అన్వేషించండి

Karthika Deepam మార్చి 2 ఎపిసోడ్: కార్తీక్ ముందు మరోసారి బయటపడిన మోనిత నిజస్వరూపం

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మార్చి 2 బుధవారం 1289 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

కార్తీకదీపం మార్చి  2 బుధవారం ఎపిసోడ్
హాస్పిటల్ కి వెళ్లిన మోనిత, కార్తీక్... డెలివరీ లిస్టులు కలెక్ట్ చేస్తుంటుంది. ఎన్ని హాస్పిటల్స్ తిరగాలని కార్తీక్ అంటే..ఈ పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ముందే బాబు మిస్సయ్యాడు. డబ్బుకోసం ఎత్తుకెళితే ఈ పాటికి ఫోన్ చేసేవారు...అలా కాల్ చేయలేదంటే...ఎవరికో బాబు, పాప పుట్టి చనిపోతే తీసుకెళ్లి ఉంటారంటుంది. ఈ లిస్టు చూడు అంటూ చేతికిస్తుంది. అందులోంచి కోటేష్-శ్రీవల్లి పేర్లు తీసేశాను, నువ్వెప్పటికీ గుర్తించలేవు అనుకుంటూ వికృతంగా నవ్వుకుంటుంది. కావాలనే కిందపడబోతూ కార్తీక్ ని పట్టుకుంటుంది. చిరాగ్గా చూస్తున్న కార్తీక్ తో..నేనేం తప్పు చేశాను,నాపై కోపం ఎందుకు అంటూ మళ్లీ మొదలెడుతుంది. నీ ఆటోబయోగ్రఫీ వినేందుకు రాలేదన్న కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నా బిడ్డ నీ ఇంట్లోనే ఉన్నాడు... నీకు ఎప్పటికీ దొరకడు...ఆ వంకతో అయినా నీతో నేను తిరగొచ్చు అనుకుంటుంది.

Also Read: మహేంద్ర ఆవేశం, జగతి ఆనందం, రిషి కోపం, దేవయానికి షాక్
హిమ-దీప: పాలు కలుపుతున్న హిమ దగ్గరకెళ్లి ఏం చేస్తున్నావ్ అడుగుతుంది దీప. తమ్ముడికి పాలు కలుపుతున్నాను, మీరు పట్టించుకోవడం లేదు కదా అంటుంది. తాడికొండలో అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తమ్ముడిని ప్రేమగా చూసుకున్నావ్ కానీ ఇప్పుడేంటి మారిపోయావ్ అని అడుగుతుంది. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తున్నావ్, తమ్ముడిని నేను చూసుకుంటే కసురుకుంటున్నావ్, నేను తమ్ముడిని పట్టుకుని ఆడిస్తుంటే కూడా నీకు కోపం వస్తోంది, ఎందుకలా చేస్తున్నావ్ అంటూ సీరియస్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది హిమ. ఈ మాటలు విన్న సౌందర్య..అది అలా మాట్లాడుతోంది ఏంటి అంటే..హిమకి ఆనంద్ అంటే ప్రేమ, మనం ఒకక మాటన్నా పడేలా లేదంటుంది. ఇక నా వల్ల కాదు అన్న దీప...ఈ విషయం డాక్టర్ బాబుకి చెప్పేస్తాను అంటుంది.

