అన్వేషించండి

Guppedantha Manasu మార్చి 10 ఎపిసోడ్: మళ్లీ మొదలైన టామ్ ( రిషి) అండ్ జెర్రీ ( వసుధార) వార్

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. తన చినప్పుడు ఏం జరిగిందో తెలియక రిషి, కొడుక్కి దూరంగా ఉండలేక జగతి, మధ్యలో మహేంద్ర నలిగిపోతున్నారు.మార్చి 10 గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంత మనసు (Guppedantha Manasu) మార్చి 10 గురువారం ఎపిసోడ్

ఎపిసోడ్ ఆరంభంలోనే జగతి ఫోన్ రింగవడంతో..వసుధార లిఫ్ట్ చేస్తుంది. రిషి సార్ చేసింది చాలక ఇంకా ఏం చేద్దామనుకుంటున్నారు అని చిరాకుపడుతూ కాల్ లిఫ్ట్ చేసి  చెప్పండి సార్ అంటుంది. నీతో మాట్లాడాలి అనుకుంటే నీకే కాల్ చేసేవాడిని కదా అంటే..మీతో నేను మాట్లాడాలని అడుగుతుంది. సరే నేను ఎక్కడున్నానో చెబుతాను అక్కడకు రా అనగానే కాల్ కట్ చేస్తుంది వసుధార.

ఇంట్లో దేవయానిని చూసి ఇప్పుడీ మహానుభావురాలి మూడ్ ఎలా ఉందో ఏంటో అనుకుంటూ పైకి వెళుతుంటుంది ధరణి. కాఫీ తీసుకెళుతున్న ధరణి చేతిలోంచి కప్పు తీసుకున్న దేవయాని నువ్వెళ్లు నేను ఇస్తానంటుంది. ఎప్పుడూ లేనిది అత్తయ్యగారు చిన్న మావయ్యగారికి కాఫీ తీసుకెళుతున్నారు..పాపం చినమావయ్య గారూ మీరు అయిపోయినట్టే అనుకుంటుంది ధరణి. రూమ్ లో బుక్ చదువుకుంటున్న మహేంద్ర బోర్ కొడుతుంది అనుకుంటాడు. డోర్ తోసిన దేవయానిని చూసి రండి వదినా అంటాడు.
మహేంద్ర: ఏంటి వదినా నడుస్తూ కాఫీ తాగుతున్నారా
దేవయాని: కాఫీ తాగుతూ ఇల్లంతా తిరగడం లేదు మహేంద్ర...నీకే తీసుకొచ్చాను
మహేంద్ర: మీరు కాఫీ ఇవ్వడమే ఎక్కువ అది మీ గొప్పతనం..తాగుతాను ఇవ్వండి
దేవయాని: ఈ మధ్య డల్ గా కనిపిస్తున్నావ్..రిషి కోసం ఆలోచిస్తున్నావా.. రిషి కోసం ఆలోచిస్తున్నావని అనుకోవడం లేదు... కాలేజీలో జరిగిందాన్ని మరిచిపోలేదా.. పాపం అంతమంది ముందు ఆ రిపోర్టర్ అలా మాట్లాడాల్సి ఉండకూడదు
మహేంద్ర: ఏం జరిగినా మన మంచికే..ఆ సూత్రాన్ని నేను బాగా నమ్ముతాను.. ఏదేవతలు దీవించారో , ఏ రాక్షసులు శపించారో ఎవరేం చేశారో తెలియదు కానీ జగతి ఆరోజు కాస్త బాధపడినా మా ఇద్దరికీ మంచే జరిగింది..ఎన్నో ఏళ్లుగా మా ఇద్దరి మధ్యా ఉన్న బంధం ప్రపంచానికి ఎలా చెప్పాలో అర్థం కాక తలనొప్పితో ఉన్నాను...ఇప్పుడు నేను ఫుల్ హ్యాపీ... అయినా ఈ బంధాన్ని ఎన్ని రోజులు దాచేవారం... నేను జగతి మేడం అని, మహేంద్ర సార్ అని ఆమె పిలిచి చాలా ఇబ్బంది పడ్డాం. 
దేవయాని: ఏంటి ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చిందా...
మహేంద్ర:  మీ సీనియారిటీ నిరూపించుకున్నారు.. ఇకపై నుంచి కలసి కాలేజీకి, క్యాంటిన్ కి వెళతాం...
దేవయాని: ఆపు మహేంద్ర వినలేకపోతున్నాను
మహేంద్ర: మంచి మనసున్న మీలాంటి వాళ్లు ఏం చేసినా మాకు మంచే జరుగుతుంది..గురువు దండించినా శిష్యుడి మంచికోసమే కదా..
దేవయాని: అన్ని రోజులూ మనకు అనుకూలంగానే ఉండవు
మహేంద్ర: అనుకూలంగా ఉన్నప్పుడైనా సంతోషించాలి కదా
దేవయాని: రిషి దూరం కాకుండా చూసుకో
మహేంద్ర: ఇంత ఆనందం మధ్య వాడు ఓ మాట అన్నా హ్యాపీగా భరిస్తాం
ఊహించని కౌంటర్లకి విలవిల్లాడిన దేవయాని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది.

