, పక్కన నువ్వుండగా , ఘుమ ఘుమలాడే చికెన్ వండగా..ఇంకా ఏదో...
దీప:ఒక్క నిముషం ఉండండి..మందుబాటిల్ తెచ్చిన దీప..ఇదే కదా అదేదో అంటుంది
కార్తీక్:దీప నువ్వు సూపర్ .. థ్యాంక్యూ..నాకింత మంచి పెళ్లానిచ్చావ్..థ్యాంక్యూ దేవుడా, మగాడి మనసు తెలుసుకున్న భార్య ఉంటే వాడికి భూమ్మీదే స్వర్గం ఉన్నట్టు. నేను తెచ్చుకోవడం మరిచిపోయాను..నువ్వెలా తెచ్చావ్
దీప:మా ఏర్పాట్లు మాకుంటాయ్ కదా..వారణాసి ఉన్నాడు కదా సామీ
కార్తీక్:నువ్వు నాకు నిజంగా సర్ ప్రైజ్ ఇచ్చావ్...ఈ రోజు ఆఖరిరోజైనా పర్వాలేదు
దీప:ఏంటి సామీ అలా మాట్లాడుతారు
కార్తీక్:ఏదో మాటవరుసకు అన్నాలే వంటలక్కా..అలగకు...నువ్వు నాకు సర్ ప్రైజ్ ఇస్తే ఊరుకుంటానా...నీతో కూడా రెండు పెగ్గులు తాగిస్తాను చూడు

Also Read:ఈ రోజే ఆఖరి రోజు అన్న కార్తీక్ మాటలకు షాక్ అయిన దీప

సౌందర్య ఇంట్లో:  సౌందర్య మాత్రం పూజారి మాటలు గుర్తుచేసుకుని బాధపడుతూ ఉంటుంది.  శ్రావ్య వచ్చి గమనించి..అంత పరధ్యానంలో ఉన్నారేంటి..భోజనం వద్దన్నారు పాలైనా తాగండి అంటుంది. నాకేం తినాలని లేదు తాగాలని లేదు నన్ను వదిలెయ్ అంటుంది. నీ ఆలోచనలకు ఆకలిని చంపేస్తున్నావా అంటూ ఆనందరావు క్లాస్ వేస్తాడు. పిల్లలు ప్రమాదంలో ఉన్నారని చెప్పారా...స్థల ప్రభావం అని చెప్పారంతే కదా... అదే పూజారి పెళ్లిచేసినప్పుడు పదేళ్లు విడిపోతారని చెప్పారా...లేదే... అప్పుడెందుకు హెచ్చరించలేదు... స్థల ప్రభావం అన్నారు ..ఈ ఇల్లు కట్టి ఎన్నాళైంది శుభాశుభాలు రెండూ జరిగాయ్.. మంచి జరిగితే వాస్తుబావుంది,లేదంటే బాలేదని అనుకోవడం పొరపాటు.అలాంటి మాటలు మనసులోకి తీసుకోవద్దన్న ఆనందరావుతో...అది కాదండీ అంటుంది సౌందర్య. ఇంత చెప్పినా అర్థంకావడం లేదా..పద డాక్టర్ దగ్గరకు వెళదాం అంటాడు. ఎందుకు అని శ్రావ్య అడగడంతో... అభద్రతా భావంతో ఉన్న మీ అత్తయ్యని బయటకు తీసుకురావాలంటే మన వల్ల కాదంటాడు. సమస్యలన్నీ తీరాక కూడా బాధపడడానికి ఏం ఉందని బాధపడుతున్నావ్... బాధపడడం అలవాటు పడి లేని సమస్యలు ఊహించుకుని బాధపడుతున్నట్టుంది. మీరు ఎన్నైనా చెప్పండి నాకెందుకో మనసు ప్రశాంతంగా లేదంటుందగి సౌందర్య.ఎపిసోడ్ ముగిసింది.

రేపటి(బుధవారం) ఎపిసోడ్ లో
చిక్ మంగుళూర్ అందాలను ఎంజాయ్ చేస్తుంటారు దీప-కార్తీక్ పిల్లలు. ఇంతలో హిమ అమ్మ కార్లో కూర్చో అంటుంది. దీప కూర్చోగానే నేను నడుపుతా అంటూ హిమ స్టార్ట్ చేసేస్తుంది. ఎంత చెప్పినా వినకుండా కార్ డ్రైవ్ చేస్తుంది. అసలే హిల్ స్టేషన్...కంట్రోల్ కాకపోవడంతో కార్లోంచి కేకలు పెడతారు. పరిగెత్తి వెళ్లిన డాక్టర్ బాబు కార్లో కూర్చుని కంట్రోల్ చేసేలోగా రాయిపైకి ఎక్కిన కారు కొండపైనుంచి బోర్లా పడి మంటలు చెలరేగుతాయి..శౌర్య కొండపై ఉంటుంది...

Published at : 08 Mar 2022 09:07 AM (IST) Tags: karthika deepam latest episode కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ karthika Deepam Serial Today Episode Vantalakka కార్తీకదీపం Nirupam Paritala premi viswanathSobha Shetty Karthika Deepam 8th March Episode 1294

సంబంధిత కథనాలు

Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!

Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

Ranga Ranga Vaibhavanga Teaser: బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ 

Ranga Ranga Vaibhavanga Teaser: బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ 

టాప్ స్టోరీస్

TS Govt : టీచర్ల ఆస్తుల ప్రకటనపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, విద్యాశాఖ ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు

TS Govt : టీచర్ల ఆస్తుల ప్రకటనపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, విద్యాశాఖ ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్‌ పెడతారట! 

CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్‌ పెడతారట! 

Actor Sai Kiran : పోలీసులను ఆశ్రయించిన గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి ఫాదర్- మోసం పోయానంటూ ఫిర్యాదు

Actor Sai Kiran : పోలీసులను ఆశ్రయించిన గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి ఫాదర్- మోసం పోయానంటూ ఫిర్యాదు