అన్వేషించండి

Karthika Deepam మార్చి 11 ఎపిసోడ్: వంటలక్క-డాక్టర్ బాబు పాత్రలకి శుభం కార్డ్, హిమపై పగబట్టిన శౌర్య, రేపటి నుంచి సరికొత్త కార్తీక దీపం

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మార్చి 11 శుక్రవారం 1297 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

కార్తీకదీపం(Karthika Deepam) మార్చి 11 శుక్రవారం ఎపిసోడ్

చిక్ మంగుళూరులో ఉన్న కార్తీక్  ఫ్యామిలీ అంతా అక్కడి అందాలు ఎంజాయ్ చేస్తారు. ఇంతలో ఫోన్ సిగ్నల్ రావడంతో మమ్మీ నుంచి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయేంటంటూ కారు పక్కన ఆపి మాట్లాడేందుకు దిగుతాడు కార్తీక్. ఈ ప్లేస్ చాలా బావుందనుకుంటూ అంతా కిందకు దిగుతారు. కారు ఎలాగూ నడపడనివ్వడం లేదు కదా నడిపినట్టు యాక్ట్ చేస్తాను నువ్వు కూర్చో అంటుంది. మరోవైపు నాన్న ఫోన్ కి సిగ్నల్స్ దొరకడం లేదేమో నేను అటువెళ్లి ట్రై చేస్తానంటూ శౌర్య దూరంగా వెళుతుంది. హిమ పదే పదే అడగడంతో దీప కార్లో కూర్చుంటుంది. యాక్ట్ చేస్తానని చెప్పిన హిమ... దీప ఎంత చెబుతున్నా వినకుండా నిజంగా కార్ స్టార్ట్ చేసేస్తుంది. అసలే హిల్ స్టేషన్...కారు కంట్రోల్ కాకపోవడంతో డాక్టర్ బాబు అని దీప అరుస్తుంటుంది. ఆ వెనుకే పరిగెత్తిన కార్తీక్ నెమ్మదిగా కార్లోకి ఎక్కుతాడు. వాళ్ల వెనుకే శౌర్య పరిగెడుతుంటుంది. 

Also Read: మళ్లీ మొదలైన టామ్ ( రిషి) అండ్ జెర్రీ ( వసుధార) వార్
కాల్ ట్రై చేస్తానని చెప్పిన శౌర్య...సౌందర్యకి కాల్ లిఫ్ట్ చేసిన విషయం మరిచిపోయి కారు వెనుకే అమ్మా అంటూ పరిగెడుతుంది. అటు సౌందర్యలో కంగారు మరింత పెరుగుతుంది. పరిగెత్తి వెళ్లిన డాక్టర్ బాబు ఎట్టకేలకు  కార్లో కూర్చుని కంట్రోల్ చేసేలోగా రాయిపైకి ఎక్కిన కారు కొండపైనుంచి బోర్లా పడుతుంది. అంతలోనే కారు పేలిపోతుంది . అటు ఇంట్లో దేవుడి దగ్గర దీపాలు ఆరిపోతాయి. శౌర్య ఒక్కతీ కొండపై నిల్చుని ఏడుస్తుంటుంది. అటు సౌందర్యలో  ఫోన్లో పిలుస్తూనే ఉంటుంది...శౌర్య కళ్లు తిరిగి కింద పడిపోతుంది. టీవీ చూస్తున్న లక్ష్మణ్, అరుణ టీవీలో న్యూస్ చూస్తారు. కారు ప్రమాదంలో డాక్టర్ కార్తీక్ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయారని తెలిసి మోనిత దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి చెబుతాడు. షాక్ అయిన మోనిత వెంటనే టీవీ పెట్టుకుని చూసి కుప్పకూలిపోతుంది. బస్తీవాసులంతా సౌందర్య ఇంటికి చేరుకుంటారు. చాలా రోజుల తర్వాత సీరియల్  లో ఎంట్రీ ఇచ్చిన మురళీ కృష్ణ ఇంటి బయటే నిల్చుని ఏడుస్తుంటాడు. ఇంతలో సౌందర్య, ఆనందరావు అక్కడ ఒంటరిగా మిగిలిపోయిన శౌర్యని తీసుకొస్తారు. దీప-కార్తీక్ ని తల్చుకుని అంతా ఏడుస్తారు. దీపక్క మంచి తనం, డాక్టర్ బాబు మంచితనం చూసి ఆ దేవుడి కళ్లుకుట్టుకున్నాయంటూ  వారణాసి కన్నీటిపర్యంతమవుతాడు. ఇక మా బస్తీకి దిక్కెవరని అంతా బాధపడతారు. 