Also Read:  కాలి బూడిదైన డాక్టర్ బాబు, వంటలక్క- బావా మరదళ్లుగా దీప, కార్తీక్ రీఎంట్రీ ఉండబోతోందా
వసుధార-రిషి ఓ చోట చేరుతారు. జరిగిన విషయాలను ఓసారి గుర్తుచేసుకుంటుంది వసుధార.
రిషి: జగతి మేడంకి ఎందుకు కాల్ చేశారని అడగవా
వసుధార: నాతో మాట్లాడాలి అనకుుంటే నాకు కాల్ చేస్తారు..మేడంతో పని ఉండి ఆమెకి కాల్ చేశారు..ఏంటి ఎందుకని నేనెందుకు అడుగుతారు
రిషి: మీ మేడంగారికి ఓపని అప్పగించాను అదెంతవరకూ వచ్చిందో అడుగు
వసుధార: నేనెందుకు అడగాలి..మీరు కాల్ చేసి మాట్లాడండి
రిషి: ఏంటి అలా సమాధానాలు చెబుతున్నావ్
వసుధార: ప్రతీసారీ మనకు నచ్చిన సమాధానే దొరుకుతాయ్ అనుకోవద్దు
రిషి:నాతో ఏదో మాట్లాడాలి అన్నావ్
వసుధార: మీకు నచ్చని వ్యక్తులుంటే దూరం పెట్టండి సార్..కానీ బాధపెట్టాలి అనుకోవద్దు. 
రిషి: బాధపడితేనే కదా దూరం పెట్టాలి అనిపిస్తుంది
వసుధార: ప్రతి ఒక్కర్నీ మీ దృష్టికోణంలోనే చూస్తే ఎలా
రిషి; వేరేవారి దృష్టికోణంలో ఎలా ఆలోచించాలి...అప్పుడు నేను నేను ఎలా అవుతాను
వసుధార: మేడంకి ఏదైనా చెప్పాలనుకుంటే ధైర్యంగా చెప్పండి
రిషి: నా తప్పొప్పుల గురించి విశ్లేషణ చేయడానికి వచ్చావా
వసుధార: తప్పు-పొరపాటు రెండు వేర్వేరు... మీరేం చేస్తున్నారో ఆలోచించుకోండి
రిషి: ప్రతీసారీ మనమే కరెక్ట్ అనుకోవడం తప్పు... మీ మేడం అంటే గౌరవం కాబట్టి...నా వైపునుంచి తప్పులు కనిపిస్తున్నాయ్
వసుధార: ఇప్పుడు మీరు నా ఆలోచన గురించి విశ్లేషిస్తున్నారా
రిషి: ఇప్పుడు ఈ టాపిక్ వదిలెయ్..కోపంగా ఉన్నావ్...మేడంతో నేను కాలేజీలో మాట్లాడతాను
వసుధార: ఇక్కడే కూర్చోబెట్టి మ్యాథ్స్ క్లాస్ చెబుతారా
రిషి: ప్రతిదానికీ అడ్డంగా మాట్లాడుతున్నావ్
వసుధార: మీరు మాట్లాడితే కరెక్ట్.నేను మాట్లాడితే అడ్డంగా మాట్లాడటమా
రిషి: నువ్వ బయటపడవు కానీ నా కన్నా నీకు ఈగో ఎక్కువే
వసుధార: నా కన్నా మీకు పదిరెట్లు ఎక్కువే ఉంది మీకు, అయినా ఒప్పుకుంటే దాన్ని ఈగో అని ఎందుకంటారు
రిషి: నేను ఈగో చూపెట్టాలి అనుకుంటే జగతి మేడంని కాలేజీలో అడుగుపెట్టనిచ్చేవాడినే కాదు, ఇంటికి ఇన్వైట్ చేసేవాడిని కాదుకదా
వసుధార: తప్పని పరిస్థితుల్లో జగతి మేడంని కాలేజీకి రమ్మన్నారు, మహేంద్ర సార్ ఆనందంకోసం పండక్కి రమ్మన్నారు, మీరు ఒప్పుకోపోయినా నిజం ఇదే, నిజంగా మీకు ఈగో లేకపోయిఉంటే ఆరోజు జగతి మేడం ఇంటి నుంచి వెళుతున్నప్పుడు ఆపేవారు కదా...

Also Read:  మౌనంగా ఉన్నాం అంటే యుద్ధం మానేశాం అని కాదు, డైలాగ్స్ అదుర్స్
ఇంతలో రిషి ఫోన్ రింగవుతుంది..కాల్ లిఫ్ట్ చేసిన రిషి ఏదో మాట్లాడి  వచ్చిన తర్వాత మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఈగో గురించి , ఆ తర్వాత జగతిమేడం పండుగ గురించి అంటుంది వసుధార. వద్దనుకుంటూనే మేడం టాపిక్ మాట్లాడుతున్నాం అంటాడు రిషి. వెళదామా సార్ నాకు రెస్టారెంట్ కి టైం అవుతోందనడంతో కార్లో రెస్టారెంట్ దగ్గర దింపుతాడు. థ్యాంక్స్ అస్సలు చెప్పనని వసుధార..థ్యాంక్స్ చెప్పినా చూడను అని రిషి అనుకుంటారు. వసు లోపలకి, రిషి కార్లో బయటకు వెళతారు. ఈ పొగరేంటో ఈరోజు చాలా స్ట్రాంగ్ గా, ధైర్యంగా మాట్లాడింది..నన్ను మాట్లాడనివ్వలేదని రిషి..నేను తప్పుగా మాట్లాడలేదు తప్పుని తప్పు అని చెప్పడం మంచిదే కదా అని వసు అనుకుంటారు. బయటకు వెళ్లలేక మళ్లీ లోపలకు వచ్చిన రిషి..కాఫీకి పిలవొచ్చుగా అనుకుంటే పిలిస్తే వస్తారా, మళ్లీ ఈగో చూపిస్తారు నాకేంటి అనుకుని లోపలకు వెళ్లిపోతుంది. తగ్గేదే లే అనుకుంటూ వెళ్లిపోతాడు రిషి. 

జగతి-గౌతమ్: వసుధార మాటలు గుర్తుచేసుకున్న జగతి...నాకు ప్రశ్న, సమాధానం రెండూ రిషినే అనుకుంటుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో డోర్ తీసిన జగతి... ఎదురుగా ఉన్న గౌతమ్ ని చూసి వసుధార లేదని చెబుతుంది. నేను వసుధార కోసం రాలేదు..మీతో మాట్లాడాలి అంటాడు. రిషి స్కూల్లో నాకు బెస్ట్ ఫ్రెండ్ మీరు గొప్పవాళ్లు , మంచివాళ్లు మేడం. మహేంద్ర సార్ గురించి చెప్పాల్సిన పనే లేదుకదా అంటాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థంమైంది..నువ్వైమైనా ప్రశ్నలు అడగాలని వస్తేమాత్రం చెప్పే ఓపిక నాకు లేదంటుందిజగతి. నేను మిమ్మల్ని ప్రశ్నించేవాడినా..నేను రిషితో మాట్లాడుతా అంటాడు గౌతమ్. రికమండేషన్ తో ఉద్యోగం ఇప్పించవచ్చు కానీ అమ్మ ఉద్యోగాన్ని ఇప్పించలేం. తల్లీ కొడుకుల బంధం సంధి, రాజీ, రాయబారాలతో అవసరం లేదంటుంది. వాడొక మొండి ఘటం మేడం అంటాడు గౌతమ్. రిషి అవునన్నా కాదన్నా వాడు నా కొడుకు ..ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం అనేసి కాఫీ తెస్తా ఆగు అని లేచి వెళుతుంటుంది. ఇంతలో డోర్ దగ్గర రిషిని చూసి షాక్ అవుతుంది జగతి..ఎపిసోడ్ ముగిసింది...

రేపటి( శుక్రవారం) ఎపిసోడ్ లో
రెస్టారెంట్ డ్యూటీ ముగించుకున్న వసుధార...అమ్మో టైం చాలా అవుతోంది...అవసరం లేనప్పుడు రిషి సార్ ఠక్ మని ముందుకొచ్చి లిఫ్ట్ కావాలా అని అడుగుతారని అనుకునే  లోగా రిషి కారు వచ్చి ఆగుతుంది. లిఫ్ట్ కావాలా వసుధారా...అయినా ఈ టైంలో ఆటోలు దొరకవ్ ఏలాగూ అడగాలి కదా అనగానే నాకు లిఫ్ట్ వద్దు సార్ అంటూ ఇంతలో ఆటో రావడంతో ఎక్కేస్తుంది. ఆటోని ఫాలో చేసి కారు అడ్డంగా పెడతాడు రిషి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Osamu Suzuki : భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
Rohit Sharma News: రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
Charith Balappa Arrested: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
Embed widget