మోనిత-కార్తీక్: కట్ చేస్తే కారు దిగిన మోనిత..థ్యాంక్స్ కార్తీక్, ఇలా నీ పక్కన కూర్చుని ప్రయాణించి ఎన్నాళ్లైందో అంటుంది. నీ బిడ్డని వెతికిస్తే నాకు దూరంగా వెళ్లిపోతానన్నావ్ లేదంటే జీవితంలో నీ దగ్గరకు వచ్చేవాడని కూడా కాదంటాడు. నువ్వు మాటమీద నిల్చుంటావని నాకు తెలుసు కార్తీక్..కానీ నాకో డౌట్ వచ్చింది అన్న మోనిత ఒకవేళ మన బిడ్డ దొరక్కపోతే అని క్వశ్చన్ చేస్తుంది. ఏంటీ అంటూ కార్లోంచి దిగిన కార్తీక్ తో...ఒకవేళ మన బిడ్డ దొరక్కపోతే మీ ఇంట్లో పెంచుకుంటున్న బాబుని నాకిచ్చేయండి అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని కార్తీక్ ఫైర్ అవుతుంటే..నేను కూల్ గానే మాట్లాడుతున్నా, నువ్వెందుకు ఫైర్ అవుతున్నావ్ అంటుంది. ఇంకోసారి ఆ మాట అనకు..వాడు మా ప్రాణం, వాడిని వదిలి మా ఇంట్లో వాళ్లు ఒక్క క్షణం కూడా ఉండలేరు..పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నీ దగ్గరున్నది మన బిడ్డే...ఈ విషయం నీకు తెలియడానికి ఇంకొంచెం టైమ్ పడుతుంది, ఆ లోగా నేను చేయాల్సింది చేస్తానంటూ క్రూరంగా నవ్వుకుంటుంది మోనిత.

దీప-కార్తీక్: హిమ మాటలు గుర్తుచేసుకుంటూ దీప బాధపడుతుంటుంది. అసలు నిజం దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేస్తున్నాను నన్ను క్షమించండి డాక్టర్ బాబు అనుకుంటుంది దీప. ఇంతలో అక్కడకు వచ్చిన సౌందర్య...ఏంటే నువ్వు కార్తీక్ కి నిజం చెబుతా అంటావేంటి, చెప్పేస్తే సమస్య పెద్దది అవుతుంది తప్ప పరిష్కారం కాదుకదా అంటే... నిజం దాచిపెట్టి మోసం చేస్తున్నానని బాధేస్తోంది అత్తయ్య అంటుంది దీప. నిజం చెప్పలేవు, ఎక్కువ రోజులు దాచలేవు ఏంటో నాక్కూడా ఏమీ అర్థంకావడం లేదంటుంది. ఏదో ఒకటి చేయకపోతే పిల్లలు మానసికంగా దూరమయ్యేలా ఉన్నారంటుంది. రోజురోజుకీ ఆనంద్ ని విడిచి ఉండలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు, రేపు ఆనంద్ ని మోనిత తీసుకెళితే అంటుండగా అక్కడకు కార్తీక్ వస్తాడు. ఇంతలేటైంది ఏంటని సౌందర్య అడిగితే..మోనిత బిడ్డ గురించి వెతుకుతున్నా అని సమాధానం చెబుతాడు. నిజం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం అనుకుంటారు సౌందర్, దీప. అసలు నువ్వు బిడ్డను వెతికి తెస్తానని ఒప్పుకోవడమే తప్పు అంటుంది సౌందర్య. బాబుని వెతికిస్తే మోనిత పీడ విరగడైపోతుందనే ఒప్పుకున్నా అంటాడు.

Also Read: మోనిత ఎత్తుకి సౌందర్య-దీప పైఎత్తు, మంగళవారం ఎపిసోడ్ లో ట్విస్ట్ అదిరింది
మోనిత-కార్తీక్: బిడ్డ దొరక్కపోతే పరిస్థితి ఏంటని దీప అంటే.. ఆనంద్ ని ఇవ్వమని అడుగుతోంది, అడిగితే మాత్రం ఇచ్చేస్తామా ఏంటి అంటూ...ఆనంద్ ని చూడగానే నా అలసట పోతుంది, వాడిని చూడకుండా అస్సలు ఉండలేనంటాడు. మోనితకి గట్టిగా సమాధానం చెప్పాలంటే మన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని కార్డ్స్ లోనూ ఆనంద్ ఫొటో ఉండాలంటాడు. ఇంత అర్జెంట్ గా ఎందుకు అని సౌందర్య అంటే... ఎవరి బిడ్డనో తీసుకొచ్చి పెంచుకుంటున్నారు అంటోంది కదా గట్టిగా సమాధానం చెప్పాలంటే ఇలాగే చేయాలంటాడు. 