పూజారి ఈ విషయం ముందే చెప్పిన సంగతి గుర్తుచేసుకున్న సౌందర్య...మీకు ముందే తెలుసుకదా, నా బిడ్డలు ఇలా అయిపోతారని, స్థల ప్రభావం-జాగ్రత్త అన్నారు కానీ నీ బిడ్డల ప్రాణాలకు ప్రమాదం అని ఎందుకు చెప్పలేదయ్యా , నా కన్నపేగు కాలిపోతుందని ఎందుకు హెచ్చరించలేదని బోరున ఏడుస్తుంది. మీరెందుకు నాకు నిజం చెప్పలేదని పదే పదే పూజారిని అడుగుతుంది. ఇలా జరుగుతుందని అనుకులేదమ్మా అంటాడు పూజారి. పుట్టినప్పటి నుంచీ కష్టాల మధ్యే పెరిగింది, నా బిడ్డ కష్టాలు తీర్చమని ఆ దేవుడికి మొక్కని రోజు లేదు కానీ దాని కష్టాన్ని ఇలా తీరుస్తాడు అనుకోలేదని దీప తండ్రి మరళీకృష్ణ కన్నీళ్లు పెట్టుకుంటాడు.  ఆదిత్య,శ్రావ్య...ఇలా ఇల్లంతా ఏడుపులే. మొత్తానికి డాక్టర్ బాబు, వంటలక్క, హిమ ఫొటోలకు దండ వేసేశారు. 

Also Read: కాలి బూడిదైన డాక్టర్ బాబు, వంటలక్క- బావా మరదళ్లుగా దీప, కార్తీక్ రీఎంట్రీ ఉండబోతోందా
చాలా రోజుల తర్వాత సౌందర్య కూతురు, కార్తీక్ అక్క స్వప్న ఎంట్రీ ఇచ్చింది. నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిసి ఎక్కువగా సంతోషపడింది నేనే..కానీ ఇంతలోపే ఇలా జరిగిందేటి తమ్ముడు, నీ జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసిపోయిందేంటిరా  అని ఫొటోలకు పూలు వేస్తుంది. తల్లిపై కోపంతో మాట్లాడటం మానేసిన స్వప్న...తల్లి మొహం చూస్తూనే తండ్రి దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుని ఏడుస్తుంది. మన చేతుల్లో ఏముంది, జరగరానిది జరిగిపోయిందని అంతా బాధపడతారు. ఇప్పటి వరకూ చూపించని స్వప్న భర్త( సౌందర్య అల్లుడు) ని కూడా చూపించారు. ఇలా జరుగుతుందని ఎవరనుకుంటారు..రాసిపెట్టి ఉంది జరిగిపోయింది..మిమ్మల్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదంటాడు. మా రాత ఏంటయ్యా ఇలా రాశాడు దేవుడు అన్న సౌందర్య.. నా కొడుకు, కోడలు మళ్లీ కలిసారు ఇక సంతోషంగా బతుకుతారు అనుకున్నాను కానీ అర్థాంతరంగా మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్లిపోతారంటుంది. వాళ్ల జీవితం అలా ముగిసిపోయింది కనీసం మీరైనా కలిసి ఉంటారనుకుంటే మాకు ఆ ఆనందం కూడా లేదు...ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు పరాయివాళ్లలా బతికేస్తున్నారంటుంది( అంటే కూతురు-అల్లుడు కూడా కలసి లేరన్నమాట). 

తెల్లచీరలో మోనిత: ఎప్పుడూ కలర్ ఫుల్ గా కనిపించే మోనిత తెల్లచీరలో ఎంట్రీ ఇస్తుంది. నీ ఆత్మకి మాత్రం శాంతి కలగాలని కోరుకుంటున్నాను కార్తీక్ అంటూ పూలు వేస్తుంది. ఎందుకొచ్చావ్ ఇక్కడికి అని ఆదిత్య ఫైర్ అవుతుంటే సౌందర్య ఆఫుతుంది. 
మోనిత: ఎప్పుడూ కళ్లముందుండే కార్తీక్ ఈ రోజు ఈ ఫొటోలో మిగిలిపోయాడు, నా కార్తీక్ చచ్చిపోయాడు, కాదు చంపేశారు..అవును తన చావుకి కారణం మీరే..ఒక్క రోజైనా తనని మనశ్సాంతిగా ఉంచారా కనీసం తన ఇష్టానికి తనని వదిలేశారా..ఎంతసేపూ నాతో కలసి తిరుగుతున్నాడని బాధపెడుతూ, దూరం పెడుతూ వచ్చారు. చివరికి ఎవరికీ అందనంత దూరం పంపించేశారు..
ఆదిత్య: మా అన్నయ్యని మేం ఎలా చూసుకున్నామో నీకేం తెలుసు
మోనిత: మీరెంత బాగా చూసుకున్నారో నాకు బాగా తెలుసు..ఎందుకంటే ఎన్నోసార్లు కార్తీక్ కళ్లలో కన్నీరొచ్చినా..ప్రతీసారీ తనకి ఓదార్పు నేనే అయ్యాను, మీరెంత బాగా చూసుకున్నారన్నది నా దగ్గర సేదతీరిన కార్తీక్ నాతో చెప్పుకున్నాడు. అంతెందుకు ప్రపంచంలో భార్య-భర్త విడాకులున్నట్టు తల్లిదండ్రుల నుంచి కొడుకు విడిపోడానికి అవకాశం ఉందా మోనిత అని అడిగిమరీ నా దగ్గర బాధపడ్డాడు. ఒక్క విషయం మాత్రం చెబుతున్నాను...నాతో కార్తీక్ బంధం మీరనుకున్నట్టు తెంపేస్తే తెగిపోయే బంధం కాదు..చాలా పవిత్రమైనది..మాది ప్రేమ బంధం ఆ బంధంకి ఆస్తులు, అంతస్తులు ఏవీ అవసరం లేదు..ప్రేమకు ప్రేమ తోడుంటే చాలు..అంతకుమించి ప్రేమ ఎప్పుడూ ఏదీ కోరుకోదు. 

అనుబంధాన్ని అనుమానం నీడలు వెంటాడినా
ఆమె ఆత్మవిశ్వాసం పిల్లల కళ్లలో దీపమై వెలిగింది
విడిపోయిన ఈ జంట ఒక్కటవ్వాలని  ఒక్టవ్వాలని కోట్ల మంది చేసిన ప్రార్థలు నిజమైనా
ఆ సంతోషం క్షణికమై...ఊహించని విధంగా మనకు దూరమయ్యారు
కానీ...ఆ దంపతులు వదిలివెళ్లిన జ్ఞాపకాలు మనతోనే ఉన్నాయి
ఈ కొత్త తరం వేస్తున్న తొలిఅడుగులతో దివ్యకాంతులు విరజమ్మబోతోంది కార్తీకదీపం

కార్తీకదీపం రేపటి ( శనివారం)ఎపిసోడ్ లో
ఊహించినట్టుగానే హిమకి ఏం కాలేదు..బతికే ఉంది. కార్తీక్-దీప ఫొటోల పక్కనున్న దండేసి ఉన్న హిమ ఫొటో తీసి బయటకు విసిరికొడుతుంది శౌర్య. అది కరెక్ట్ గా హిమ కాళ్ల దగ్గర పడుతుంది. అమ్మా నాన్నని మింగేసిన భూతం అది...దాని గుర్తులు ఏవీ ఇంట్లో ఉండకూడదు. అమ్మా నాన్నని మింగేసిన రాక్షసి అది నాకు ఎప్పటికీ కాదు..నేను హిమని వదిలిపెట్టను...మళ్లీ ఇంట్లో దాని పేరు ఎవ్వరు ఎత్తినా నేను మీకు దక్కను అంటుంది శైర్య. ఆ మాటలు విన్న హిమ ఇంట్లోకి అడుగుపెట్టకుండా బయటకు వెళ్లిపోతుంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Embed widget