మోనిత-పనిమనిషి: కట్ చేస్తే మోనిత ఇంట్లో హ్యాపీగా తిరగడం చూసిన పనిమనిషి విన్నీ...మీ కాలు అని అడుగుతుంది. కార్తీక్ ని ఇంట్లోకి రప్పించడానికి కాలునొప్పి  డ్రామా అది అంటే...మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది మేడం అంటుంది. మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది మేడం అన్న విన్నీతో...నా విశ్వరూపం చూస్తే తట్టుకోలేవు అంటూ డబ్బులు తీసి ఇస్తుంది. ఈ డబ్బుకి ఎన్ని చీరలు వస్తే అన్ని కొనుక్కురా బస్తీలో అందరకీ పంచుతాను...నా కార్తీక్ నా ఇంటికి వచ్చాడు కదా ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటా అంటుంది. ఇంటికొచ్చినందుకు థ్యాంక్స్ కార్తీక్...త్వరలో శాశ్వతంగా ఇంటికి రప్పిస్తానంటుంది. 

 సౌందర్య-కార్తీక్: బాబు దొరక్కపోతే మీ ఇంట్లో పెంచుకుంటున్న బాబుని నాకిచ్చేయండి అన్న మోనిత మాటలు గుర్తుచేసుకుంటూ నిల్చుంటాడు కార్తీక్. డాక్టర్ బాబుని చూస్తుంటే భయం వేస్తోంది అత్తయ్య అంటుమంది దీప. ఏంటో మోనిత మళ్లీ మనల్ని ఏం చేయబోతోందో ఏంటో అనుకుంటారిద్దరూ. ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటావా...హాస్పిటల్ పై కాన్సన్ ట్రేట్ చేయి కార్తీక్ అంటుంది సౌందర్య. మోనిత చేతిలో దారుణంగా మోసపోయినా ఎందుకు నమ్మానంటే తనని వదిలించుకునేందుకు ఇదో మంచి అవకాశం , అందుకే బాబుని వెతుకుతున్నా అంటాడు. నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది అన్న సౌందర్యతో మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి అంటాడు.

మోనిత బస్తీలో చీరలు పంచుతుంటుంది. పండుగలకు చీరలు పంచడం కొందరికే అలవాటు, నేను కూడా ఓ పండుగకే మీకు చీరలు పంచుతున్నా అంటుంది. ఈరోజు ఏం పండుగంటే నా కార్తీక్ నా ఇంటికి వచ్చాడు, నా ఇంట్లో కాలు పెట్టాడు, అంతకన్నా గొప్ప పండుగ ఏం ఉంటుంది అంటూ పెద్ద లెక్చర్ ఇస్తుంది. కార్తీక్ దీపకు మాత్రమే కాదు..నాక్కూడా మొగుడే అంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన దీప లాగిపెట్టి చెంపపై కొడుతుంది.

రేపటి (గురువారం) ఎపిసోడ్ లో
మోనిత ఎత్తుకి పై ఎత్తు వేసిన సౌందర్య ...బాబు..దత్తత ఇచ్చే కార్యక్రమం మొదలెడుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన మోనిత...ఆపండి అని అరిచి...బాబుని దత్తత ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తుంది. ఆనంద్ ని మనం దత్తత ఎందుకిస్తాం అని కార్తీక్ అడిగితే...పిల్లలు లేనివారికి ఆనంద్ ని దత్తత ఇస్తున్నాం అంటుంది సౌందర్య. ఇందుకు నేనొప్పుకోను అని మోనిత అరవడంతో... నువ్వెవరే ఒప్పుకోపోవడానికి అని ప్రశ్నిస్తుంది సౌందర్య. నేను వాడి కన్న తల్లిని అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget